ప్రభన్యూస్

Amit Shah Padayatra: హైదరాబాద్‌ బీజేపీ మహా పాదయాత్రలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా..! | తెలంగాణ వార్తలు


Last Updated:

హైదరాబాద్ వేదికగా బీజేపీ చేపట్టిన ‘లోక్‌తంత్ర బచావో-అరాచకత హటావో’ మహాపాదయాత్రను కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ప్రారంభించారు. నిజాం కాలేజీ నుంచి ఎంజే మార్కెట్ వరకు ఈ యాత్ర కొనసాగుతోంది.

News18
News18

దరాబాద్‌లో భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘లోక్‌తంత్ర బచావో-అరాచకత హటావో’ మహాపాదయాత్ర అధికారికంగా ప్రారంభమైంది. నిజాం కాలేజ్ మైదానం నుంచి ఎంజే మార్కెట్ వరకు ఈ భారీ యాత్రకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్వయంగా నాయకత్వం వహిస్తూ ముందుండి నడిపించారు. ఓటర్ల జాబితాల సవరణ (SIR) ప్రక్రియపై కాంగ్రెస్, ఇండియా కూటమి చేస్తోన్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం మొదలైంది. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, పార్టీ ముఖ్య నేతలు, భారీ సంఖ్యలో శ్రేణులు ఆయనతో అడుగులు వేస్తున్నారు.

ఈ పాదయాత్ర అనంతరం ఎంజే మార్కెట్ వద్ద బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ నినాదంతో ప్రతిపక్షాల తీరును ఎండగడుతూ ప్రజల్లో చైతన్యం నింపేలా ఆయన కీలక సందేశం ఇవ్వనున్నారు.

సినీ దిగ్గజాలతో భేటీ.. రాజకీయ ప్రకంపనలు

పాదయాత్ర, బహిరంగ సభ ముగిసిన తర్వాత అమిత్ షా నగరంలో పలువురు ముఖ్యులతో సమావేశం కానున్నారు. ప్రముఖ సినీ నటులు చిరంజీవి, రామ్ చరణ్‌లతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉండటంతో ఈ పర్యటన తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. అటు రాజకీయ నాయకులతో సమీక్షలు, ఇటు సినీ ప్రముఖుల కలయికతో రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చర్చ మొదలైంది.

ఈ కార్యక్రమానికి ముందు అమిత్ షా చార్మినార్ సమీపంలోని ప్రసిద్ధ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతిపక్ష ఇండియా కూటమి సృష్టిస్తున్న గందరగోళానికి గట్టి సమాధానం చెప్పేందుకే ఈ యాత్రను వేదికగా మలుచుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అమిత్ షా రాకతో తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 02 November 2026, 4:53 pm Digital Edition : Prabhanews
Amit Shah Padayatra: హైదరాబాద్‌ బీజేపీ మహా పాదయాత్రలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా..! | తెలంగాణ వార్తలు

Last Updated:Nov 02, 2026 4:51 PM ISTహైదరాబాద్ వేదికగా బీజేపీ చేపట్టిన 'లోక్‌తంత్ర బచావో-అరాచకత హటావో' మహాపాదయాత్రను కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ప్రారంభించారు. నిజాం కాలేజీ నుంచి ఎంజే మార్కెట్ వరకు ఈ యాత్ర కొనసాగుతోంది.News18దరాబాద్‌లో భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘లోక్‌తంత్ర బచావో-అరాచకత హటావో’ మహాపాదయాత్ర అధికారికంగా ప్రారంభమైంది. నిజాం కాలేజ్ మైదానం నుంచి ఎంజే మార్కెట్ వరకు ఈ భారీ యాత్రకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్వయంగా నాయకత్వం వహిస్తూ ముందుండి నడిపించారు. ఓటర్ల జాబితాల సవరణ (SIR) ప్రక్రియపై కాంగ్రెస్, ఇండియా కూటమి చేస్తోన్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం మొదలైంది. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, పార్టీ ముఖ్య నేతలు, భారీ సంఖ్యలో శ్రేణులు ఆయనతో అడుగులు వేస్తున్నారు.ఈ పాదయాత్ర అనంతరం ఎంజే మార్కెట్ వద్ద బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ నినాదంతో ప్రతిపక్షాల తీరును ఎండగడుతూ ప్రజల్లో చైతన్యం నింపేలా ఆయన కీలక సందేశం ఇవ్వనున్నారు.
Live from 'Save Democracy Remove Anarchy' Maha Padayatra in Hyderabad.
హైదరాబాద్‌లో జరుగుతున్న 'ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం - అరాచకవాదాన్ని అంతం చేద్దాం' మహా పాదయాత్ర నుండి ప్రత్యక్ష ప్రసారం. https://t.co/uW7jfZaDYS— Amit Shah (@AmitShah) November 2, 2026సినీ దిగ్గజాలతో భేటీ.. రాజకీయ ప్రకంపనలుపాదయాత్ర, బహిరంగ సభ ముగిసిన తర్వాత అమిత్ షా నగరంలో పలువురు ముఖ్యులతో సమావేశం కానున్నారు. ప్రముఖ సినీ నటులు చిరంజీవి, రామ్ చరణ్‌లతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉండటంతో ఈ పర్యటన తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. అటు రాజకీయ నాయకులతో సమీక్షలు, ఇటు సినీ ప్రముఖుల కలయికతో రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చర్చ మొదలైంది.ఈ కార్యక్రమానికి ముందు అమిత్ షా చార్మినార్ సమీపంలోని ప్రసిద్ధ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతిపక్ష ఇండియా కూటమి సృష్టిస్తున్న గందరగోళానికి గట్టి సమాధానం చెప్పేందుకే ఈ యాత్రను వేదికగా మలుచుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అమిత్ షా రాకతో తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది.మరింత చదవండి

Source link