బంగారానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. అది అంత సులభంగా పాడైపోదు. దాదాపు నాశనం చేయలేని లోహం కావడంతో, ఇప్పటివరకు తవ్వి తీసిన బంగారంలో దాదాపు మొత్తం ఇప్పటికీ ఏదో ఒక రూపంలో మన దగ్గరే ఉంది. ఆభరణాలు, పెట్టుబడి కోసం కొనే బంగారు బార్లు, నాణేలు, సెంట్రల్ బ్యాంకుల నిల్వలు ఇలా రకరకాల రూపాల్లో ఉంది. వేల సంవత్సరాలుగా బంగారానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నప్పటికీ, ఇప్పటివరకు తవ్వి తీసిన మొత్తం బంగారం పరిమాణం ఆశ్చర్యకరంగా తక్కువే. ప్రపంచంలో ఇప్పటివరకు వెలికితీసిన బంగారాన్ని మొత్తం కరిగించి ఒకే చోట పోస్తే, దాదాపు 22.6 మీటర్ల (74 అడుగుల) పొడవు, వెడల్పు, ఎత్తు ఉన్న ఒక పెద్ద క్యూబ్ ఆకారంలో సరిపోతుంది. అంటే వేల సంవత్సరాలుగా తవ్వి సేకరించిన 2,22,600 టన్నులకు పైగా బంగారం కూడా ఒక చిన్న భవనం అంత పరిమాణంలోనే ఇమిడిపోతుంది. బంగారం ఎంత అరుదైన లోహమో ఈ లెక్క చూస్తే అర్థమవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)

