నిజానికి రామాయణ కథ యూనివర్సల్ సబ్జెక్ట్. అందుకే ఎన్ని సార్లు చూసినా, విన్నా, చదివినా సరే మళ్లీ మళ్లీ చూడాలనిపించే, వినాలనిపించే, చదవాలనిపిస్తుంది. ఈ కథలో డ్రామా, ఎమోషన్ చాలా గొప్పగా ఉంటాయి. అందుకే ఇప్పటికే ఎన్నో సినిమాలు, సీరియల్స్ వచ్చినా సరే, మళ్లీ ఎవరైనా కొత్తగా తీస్తున్నారంటే క్యూరియాసిటీతో ఎదురు చూస్తుంటాం. అంతటి గొప్ప కథ ఇది.

