ప్రభన్యూస్

Ramayana: రామాయణం చివరలో సూపర్ సర్‌ప్రైజ్.. ఏంటో తెలుసా? | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

నితీష్ తివారీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన పౌరాణిక చిత్రం ‘రామాయణం పార్ట్ 1’ నేడు (నవంబర్ 5) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో అందరి దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షిస్తున్న అంశం మాత్రం పోస్ట్ క్రెడిట్ సీన్. అదేంటో చూద్దామా..

News18
News18

నితీష్ తివారీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన పౌరాణిక చిత్రం ‘రామాయణం పార్ట్ 1’ నేడు (నవంబర్ 5) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ వంటి స్టార్ నటీనటులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా థియేటర్స్ లో అడుగు పెట్టడంతో దేశవ్యాప్తంగా అన్ని సినిమా హాళ్ల వద్ద సందడి వాతావరణం కనిపించింది. ఇప్పటికే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే ఈ చిత్రంలో అందరి దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షిస్తున్న అంశం మాత్రం పోస్ట్ క్రెడిట్ సీన్. ముఖ్యంగా ఆంజనేయుడి పాత్రలో సన్నీ డియోల్ కనిపించడం ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.

సాధారణంగా సినిమాలు పూర్తయిన తర్వాత థియేటర్ల నుంచి ప్రేక్షకులు బయటకు వెళ్లిపోతుంటారు. కానీ కొన్ని చిత్రాల్లో చివర్లో వచ్చే పోస్ట్ క్రెడిట్ సన్నివేశాలు కథకు సంబంధించిన మరో ఆసక్తికరమైన అంశాన్ని పరిచయం చేస్తుంటాయి. ‘రామాయణం పార్ట్ 1’లో కూడా అలాంటి ప్రత్యేక సన్నివేశాన్ని జోడించినట్లు తెలుస్తోంది. ఇందులో హనుమంతుడి ముఖాన్ని పూర్తిగా చూపించకుండా, శక్తిమంతమైన నేపథ్య సంగీతంతో ఆయన రాకను పరిచయం చేశారు. చివర్లో చేతిలో గద పట్టుకుని ఆకాశంలోకి ఎగురుతూ ‘జై శ్రీరామ్’ అని నినదించే సన్నివేశం ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తోంది.

ఇక ఈ సినిమాలో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా కన్నడ స్టార్ యశ్ నటించారు. భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని అత్యంత భారీ స్థాయిలో వెండితెరపై ఆవిష్కరించాలనే లక్ష్యంతో దర్శకుడు నితేష్ తివారీ ఈ చిత్రాన్ని రూపొందించారు. విజువల్ ఎఫెక్ట్స్, భారీ సెట్స్, యుద్ధ సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయని అంచనాలు ఉన్నాయి.

ముఖ్యంగా హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్ నటిస్తున్నారనే ప్రకటన వచ్చినప్పటి నుంచే అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఇప్పుడు పోస్ట్ క్రెడిట్ సీన్ ద్వారా ఆయన పాత్రను పరిచయం చేయడంతో రెండో భాగంపై అంచనాలు మరింత పెరిగాయి. రామాయణంలోని కీలక ఘట్టాలు, హనుమంతుడి పరాక్రమం, రాముడిపై ఆయనకున్న భక్తి రెండో భాగంలో ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది.

మొత్తానికి, హనుమంతుడి పాత్రను పూర్తిస్థాయిలో చూపించకుండా చిన్న పరిచయంతోనే ఆసక్తిని పెంచడం చిత్ర బృందం అనుసరించిన ప్రత్యేక వ్యూహంగా కనిపిస్తోంది. సన్నీ డియోల్ పూర్తిస్థాయి హనుమంతుడి అవతారాన్ని వెండితెరపై ఎప్పుడు చూస్తామా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 05 November 2026, 1:27 pm Digital Edition : Prabhanews
Ramayana: రామాయణం చివరలో సూపర్ సర్‌ప్రైజ్.. ఏంటో తెలుసా? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 05, 2026 1:21 PM ISTనితీష్ తివారీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన పౌరాణిక చిత్రం ‘రామాయణం పార్ట్ 1’ నేడు (నవంబర్ 5) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో అందరి దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షిస్తున్న అంశం మాత్రం పోస్ట్ క్రెడిట్ సీన్. అదేంటో చూద్దామా.. News18నితీష్ తివారీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన పౌరాణిక చిత్రం ‘రామాయణం పార్ట్ 1’ నేడు (నవంబర్ 5) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ వంటి స్టార్ నటీనటులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా థియేటర్స్ లో అడుగు పెట్టడంతో దేశవ్యాప్తంగా అన్ని సినిమా హాళ్ల వద్ద సందడి వాతావరణం కనిపించింది. ఇప్పటికే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే ఈ చిత్రంలో అందరి దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షిస్తున్న అంశం మాత్రం పోస్ట్ క్రెడిట్ సీన్. ముఖ్యంగా ఆంజనేయుడి పాత్రలో సన్నీ డియోల్ కనిపించడం ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.సాధారణంగా సినిమాలు పూర్తయిన తర్వాత థియేటర్ల నుంచి ప్రేక్షకులు బయటకు వెళ్లిపోతుంటారు. కానీ కొన్ని చిత్రాల్లో చివర్లో వచ్చే పోస్ట్ క్రెడిట్ సన్నివేశాలు కథకు సంబంధించిన మరో ఆసక్తికరమైన అంశాన్ని పరిచయం చేస్తుంటాయి. ‘రామాయణం పార్ట్ 1’లో కూడా అలాంటి ప్రత్యేక సన్నివేశాన్ని జోడించినట్లు తెలుస్తోంది. ఇందులో హనుమంతుడి ముఖాన్ని పూర్తిగా చూపించకుండా, శక్తిమంతమైన నేపథ్య సంగీతంతో ఆయన రాకను పరిచయం చేశారు. చివర్లో చేతిలో గద పట్టుకుని ఆకాశంలోకి ఎగురుతూ ‘జై శ్రీరామ్’ అని నినదించే సన్నివేశం ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తోంది.ఇక ఈ సినిమాలో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా కన్నడ స్టార్ యశ్ నటించారు. భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని అత్యంత భారీ స్థాయిలో వెండితెరపై ఆవిష్కరించాలనే లక్ష్యంతో దర్శకుడు నితేష్ తివారీ ఈ చిత్రాన్ని రూపొందించారు. విజువల్ ఎఫెక్ట్స్, భారీ సెట్స్, యుద్ధ సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయని అంచనాలు ఉన్నాయి.ముఖ్యంగా హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్ నటిస్తున్నారనే ప్రకటన వచ్చినప్పటి నుంచే అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఇప్పుడు పోస్ట్ క్రెడిట్ సీన్ ద్వారా ఆయన పాత్రను పరిచయం చేయడంతో రెండో భాగంపై అంచనాలు మరింత పెరిగాయి. రామాయణంలోని కీలక ఘట్టాలు, హనుమంతుడి పరాక్రమం, రాముడిపై ఆయనకున్న భక్తి రెండో భాగంలో ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది.మొత్తానికి, హనుమంతుడి పాత్రను పూర్తిస్థాయిలో చూపించకుండా చిన్న పరిచయంతోనే ఆసక్తిని పెంచడం చిత్ర బృందం అనుసరించిన ప్రత్యేక వ్యూహంగా కనిపిస్తోంది. సన్నీ డియోల్ పూర్తిస్థాయి హనుమంతుడి అవతారాన్ని వెండితెరపై ఎప్పుడు చూస్తామా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.మరింత చదవండి

Source link