ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులతో మరోసారి యుద్ధం తీవ్రరూపం దాల్చింది. రాజధాని కీవ్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో రష్యా దాడుల కారణంగా గంటల పాటు విద్యుత్, నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు, దక్షిణ ఉక్రెయిన్‌లోని కొమిషువాఖా గ్రామంపై జరిగిన రష్యా గైడెడ్ బాంబుల దాడిలో మృతుల సంఖ్య 40కి చేరింది. సోమవారం ఓ పాఠశాల, సమీపంలోని షెల్టర్‌పై రష్యా బాంబులు పడటంతో భారీ ప్రాణనష్టం జరిగింది. శిథిలాల కింద మరో 30 మంది చిక్కుకుని ఉండవచ్చని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ తెలిపారు. సహాయక చర్యలకు రష్యా డ్రోన్ల దాడులు ఆటంకం కలిగిస్తున్నాయి.
Source link
