ప్రభన్యూస్

భారత్‌కు ఇరాన్ గుడ్ న్యూస్.. హోర్ముజ్ జలసంధిలో మన నౌకలకు మినహాయింపు! |


Last Updated:

హోర్ముజ్ జలసంధి ఆంక్షల నుంచి భారత్, చైనాలకు ఇరాన్ ఊరట కల్పించింది. అయితే అక్కడ కొనసాగుతున్న ఉద్రిక్తతలు, అమెరికా ఆంక్షలు, భారీ ఇన్సూరెన్స్ ప్రీమియంల వల్ల నౌకాయాన సంస్థలకు తీవ్ర ఆర్థిక, భద్రతాపరమైన నష్టాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

News18
News18

వ్యూహాత్మక హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలపై విధించిన ఆంక్షల నుంచి భారత్, చైనా, ఖతార్, ఇరాక్ దేశాలకు ఇరాన్ అనూహ్య మినహాయింపు ప్రకటించింది. అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని తప్పించుకుంటూ వాణిజ్యాన్ని సాగించే వ్యూహంగా టెహ్రాన్ దీనిని పేర్కొంది. కాగితాలపై ఇచ్చిన ఈ ప్రత్యేక సడలింపు క్షేత్రస్థాయిలో నౌకలకు పూర్తి భద్రత ఇవ్వలేదని అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సముద్ర జలాల్లో క్షిపణులు, మైన్లు, డ్రోన్ల నిఘా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో దేశాల జెండాలను సరిగ్గా గుర్తించలేక పౌర నౌకలు దాడులకు గురయ్యే ప్రమాదం పొంచి ఉంది.

ఇటీవల ఒమన్ తీరంలో ఎంఎస్‌వీ అల్-జుసుఫీ అనే భారత నౌకపై జరిగిన డ్రోన్ దాడిలో గుజరాత్‌కు చెందిన నావికుడు మరణించిన ఘటనే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది.

అమెరికా ఆంక్షల వలయం

ఇరాన్ ఇస్తున్న అనుమతుల వల్ల అంతర్జాతీయ వాణిజ్య సంస్థలకు సరికొత్త చట్టపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. జలసంధి మీదుగా ప్రయాణించే విదేశీ కార్గో షిప్పుల నుంచి ఇరాన్ ప్రత్యేక ‘రవాణా ఫీజులు’ వసూలు చేస్తోంది. ఈ మార్గం ద్వారా ఇరాన్ ప్రభుత్వానికి నిధులు చేకూర్చే సంస్థలపై తీవ్రమైన ద్వితీయ స్థాయి ఆంక్షలు (సెకండరీ శాంక్షన్స్) విధిస్తామని అమెరికా హెచ్చరించినట్లు న్యూస్18 ఇంగ్లీష్ కథనం పేర్కొంది. వాషింగ్టన్ నిబంధనలను ఉల్లంఘిస్తే గ్లోబల్ డాలర్ చెల్లింపుల వ్యవస్థ నుంచి కంపెనీలు శాశ్వతంగా బహిష్కరణకు గురయ్యే ప్రమాదం ఉంది.

ఈ మార్గంలో ప్రయాణించే నౌకలకు గ్లోబల్ ఇన్సూరెన్స్ కంపెనీలు భారీగా ‘వార్-రిస్క్’ ప్రీమియంలను వసూలు చేస్తున్నాయి. హోర్ముజ్ ప్రాంతాన్ని హై-రిస్క్ జోన్‌గా వర్గీకరించడంతో ఇన్సూరెన్స్ వ్యయం విపరీతంగా పెరిగిపోయి రవాణా ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. ఫలితంగా తక్కువ సమయంలో ప్రయాణించినా కంపెనీలకు ఆర్థిక ప్రయోజనం ఏమాత్రం దక్కడం లేదు.

టెహ్రాన్ తీసుకున్న ఈ నిర్ణయం స్వార్థ రాజకీయ ప్రయోజనాలతో ముడిపడి ఉంది. భారత్ నుంచి ఔషధాల దిగుమతి, చైనా నుంచి అంతర్జాతీయ దౌత్య మద్దతు ఆశించే ఇరాన్ ఈ మినహాయింపులు ఇచ్చింది. సమీకరణాలు మారితే ఏ క్షణమైనా ఈ వెసులుబాటును ఇరాన్ రద్దు చేసే అవకాశం ఉండటంతో చమురు, కార్గో నౌకలు సముద్రం మధ్యలోనే చిక్కుకుపోయే ముప్పు పొంచి ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 06 November 2026, 8:22 pm Digital Edition : Prabhanews
భారత్‌కు ఇరాన్ గుడ్ న్యూస్.. హోర్ముజ్ జలసంధిలో మన నౌకలకు మినహాయింపు! |

Last Updated:Nov 06, 2026 7:36 PM ISTహోర్ముజ్ జలసంధి ఆంక్షల నుంచి భారత్, చైనాలకు ఇరాన్ ఊరట కల్పించింది. అయితే అక్కడ కొనసాగుతున్న ఉద్రిక్తతలు, అమెరికా ఆంక్షలు, భారీ ఇన్సూరెన్స్ ప్రీమియంల వల్ల నౌకాయాన సంస్థలకు తీవ్ర ఆర్థిక, భద్రతాపరమైన నష్టాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.News18వ్యూహాత్మక హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలపై విధించిన ఆంక్షల నుంచి భారత్, చైనా, ఖతార్, ఇరాక్ దేశాలకు ఇరాన్ అనూహ్య మినహాయింపు ప్రకటించింది. అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని తప్పించుకుంటూ వాణిజ్యాన్ని సాగించే వ్యూహంగా టెహ్రాన్ దీనిని పేర్కొంది. కాగితాలపై ఇచ్చిన ఈ ప్రత్యేక సడలింపు క్షేత్రస్థాయిలో నౌకలకు పూర్తి భద్రత ఇవ్వలేదని అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సముద్ర జలాల్లో క్షిపణులు, మైన్లు, డ్రోన్ల నిఘా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో దేశాల జెండాలను సరిగ్గా గుర్తించలేక పౌర నౌకలు దాడులకు గురయ్యే ప్రమాదం పొంచి ఉంది.ఇటీవల ఒమన్ తీరంలో ఎంఎస్‌వీ అల్-జుసుఫీ అనే భారత నౌకపై జరిగిన డ్రోన్ దాడిలో గుజరాత్‌కు చెందిన నావికుడు మరణించిన ఘటనే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది.అమెరికా ఆంక్షల వలయంఇరాన్ ఇస్తున్న అనుమతుల వల్ల అంతర్జాతీయ వాణిజ్య సంస్థలకు సరికొత్త చట్టపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. జలసంధి మీదుగా ప్రయాణించే విదేశీ కార్గో షిప్పుల నుంచి ఇరాన్ ప్రత్యేక ‘రవాణా ఫీజులు’ వసూలు చేస్తోంది. ఈ మార్గం ద్వారా ఇరాన్ ప్రభుత్వానికి నిధులు చేకూర్చే సంస్థలపై తీవ్రమైన ద్వితీయ స్థాయి ఆంక్షలు (సెకండరీ శాంక్షన్స్) విధిస్తామని అమెరికా హెచ్చరించినట్లు న్యూస్18 ఇంగ్లీష్ కథనం పేర్కొంది. వాషింగ్టన్ నిబంధనలను ఉల్లంఘిస్తే గ్లోబల్ డాలర్ చెల్లింపుల వ్యవస్థ నుంచి కంపెనీలు శాశ్వతంగా బహిష్కరణకు గురయ్యే ప్రమాదం ఉంది.ఈ మార్గంలో ప్రయాణించే నౌకలకు గ్లోబల్ ఇన్సూరెన్స్ కంపెనీలు భారీగా ‘వార్-రిస్క్’ ప్రీమియంలను వసూలు చేస్తున్నాయి. హోర్ముజ్ ప్రాంతాన్ని హై-రిస్క్ జోన్‌గా వర్గీకరించడంతో ఇన్సూరెన్స్ వ్యయం విపరీతంగా పెరిగిపోయి రవాణా ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. ఫలితంగా తక్కువ సమయంలో ప్రయాణించినా కంపెనీలకు ఆర్థిక ప్రయోజనం ఏమాత్రం దక్కడం లేదు.టెహ్రాన్ తీసుకున్న ఈ నిర్ణయం స్వార్థ రాజకీయ ప్రయోజనాలతో ముడిపడి ఉంది. భారత్ నుంచి ఔషధాల దిగుమతి, చైనా నుంచి అంతర్జాతీయ దౌత్య మద్దతు ఆశించే ఇరాన్ ఈ మినహాయింపులు ఇచ్చింది. సమీకరణాలు మారితే ఏ క్షణమైనా ఈ వెసులుబాటును ఇరాన్ రద్దు చేసే అవకాశం ఉండటంతో చమురు, కార్గో నౌకలు సముద్రం మధ్యలోనే చిక్కుకుపోయే ముప్పు పొంచి ఉంది.మరింత చదవండి

Source link