రోజుకు 7 నుంచి 8 గంటల నాణ్యమైన నిద్ర శరీరానికి, చర్మానికి ఎంతో అవసరం. నిద్ర సమయంలో చర్మ కణాలు పునరుద్ధరణ చెందుతాయి. దీంతో మరుసటి రోజు ముఖం మరింత తాజాగా, కాంతివంతంగా కనిపిస్తుంది. సీజనల్ పండ్లు, తాజా కూరగాయలు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. బయటి సంరక్షణతో పాటు లోపలి పోషణ కూడా సమానంగా అవసరం. వీకెండ్‌లో ఈ చిన్న చిన్న బ్యూటీ డిటాక్స్ అలవాట్లను పాటిస్తే ఖరీదైన ట్రీట్‌మెంట్లు లేకుండానే చర్మం, జుట్టు ఆరోగ్యంగా, కాంతివంతంగా మారతాయి. కొద్దిపాటి సమయాన్ని మీ కోసం కేటాయించడం ద్వారా సహజమైన అందాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు.

