Last Updated:
సాహస యాత్రికుడు భరద్వాజ్ దాయాల దర్శకుడిగా ఒక కొత్త ప్రయత్నం మొదలుపెట్టారు. ఏఐ టెక్నాలజీని కొత్తగా ఉపయోగిస్తూ హైబ్రీడ్ సాంకేతికతతో “కిరికిరి” అనే సినిమాను రూపొందిస్తున్నారు.
బైక్ రైడర్ గా 18 దేశాలు చుట్టివచ్చి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్న సాహస యాత్రికుడు భరద్వాజ్ దాయాల దర్శకుడిగా ఒక కొత్త ప్రయత్నం మొదలుపెట్టారు. ఏఐ టెక్నాలజీని కొత్తగా ఉపయోగిస్తూ హైబ్రీడ్ సాంకేతికతతో “కిరికిరి” అనే సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వన్ మ్యాన్ షో ఫిలింస్ బ్యానర్ పై రవికాంత్ వీరపల్లి నిర్మిస్తున్నారు. వన్ మ్యాన్ షో గా చెప్పాల్సిన “కిరికిరి” సినిమా ఈ రోజు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. బాహుబలి నిర్మాత ప్రసాద్ దేవినేని, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, బాహుబలి సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ భరద్వాజ దాయాల మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా మన సినిమాల్లో సాంకేతిక వినియోగం పెరుగుతూ వస్తోంది. ఇప్పుడున్న సాంకేతికతలో మరో ముందడుగు ఏఐ. ఈ టెక్నాలజీతో అవుట్ ఆఫ్ ది వరల్డ్ కథలు తెరకెక్కిస్తాం, లేదా పౌరాణికాలు రూపొందిస్తాం. మేము ఫస్ట్ టైమ్ ఏఐ సహాయంతో హైబ్రీడ్ టెక్నాలజీ విధానంలో కిరికిరి అనే సోషల్ మూవీ చేస్తున్నాం. ఇది కంప్లీట్ హైదారాబాద్ బేస్డ్ మూవీ. ఈ సినిమాను ప్రారంభించిన ఆరు నెలల్లో విడుదలకు తీసుకురావాలని ప్లాన్ చేశాం. సాంకేతికంగా సినిమాకు ఇది కొత్త ట్రెండ్ కు తెరతీస్తుందని నమ్ముతున్నాం. ఇదే పద్ధతిలో మరిన్ని సినిమాలు వన్ మ్యాన్ షో ఫిలింస్ బ్యానర్ లో మరిన్ని మూవీస్ చేయబోతున్నాం అన్నారు.
సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ మాట్లాడుతూ.. టెక్నాలజీ మన పనిని సులువు చేస్తోంది. ఒకప్పుడు మన దగ్గర కథ ఉంటే దానికి ఫండింగ్ చేసే ప్రొడ్యూసర్ కావాలి. టీమ్ కావాలి. ఇప్పుడు మన స్క్రిప్ట్ తో టెక్నాలజీని ఉపయోగించి మూవీస్ చేస్తున్నాం. హైదరాబాద్ బేస్డ్ కథతో హైబ్రీడ్ టెక్నాలజీ సినిమా చేస్తున్న భరద్వాజ గారికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాం. ఇదొక పాత్ బ్రేకింగ్ అటెంప్ట్ కావాలి. కొత్త జనరేషన్ సినిమాలకు నాంది పలకాలని కోరుకుంటున్నా.అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ.. ఏఐ అనేది మనకు గేమ్ ఛేంజింగ్ టెక్నాలజీ. మనం టెక్నాలజీని అందుకుంటేనే ఆ పరుగులో ముందుంటాం. లేకపోతే మిగతా వాళ్లు ముందుకు వెళ్తుంటే అలా చూస్తుండిపోవాల్సి వస్తుంది. సాంకేతికతను ఉపయోగించి భరద్వాజ గారు కిరికిరి అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా వారు చేస్తున్న ప్రయత్నం సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.
ప్రొడ్యూసర్ రవికాంత్ వీరపల్లి మాట్లాడుతూ.. ప్రతి రోజూ కొత్త టెక్నాలజీ వస్తోంది. మేము మా కిరికిరి సినిమాను ఆరు నెలల్లో రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. మా నెక్ట్స్ మూవీని మూడు నెలల్లో తీసుకొస్తాం. అలా మేము చేయబోయే సినిమాలకు మరింత తక్కువ టైమ్ నిర్దేశించుకుని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. మీ అందరి సపోర్ట్ మాకు ఉంటుందని నమ్ముతున్నాం అన్నారు.

