MCXలో బంగారం, వెండి ధరలు ఎంత పెరిగాయంటే?
గురువారం ఉదయం 9:05 గంటలకు మనీకంట్రోల్ వెల్లడించిన లైవ్ మార్కెట్ వివరాల ప్రకారం.. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో డిసెంబర్ 4 గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు రూ.1,45,518 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే రూ.2,284 పెరిగింది. అంటే అంతకుముందు ముగింపు ధరతో పోలిస్తే బంగారం ధరలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. వెండి ధర కూడా ఇదే బాటలో సాగుతోంది. MCXలో డిసెంబర్ 4 సిల్వర్ ఫ్యూచర్స్ కిలోకు రూ.1,90,455 వద్ద ట్రేడవుతున్నాయి. గత సెషన్ ముగింపు ధరతో పోలిస్తే కిలో వెండిపై రూ.2,720 పెరిగింది. బంగారం, వెండి రెండింటిలోనూ ఒకేసారి పెరుగుదల కనిపించడంతో కమోడిటీ మార్కెట్లో కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల దృష్టి ఈ ధరల కదలికలపై ఉంది.

