ప్రభన్యూస్

Atukula Payasam Recipe: బియ్యం అవసరం లేదు.. అటుకులతోనే కమ్మని పాయసం.. 15 నిమిషాల్లో ఇలా తయారు చేయండి! | లైఫ్ స్టైల్


Last Updated:

పాలు, బెల్లం, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ కలిపి తయారు చేయడం వల్ల మంచి రుచి, సువాసన వస్తాయి. ముఖ్యంగా ఇంట్లో తక్కువ సమయం ఉన్నప్పుడు కూడా కేవలం 15 నుంచి 20 నిమిషాల్లో ఈ పాయసాన్ని సిద్ధం చేసుకోవచ్చు. పిల్లలు, పెద్దలు కూడా ఇష్టంగా తినే ఈ స్వీట్‌ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

News18
News18

అటుకుల పాయసం తెలుగు వంటకాలలో ప్రత్యేకమైన తీపి వంటకం. పండుగలు, పూజలు, శుభకార్యాల సమయంలో దీనిని ప్రసాదంగా తయారు చేస్తుంటారు. బియ్యంతో చేసే పాయసంలాగే అటుకులతో కూడా ఎంతో రుచికరమైన పాయసం చేసుకోవచ్చు. పాలు, బెల్లం, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ కలిపి తయారు చేయడం వల్ల మంచి రుచి, సువాసన వస్తాయి. ముఖ్యంగా ఇంట్లో తక్కువ సమయం ఉన్నప్పుడు కూడా కేవలం 15 నుంచి 20 నిమిషాల్లో ఈ పాయసాన్ని సిద్ధం చేసుకోవచ్చు. పిల్లలు, పెద్దలు కూడా ఇష్టంగా తినే ఈ స్వీట్‌ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు లావు అటుకులు, రెండు కప్పుల పాలు, ఒక కప్పు నీళ్లు, బెల్లం ముప్పావు కప్పు, బెల్లం కరిగించడానికి పావు కప్పు నీళ్లు, రెండు టీస్పూన్ల నెయ్యి, చిటికెడు యాలకుల పొడి, కొన్ని జీడిపప్పులు, కిస్మిస్, ఎండుకొబ్బరి లేదా పచ్చికొబ్బరి ముక్కలు తీసుకోవాలి. మీ రుచికి తగ్గట్టుగా బెల్లం పరిమాణాన్ని కొద్దిగా తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు.

తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలో తురిమిన బెల్లం వేసి పావు కప్పు నీళ్లు పోయాలి. స్టవ్‌పై పెట్టి మీడియం మంట మీద బెల్లం పూర్తిగా కరిగే వరకు కలుపుతూ ఉండాలి. బెల్లం కరిగిన తర్వాత మరో ఐదు నిమిషాలు మరిగించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టడం వల్ల బెల్లంలోని మలినాలు తొలగిపోతాయి. తర్వాత సిరప్‌ను పూర్తిగా చల్లారనివ్వాలి.

మరో గిన్నెలో రెండు కప్పుల పాలు, ఒక కప్పు నీళ్లు పోసి మరిగించాలి. పాలు పొంగకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒక పాన్‌లో నెయ్యి వేసి వేడయ్యాక జీడిపప్పు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. తర్వాత కిస్మిస్ వేసి అవి ఉబ్బే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో కొబ్బరి ముక్కలు వేసి కొద్దిగా వేయించి తీసుకోవాలి.

తర్వాత అదే పాన్‌లో అటుకులు వేసి మీడియం మంటపై రెండు మూడు నిమిషాలు వేయించాలి. అటుకులు కొద్దిగా కరకరలాడే వరకు వేయిస్తే పాయసానికి మంచి రుచి వస్తుంది. ఇప్పుడు వేయించిన అటుకులను మరిగించిన పాలలో వేసి కలపాలి. అటుకులు మెత్తబడే వరకు నెమ్మదిగా ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే అడుగున అంటుకోకుండా ఉంటుంది. అటుకులు సగం ఉడికినప్పుడు వేయించిన జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి ముక్కలు కూడా వేసి కలపాలి.

అటుకులు పూర్తిగా మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. యాలకుల పొడి వేసి కలిపి, పాయసం కొద్దిగా చల్లారిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న బెల్లం సిరప్‌ను నెమ్మదిగా పోస్తూ కలపాలి. పాలు మరిగేటప్పుడు బెల్లం వేయకుండా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కలపడం మంచిది. ఇలా చేస్తే పాలు విరిగిపోయే అవకాశం తగ్గుతుంది. తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాలు పక్కన ఉంచాలి. అటుకులు బెల్లం రుచిని పీల్చుకుని పాయసం మరింత రుచిగా మారుతుంది.

చిట్కాలు: పాయసం వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా పల్చగా కనిపించినా చల్లారే కొద్దీ చిక్కబడుతుంది. మరీ చిక్కగా అనిపిస్తే కొద్దిగా వేడి పాలు కలుపుకోవచ్చు. అలాగే పాయసం తయారీలో లావు అటుకులు ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. బెల్లం సిరప్‌ను వడకట్టడం మర్చిపోవద్దు. చివరగా కొద్దిగా నెయ్యి కలిపితే రుచి, సువాసన మరింత పెరుగుతాయి. అంతే.. ఎంతో రుచికరమైన అటుకుల పాయసం సిద్ధం!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 03 November 2026, 9:49 am Digital Edition : Prabhanews
Atukula Payasam Recipe: బియ్యం అవసరం లేదు.. అటుకులతోనే కమ్మని పాయసం.. 15 నిమిషాల్లో ఇలా తయారు చేయండి! | లైఫ్ స్టైల్

Last Updated:Nov 03, 2026 9:27 AM ISTపాలు, బెల్లం, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ కలిపి తయారు చేయడం వల్ల మంచి రుచి, సువాసన వస్తాయి. ముఖ్యంగా ఇంట్లో తక్కువ సమయం ఉన్నప్పుడు కూడా కేవలం 15 నుంచి 20 నిమిషాల్లో ఈ పాయసాన్ని సిద్ధం చేసుకోవచ్చు. పిల్లలు, పెద్దలు కూడా ఇష్టంగా తినే ఈ స్వీట్‌ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.News18అటుకుల పాయసం తెలుగు వంటకాలలో ప్రత్యేకమైన తీపి వంటకం. పండుగలు, పూజలు, శుభకార్యాల సమయంలో దీనిని ప్రసాదంగా తయారు చేస్తుంటారు. బియ్యంతో చేసే పాయసంలాగే అటుకులతో కూడా ఎంతో రుచికరమైన పాయసం చేసుకోవచ్చు. పాలు, బెల్లం, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ కలిపి తయారు చేయడం వల్ల మంచి రుచి, సువాసన వస్తాయి. ముఖ్యంగా ఇంట్లో తక్కువ సమయం ఉన్నప్పుడు కూడా కేవలం 15 నుంచి 20 నిమిషాల్లో ఈ పాయసాన్ని సిద్ధం చేసుకోవచ్చు. పిల్లలు, పెద్దలు కూడా ఇష్టంగా తినే ఈ స్వీట్‌ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు లావు అటుకులు, రెండు కప్పుల పాలు, ఒక కప్పు నీళ్లు, బెల్లం ముప్పావు కప్పు, బెల్లం కరిగించడానికి పావు కప్పు నీళ్లు, రెండు టీస్పూన్ల నెయ్యి, చిటికెడు యాలకుల పొడి, కొన్ని జీడిపప్పులు, కిస్మిస్, ఎండుకొబ్బరి లేదా పచ్చికొబ్బరి ముక్కలు తీసుకోవాలి. మీ రుచికి తగ్గట్టుగా బెల్లం పరిమాణాన్ని కొద్దిగా తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు.తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలో తురిమిన బెల్లం వేసి పావు కప్పు నీళ్లు పోయాలి. స్టవ్‌పై పెట్టి మీడియం మంట మీద బెల్లం పూర్తిగా కరిగే వరకు కలుపుతూ ఉండాలి. బెల్లం కరిగిన తర్వాత మరో ఐదు నిమిషాలు మరిగించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టడం వల్ల బెల్లంలోని మలినాలు తొలగిపోతాయి. తర్వాత సిరప్‌ను పూర్తిగా చల్లారనివ్వాలి.మరో గిన్నెలో రెండు కప్పుల పాలు, ఒక కప్పు నీళ్లు పోసి మరిగించాలి. పాలు పొంగకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒక పాన్‌లో నెయ్యి వేసి వేడయ్యాక జీడిపప్పు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. తర్వాత కిస్మిస్ వేసి అవి ఉబ్బే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో కొబ్బరి ముక్కలు వేసి కొద్దిగా వేయించి తీసుకోవాలి.తర్వాత అదే పాన్‌లో అటుకులు వేసి మీడియం మంటపై రెండు మూడు నిమిషాలు వేయించాలి. అటుకులు కొద్దిగా కరకరలాడే వరకు వేయిస్తే పాయసానికి మంచి రుచి వస్తుంది. ఇప్పుడు వేయించిన అటుకులను మరిగించిన పాలలో వేసి కలపాలి. అటుకులు మెత్తబడే వరకు నెమ్మదిగా ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే అడుగున అంటుకోకుండా ఉంటుంది. అటుకులు సగం ఉడికినప్పుడు వేయించిన జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి ముక్కలు కూడా వేసి కలపాలి.అటుకులు పూర్తిగా మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. యాలకుల పొడి వేసి కలిపి, పాయసం కొద్దిగా చల్లారిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న బెల్లం సిరప్‌ను నెమ్మదిగా పోస్తూ కలపాలి. పాలు మరిగేటప్పుడు బెల్లం వేయకుండా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కలపడం మంచిది. ఇలా చేస్తే పాలు విరిగిపోయే అవకాశం తగ్గుతుంది. తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాలు పక్కన ఉంచాలి. అటుకులు బెల్లం రుచిని పీల్చుకుని పాయసం మరింత రుచిగా మారుతుంది.చిట్కాలు: పాయసం వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా పల్చగా కనిపించినా చల్లారే కొద్దీ చిక్కబడుతుంది. మరీ చిక్కగా అనిపిస్తే కొద్దిగా వేడి పాలు కలుపుకోవచ్చు. అలాగే పాయసం తయారీలో లావు అటుకులు ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. బెల్లం సిరప్‌ను వడకట్టడం మర్చిపోవద్దు. చివరగా కొద్దిగా నెయ్యి కలిపితే రుచి, సువాసన మరింత పెరుగుతాయి. అంతే.. ఎంతో రుచికరమైన అటుకుల పాయసం సిద్ధం!మరింత చదవండి

Source link