ఆధునిక రూపం, సౌకర్యాలకు ప్రాధాన్యమిచ్చేవారికి గ్రాండ్ ఐ10 నియోస్ ఉపయోగపడుతుంది. దీని ఆటోమేటిక్ వేరియంట్ ప్రారంభ ధర రూ.6,85,035. నలుపు గ్రిల్, బూమరాంగ్ ఆకారపు ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, ప్రత్యేకమైన అల్లాయ్ చక్రాలు ఆకర్షిస్తాయి. రెండు రంగుల క్యాబిన్, 8 అంగుళాల తెర, వైర్‌లెస్ ఛార్జర్, ఫుట్‌వెల్ లైటింగ్ ఉన్నాయి. ఆరు ఎయిర్‌బ్యాగులు, హిల్ అసిస్ట్, టైర్ ఒత్తిడి పర్యవేక్షణ వ్యవస్థ భద్రతను పెంచుతాయి. 1.2 లీటర్ల నాలుగు సిలిండర్ల కప్పా పెట్రోల్ ఇంజిన్, ఏఎంటీ గేర్‌బాక్స్‌తో 20.70 కిలోమీటర్ల మైలేజీ లభిస్తుంది.

