ప్రభన్యూస్

LPG: గ్యాస్ సిలిండర్ల కొరత వస్తుందా? పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా? ఐఓసీ కీలక నిర్ణయం! | బిజినెస్


Last Updated:

Indian Oil Corporation: హార్ముజ్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా? ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు చేపట్టిన ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) సొంతంగా చమురు, గ్యాస్ రవాణా నౌకలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది.

News18
News18

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి దగ్గర నౌకల రాకపోకలకు అంతరాయాలు ఏర్పడటంతో అంతర్జాతీయంగా చమురు రవాణా ఖర్చులు పెరుగుతున్నాయి. ఈ పరిణామాలు భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సరఫరాపై ప్రభావం చూపుతాయా? ధరలు పెరుగుతాయా? దేశంలో గ్యాస్ కొరత ఏర్పడుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు చేపట్టిన ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) సొంతంగా చమురు, గ్యాస్ రవాణా నౌకలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది.

ఈ ప్రతిపాదనకు ఐఓసీ బోర్డు ఇప్పటికే కొన్ని నౌకల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. ఇందుకోసం కొన్ని నెలల క్రితమే టెండర్లు కూడా జారీ చేసినట్లు కంపెనీ ఫైనాన్స్ డైరెక్టర్ అనూజ్ జైన్ వెల్లడించారు. రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలపై జరిగిన సమావేశంలో ఆయన ఈ వివరాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారత్‌లోనే నౌకలను నిర్మించే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

ప్రస్తుతం ఐఓసీ మూడు ముడి చమురు నౌకలు, తొమ్మిది ఎల్పీజీ నౌకలను టైమ్ చార్టర్ పద్ధతిలో అద్దెకు తీసుకుని ఉపయోగిస్తోంది. ఈ ఒప్పందాల వల్ల ప్రస్తుత సంక్షోభ సమయంలో కంపెనీకి భారీగా ఖర్చు తగ్గిందని జైన్ తెలిపారు. అద్దెకు తీసుకున్న క్రూడ్ ఆయిల్ నౌకల్లో రవాణా ఖర్చు బ్యారెల్‌కు 2 నుంచి 2.50 డాలర్లుగా ఉంది. అదే స్పాట్ మార్కెట్‌లో నౌకలను తీసుకుంటే 8 నుంచి 10 డాలర్లు చెల్లించాల్సి వస్తోంది. ఎల్పీజీ రవాణా ఖర్చు సాధారణంగా టన్నుకు 40 డాలర్లు ఉండగా, ప్రస్తుతం 160 నుంచి 180 డాలర్లకు పెరిగింది. అందుకే సొంత నౌకలు ఉంటే భవిష్యత్తులో ఇలాంటి ఖర్చుల భారాన్ని తగ్గించుకోవచ్చని కంపెనీ భావిస్తోంది.

ఇవి కూడా చదవండి: Gold Price Prediction: బంగారం కొనాలనుకుంటున్నారా? వచ్చే వారం ధరలు ఎలా ఉండబోతున్నాయంటే?

ముడి చమురు దిగుమతుల్లోనూ ఐఓసీ మార్పులు చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో 55 శాతం చమురును రష్యా నుంచి కొనుగోలు చేసింది. మధ్యప్రాచ్యం నుంచి 24 శాతం, ఆఫ్రికా నుంచి 10 శాతం, బ్రెజిల్ నుంచి 7 శాతం సేకరించింది. అమెరికా నుంచి 2 నుంచి 5 శాతం, వెనిజులా నుంచి 3 నుంచి 4 శాతం చమురును దిగుమతి చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో 50 శాతంగా ఉన్న స్పాట్ దిగుమతుల వాటా FY27 తొలి ఆరు నెలల్లో 87 శాతానికి చేరింది. ఇలా ఒకే ప్రాంతంపై ఆధారపడకుండా సరఫరా మార్గాలను విస్తరిస్తోంది.

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల తర్వాత చమురు ధరలు పెరిగాయి. ఫిబ్రవరిలో బ్యారెల్‌కు 65 నుంచి 70 డాలర్లుగా ఉన్న ఇండియన్ బాస్కెట్ క్రూడ్ ధర, మొదటి త్రైమాసికంలో చాలా కాలం 100 డాలర్లకు పైనే ఉంది. అక్టోబర్‌లో సగటున 120 డాలర్లకు చేరిందని జైన్ తెలిపారు. ఈ పరిస్థితుల్లో సరఫరా సమస్యలు రాకుండా ఐఓసీ ముడి చమురు నిల్వలను సాధారణంగా ఉండే 33-35 రోజుల నుంచి 39 రోజులకు పెంచింది. ఎల్పీజీ నిల్వలు 20 రోజులకు, పెట్రోల్, డీజిల్ నిల్వలు 23-25 రోజులకు సరిపడా ఉన్నాయి. ఇక సెప్టెంబర్ త్రైమాసికంలో ఐఓసీ రూ.21,630 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంతకుముందు త్రైమాసికంలో రూ.2,661 కోట్ల నష్టం వచ్చింది. నిల్వల విలువ పెరగడం, ఇతర వ్యాపార విభాగాల్లో మెరుగైన పనితీరు లాభాలకు కారణమయ్యాయని కంపెనీ తెలిపింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు చమురు కొనుగోలు, రవాణా ఖర్చులపై ప్రభావం చూపే ప్రమాదం ఉన్నందున సొంత నౌకల కొనుగోలు ద్వారా సరఫరా వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని ఐఓసీ భావిస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 November 2026, 3:07 pm Digital Edition : Prabhanews
LPG: గ్యాస్ సిలిండర్ల కొరత వస్తుందా? పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా? ఐఓసీ కీలక నిర్ణయం! | బిజినెస్

Last Updated:Nov 08, 2026 2:45 PM ISTIndian Oil Corporation: హార్ముజ్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా? ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు చేపట్టిన ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) సొంతంగా చమురు, గ్యాస్ రవాణా నౌకలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
News18పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి దగ్గర నౌకల రాకపోకలకు అంతరాయాలు ఏర్పడటంతో అంతర్జాతీయంగా చమురు రవాణా ఖర్చులు పెరుగుతున్నాయి. ఈ పరిణామాలు భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సరఫరాపై ప్రభావం చూపుతాయా? ధరలు పెరుగుతాయా? దేశంలో గ్యాస్ కొరత ఏర్పడుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు చేపట్టిన ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) సొంతంగా చమురు, గ్యాస్ రవాణా నౌకలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది.ఈ ప్రతిపాదనకు ఐఓసీ బోర్డు ఇప్పటికే కొన్ని నౌకల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. ఇందుకోసం కొన్ని నెలల క్రితమే టెండర్లు కూడా జారీ చేసినట్లు కంపెనీ ఫైనాన్స్ డైరెక్టర్ అనూజ్ జైన్ వెల్లడించారు. రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలపై జరిగిన సమావేశంలో ఆయన ఈ వివరాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారత్‌లోనే నౌకలను నిర్మించే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు.ప్రస్తుతం ఐఓసీ మూడు ముడి చమురు నౌకలు, తొమ్మిది ఎల్పీజీ నౌకలను టైమ్ చార్టర్ పద్ధతిలో అద్దెకు తీసుకుని ఉపయోగిస్తోంది. ఈ ఒప్పందాల వల్ల ప్రస్తుత సంక్షోభ సమయంలో కంపెనీకి భారీగా ఖర్చు తగ్గిందని జైన్ తెలిపారు. అద్దెకు తీసుకున్న క్రూడ్ ఆయిల్ నౌకల్లో రవాణా ఖర్చు బ్యారెల్‌కు 2 నుంచి 2.50 డాలర్లుగా ఉంది. అదే స్పాట్ మార్కెట్‌లో నౌకలను తీసుకుంటే 8 నుంచి 10 డాలర్లు చెల్లించాల్సి వస్తోంది. ఎల్పీజీ రవాణా ఖర్చు సాధారణంగా టన్నుకు 40 డాలర్లు ఉండగా, ప్రస్తుతం 160 నుంచి 180 డాలర్లకు పెరిగింది. అందుకే సొంత నౌకలు ఉంటే భవిష్యత్తులో ఇలాంటి ఖర్చుల భారాన్ని తగ్గించుకోవచ్చని కంపెనీ భావిస్తోంది.ఇవి కూడా చదవండి: Gold Price Prediction: బంగారం కొనాలనుకుంటున్నారా? వచ్చే వారం ధరలు ఎలా ఉండబోతున్నాయంటే?ముడి చమురు దిగుమతుల్లోనూ ఐఓసీ మార్పులు చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో 55 శాతం చమురును రష్యా నుంచి కొనుగోలు చేసింది. మధ్యప్రాచ్యం నుంచి 24 శాతం, ఆఫ్రికా నుంచి 10 శాతం, బ్రెజిల్ నుంచి 7 శాతం సేకరించింది. అమెరికా నుంచి 2 నుంచి 5 శాతం, వెనిజులా నుంచి 3 నుంచి 4 శాతం చమురును దిగుమతి చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో 50 శాతంగా ఉన్న స్పాట్ దిగుమతుల వాటా FY27 తొలి ఆరు నెలల్లో 87 శాతానికి చేరింది. ఇలా ఒకే ప్రాంతంపై ఆధారపడకుండా సరఫరా మార్గాలను విస్తరిస్తోంది.అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల తర్వాత చమురు ధరలు పెరిగాయి. ఫిబ్రవరిలో బ్యారెల్‌కు 65 నుంచి 70 డాలర్లుగా ఉన్న ఇండియన్ బాస్కెట్ క్రూడ్ ధర, మొదటి త్రైమాసికంలో చాలా కాలం 100 డాలర్లకు పైనే ఉంది. అక్టోబర్‌లో సగటున 120 డాలర్లకు చేరిందని జైన్ తెలిపారు. ఈ పరిస్థితుల్లో సరఫరా సమస్యలు రాకుండా ఐఓసీ ముడి చమురు నిల్వలను సాధారణంగా ఉండే 33-35 రోజుల నుంచి 39 రోజులకు పెంచింది. ఎల్పీజీ నిల్వలు 20 రోజులకు, పెట్రోల్, డీజిల్ నిల్వలు 23-25 రోజులకు సరిపడా ఉన్నాయి. ఇక సెప్టెంబర్ త్రైమాసికంలో ఐఓసీ రూ.21,630 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంతకుముందు త్రైమాసికంలో రూ.2,661 కోట్ల నష్టం వచ్చింది. నిల్వల విలువ పెరగడం, ఇతర వ్యాపార విభాగాల్లో మెరుగైన పనితీరు లాభాలకు కారణమయ్యాయని కంపెనీ తెలిపింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు చమురు కొనుగోలు, రవాణా ఖర్చులపై ప్రభావం చూపే ప్రమాదం ఉన్నందున సొంత నౌకల కొనుగోలు ద్వారా సరఫరా వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని ఐఓసీ భావిస్తోంది.మరింత చదవండి

Source link