Last Updated:
‘రామాయణ’ మూవీ ప్రమోషనల్ ఈవెంట్లో రణబీర్ మాట్లాడిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలో తన తప్పుపై రణ్ బీర్ కపూర్ క్షమాపణ చెప్పారు.
కోల్‌కతాలో జరిగిన ‘రామాయణ’ మూవీ ప్రమోషనల్ ఈవెంట్లో రణబీర్ మాట్లాడిన తీరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దసరా పండుగ గురించి స్టేజ్‌పై మాట్లాడుతూ.. ఆయన చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. దీంతో ఈ వీడియో వైరల్ అయింది. రణబీర్ పై పెద్ద ఎత్తున ట్రోల్స్ నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే దసరా కార్యక్రమంలో తాను పొరపాటున నోరు జారినందుకు రణబీర్ కపూర్ క్షమాపణలు చెప్పారు.
“దసరా మనకు ఒక అందమైన విషయాన్ని గుర్తు చేస్తుంది. చెడు ఎంత బలమైనదైనా సరే, చివరకు అంతం అయ్యేది నిజం, మంచితనమే (aakhir mein ant sachchai aur achhai ki hi hogi)” అని అన్నాడు. నిజానికి ఆయన “చెడు ఎంత బలమైనదైనా, చివరకు గెలిచేది సత్యం, మంచితనమే” అని చెప్పాలనుకున్నాడు కానీ.. అక్కడ గెలుస్తుంది అనడానికి బదులు అంతం అవుతుంది అని చెప్పడంతో మీనింగ్ మొత్తం మారిపోయింది. ఈ పొరపాటుపై నెటిజన్లు ఎగతాళి చేయడంతో చివరకు ఆయన సారీ చెప్పారు.
Ranbir Kapoor at the Ramayana event
“Burai chahe kitni bhi taqatwar kyun na ho, aakhir mein aant sachai aur achhai ki hi hogi. 😵💫LOOK AT NAMIT MALHOTRA’S REACTION 😭😭 blud wants to give him the belt treatment right there on stage https://t.co/dr9ZU2d264
— A R E S (@aresthethird2) October 21, 2026
Ranbir Kapoor apologised for slip of tongue he has in yesterday’s event at Kolkata for #Ramayana https://t.co/phvwv29JM2
— Vajra 🏹 (@vajraTheAstra) October 21, 2026
నితేష్ తివారీ దర్శకత్వం వహించిన ‘రామాయణ’ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటించారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న పౌరాణిక ఇతిహాస చిత్రం ఇది. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా తొలి భాగాన్ని 2026 నవంబర్ 5న థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

