ఇదిలా ఉంటే, బంగారం ధరలు ఇటీవల గణనీయంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం 24 క్యారెట్ల బంగారం ధర (పన్నులతో కలిపి) 10 గ్రాములకు రూ.1,48,800గా నమోదైంది. జనవరి 29, 2026న నమోదైన గరిష్ఠ ధర రూ.1,83,000తో పోలిస్తే ఇది 19 శాతం తగ్గింది. అయితే, గత ఏడాది అక్టోబర్ 18న ధంతేరాస్ సందర్భంగా నమోదైన రూ.1,32,400 ధరతో పోలిస్తే ఇప్పటికీ బంగారం ధర ఎక్కువగానే ఉంది. వెండి ధరల్లోనూ భారీ తగ్గుదల కనిపించింది. జనవరి 29న కిలో వెండి ధర గరిష్ఠంగా రూ.4,04,500కు చేరింది. అక్కడి నుంచి 52 శాతం తగ్గి ప్రస్తుతం రూ.1,94,500కు చేరింది. అయినప్పటికీ, 2025 ధంతేరాస్ రోజున నమోదైన కిలో రూ.1,70,000 ధరతో పోలిస్తే ఇప్పటికీ వెండి ధర ఎక్కువగానే ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)

