ప్రభన్యూస్

Kavya: కీరవాణి ఇంట పెళ్లి సందడి.. కావ్య- కాలభైరవ నిశ్చితార్థం పూర్తి, బ్యాచిలర్ పార్టీలో ఛిల్ మావా | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి ఇంట త్వరలో పెళ్లి బాజా మోగనుంది. కీరవాణి పెద్ద కుమారుడు సంగీత దర్శకుడు కాలభైరవ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తాజాగా కావ్యతో ఆయన ఎంగేజ్‌మెంట్ పూర్తయినట్లు తెలుస్తోంది.

News18
News18

టాలీవుడ్‌లో మళ్ళీ పెళ్లిళ్ల సందడి మొదలైంది. ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి ఇంట త్వరలో పెళ్లి బాజా మోగనుంది. కీరవాణి పెద్ద కుమారుడు, ప్రముఖ యువ గాయకుడు, సంగీత దర్శకుడు కాలభైరవ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. టాలీవుడ్ యువ హీరోయిన్ కావ్య కళ్యాణ్‌రామ్‌తో ఆయన వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్నారు. తాజాగా వీరిద్దరి నిశ్చితార్థం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా ప్రైవేట్‌గా, సంప్రదాయబద్ధంగా జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన అందమైన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ నిశ్చితార్థ వేడుకలో కాబోయే వధూవరులు ఇద్దరూ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. టాలీవుడ్ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, రమాలతో పాటు కీరవాణి, శ్రీవల్లీ కుటుంబ సభ్యులు ఈ వేడుకలో పాల్గొని నూతన జంటను ఆశీర్వదించారు. ఈ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొట్టడంతో సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో కుదిరిన ఈ వివాహం వచ్చే డిసెంబర్‌లో అత్యంత ఘనంగా జరగనున్నట్లు సమాచారం. త్వరలోనే పెళ్లి తేదీ, వేదిక వివరాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే.. తన పెళ్లికి ముందు కావ్య స్నేహితురాళ్లకు అదిరిపోయే బ్యాచిలర్ పార్టీ ఇచ్చింది. వియత్నాంలో ఈ బ్యాచిలర్ పార్టీని సెలబ్రేట్ చేసుకుంది. అక్కడి అందమైన లొకేషన్లలో ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేస్తూ దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో.. మీ ఎంజాయ్ మామూలుగా లేదుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

కాలభైరవ, కావ్య ఇద్దరూ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. ‘గంగోత్రి’, ‘ఠాగూర్’, ‘బన్నీ’ వంటి హిట్ సినిమాల్లో బాలనటిగా అలరించిన కావ్య కళ్యాణ్‌రామ్.. ఆ తర్వాత ‘మసూద’, ‘బలగం’, ‘ఉస్తాద్’ వంటి విజయవంతమైన చిత్రాలతో హీరోయిన్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు, కాలభైరవ తన తండ్రి కీరవాణి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని సంగీత రంగంలో దూసుకుపోతున్నారు. ఆస్కార్ అవార్డు సాధించిన ‘నాటు నాటు’ పాటను పాడిన గాయకుడిగా ఆయనకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. అలాగే ‘కార్తికేయ 2’, ‘హనుమాన్’, ‘మత్తు వదలరా’ లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేసి సత్తా చాటారు.

కాగా, ఈ ఏడాది చివర్లో టాలీవుడ్‌లో పెళ్లిళ్ల హడావిడి గట్టిగానే కనిపిస్తోంది. ఇప్పటికే మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ తన ప్రేయసి కిరణ్‌తో నవంబర్ 5న నిశ్చితార్థం చేసుకున్నారు. మరో యువ హీరో తేజ సజ్జా కూడా త్వరలో పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ వరుస శుభకార్యాలతో తెలుగు సినీ పరిశ్రమలో పండుగ వాతావరణం నెలకొంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 07 November 2026, 10:06 am Digital Edition : Prabhanews
Kavya: కీరవాణి ఇంట పెళ్లి సందడి.. కావ్య- కాలభైరవ నిశ్చితార్థం పూర్తి, బ్యాచిలర్ పార్టీలో ఛిల్ మావా | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 07, 2026 9:59 AM ISTమ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి ఇంట త్వరలో పెళ్లి బాజా మోగనుంది. కీరవాణి పెద్ద కుమారుడు సంగీత దర్శకుడు కాలభైరవ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తాజాగా కావ్యతో ఆయన ఎంగేజ్‌మెంట్ పూర్తయినట్లు తెలుస్తోంది. News18టాలీవుడ్‌లో మళ్ళీ పెళ్లిళ్ల సందడి మొదలైంది. ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి ఇంట త్వరలో పెళ్లి బాజా మోగనుంది. కీరవాణి పెద్ద కుమారుడు, ప్రముఖ యువ గాయకుడు, సంగీత దర్శకుడు కాలభైరవ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. టాలీవుడ్ యువ హీరోయిన్ కావ్య కళ్యాణ్‌రామ్‌తో ఆయన వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్నారు. తాజాగా వీరిద్దరి నిశ్చితార్థం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా ప్రైవేట్‌గా, సంప్రదాయబద్ధంగా జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన అందమైన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఈ నిశ్చితార్థ వేడుకలో కాబోయే వధూవరులు ఇద్దరూ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. టాలీవుడ్ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, రమాలతో పాటు కీరవాణి, శ్రీవల్లీ కుటుంబ సభ్యులు ఈ వేడుకలో పాల్గొని నూతన జంటను ఆశీర్వదించారు. ఈ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొట్టడంతో సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో కుదిరిన ఈ వివాహం వచ్చే డిసెంబర్‌లో అత్యంత ఘనంగా జరగనున్నట్లు సమాచారం. త్వరలోనే పెళ్లి తేదీ, వేదిక వివరాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే.. తన పెళ్లికి ముందు కావ్య స్నేహితురాళ్లకు అదిరిపోయే బ్యాచిలర్ పార్టీ ఇచ్చింది. వియత్నాంలో ఈ బ్యాచిలర్ పార్టీని సెలబ్రేట్ చేసుకుంది. అక్కడి అందమైన లొకేషన్లలో ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేస్తూ దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో.. మీ ఎంజాయ్ మామూలుగా లేదుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.కాలభైరవ, కావ్య ఇద్దరూ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. 'గంగోత్రి', 'ఠాగూర్', 'బన్నీ' వంటి హిట్ సినిమాల్లో బాలనటిగా అలరించిన కావ్య కళ్యాణ్‌రామ్.. ఆ తర్వాత 'మసూద', 'బలగం', 'ఉస్తాద్' వంటి విజయవంతమైన చిత్రాలతో హీరోయిన్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు, కాలభైరవ తన తండ్రి కీరవాణి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని సంగీత రంగంలో దూసుకుపోతున్నారు. ఆస్కార్ అవార్డు సాధించిన 'నాటు నాటు' పాటను పాడిన గాయకుడిగా ఆయనకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. అలాగే 'కార్తికేయ 2', 'హనుమాన్', 'మత్తు వదలరా' లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేసి సత్తా చాటారు.కాగా, ఈ ఏడాది చివర్లో టాలీవుడ్‌లో పెళ్లిళ్ల హడావిడి గట్టిగానే కనిపిస్తోంది. ఇప్పటికే మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ తన ప్రేయసి కిరణ్‌తో నవంబర్ 5న నిశ్చితార్థం చేసుకున్నారు. మరో యువ హీరో తేజ సజ్జా కూడా త్వరలో పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ వరుస శుభకార్యాలతో తెలుగు సినీ పరిశ్రమలో పండుగ వాతావరణం నెలకొంది.మరింత చదవండి

Source link