ప్రభన్యూస్

జిమ్ జిమ్ తార పాట వివాదం.. ‘ఆదర్శ కుటుంబం’ మూవీపై ‘పర్ణశాల’ నిర్మాత ఫైర్ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

విడుదలకు సిద్ధంగా ఉన్న ‘పర్ణశాల’ సినిమాలోని ‘జిమ్ జిమ్ తార’ పాటను ఇటీవల థియేటర్స్ లోకి వచ్చిన వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలో ఉపయోగించడంపై ‘పర్ణశాల’ నిర్మాత మంచి వెంకట్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

News18
News18

విడుదలకు సిద్ధంగా ఉన్న ‘పర్ణశాల’ సినిమాలోని ‘జిమ్ జిమ్ తార’ పాటను ఇటీవల థియేటర్స్ లోకి వచ్చిన వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలో ఉపయోగించడంపై ‘పర్ణశాల’ నిర్మాత మంచి వెంకట్ అభ్యంతరం వ్యక్తం చేశారు. హీరో వెంకటేష్‌కు సంబంధించిన ఓ సన్నివేశంలో తమ సినిమా పాటను 15 సెకన్ల పాటు వినియోగించారని, మా సినిమా రిలీజ్ కాకముందే ఇలా మా సినిమాలోని పాటను వాడటం చిన్న సినిమాకు అన్యాయం చేయడమే అని అన్నారు. చిన్న సినిమాను బ‌తికించండి అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన ‘పర్ణశాల’ నిర్మాత‌ మంచి వెంకట్.. ఇప్పటికే ఆదిత్య మ్యూజిక్ ద్వారా అధికారికంగా విడుదల చేసిన తమ సినిమా పాటను అనుమతి లేకుండా మరో చిత్రంలో ఉపయోగించడం వల్ల ‘పర్ణశాల’ సినిమాకు నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. ఇలాంటి చర్యలు చిన్న సినిమాల మనుగడకు ఇబ్బందికరంగా మారుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన చేసిన విజ్ఞప్తి ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చకు దారితీస్తోంది. దీంతో ఒక్కసారిగా మరోసారి పర్ణశాల సినిమాలోని ‘జిమ్ జిమ్ తార’ పాట జనాల్లో చర్చల్లో నిలిచింది.

ఎస్‌ఎల్‌టీ ఫిలిమ్స్ బ్యానర్‌పై మంచి వెంకట్ నిర్మిస్తున్న ‘పర్ణశాల’ చిత్రానికి వై.జి. భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. హారర్ కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా ‘జిమ్ జిమ్ తార’ పాటను లక్ష్మీదేవితో పాడించి చిత్ర బృందం వినూత్నంగా ప్రచారం చేపట్టింది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ పాట ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. వినూత్న ప్రచారంతో టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన ‘పర్ణశాల’ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సో, చూడాలి మరి ‘పర్ణశాల’ నిర్మాత వెంకట్ అభ్యంతరాలపై ‘ఆదర్శ కుటుంబం’ మేకర్స్ స్పందిస్తారా? లేదా అనేది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 31 October 2026, 1:19 pm Digital Edition : Prabhanews
జిమ్ జిమ్ తార పాట వివాదం.. ‘ఆదర్శ కుటుంబం’ మూవీపై ‘పర్ణశాల’ నిర్మాత ఫైర్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 31, 2026 1:12 PM ISTవిడుదలకు సిద్ధంగా ఉన్న ‘పర్ణశాల’ సినిమాలోని ‘జిమ్ జిమ్ తార’ పాటను ఇటీవల థియేటర్స్ లోకి వచ్చిన వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలో ఉపయోగించడంపై ‘పర్ణశాల’ నిర్మాత మంచి వెంకట్ అభ్యంతరం వ్యక్తం చేశారు.News18విడుదలకు సిద్ధంగా ఉన్న ‘పర్ణశాల’ సినిమాలోని ‘జిమ్ జిమ్ తార’ పాటను ఇటీవల థియేటర్స్ లోకి వచ్చిన వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలో ఉపయోగించడంపై ‘పర్ణశాల’ నిర్మాత మంచి వెంకట్ అభ్యంతరం వ్యక్తం చేశారు. హీరో వెంకటేష్‌కు సంబంధించిన ఓ సన్నివేశంలో తమ సినిమా పాటను 15 సెకన్ల పాటు వినియోగించారని, మా సినిమా రిలీజ్ కాకముందే ఇలా మా సినిమాలోని పాటను వాడటం చిన్న సినిమాకు అన్యాయం చేయడమే అని అన్నారు. చిన్న సినిమాను బ‌తికించండి అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన ‘పర్ణశాల’ నిర్మాత‌ మంచి వెంకట్.. ఇప్పటికే ఆదిత్య మ్యూజిక్ ద్వారా అధికారికంగా విడుదల చేసిన తమ సినిమా పాటను అనుమతి లేకుండా మరో చిత్రంలో ఉపయోగించడం వల్ల ‘పర్ణశాల’ సినిమాకు నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. ఇలాంటి చర్యలు చిన్న సినిమాల మనుగడకు ఇబ్బందికరంగా మారుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన చేసిన విజ్ఞప్తి ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చకు దారితీస్తోంది. దీంతో ఒక్కసారిగా మరోసారి పర్ణశాల సినిమాలోని ‘జిమ్ జిమ్ తార’ పాట జనాల్లో చర్చల్లో నిలిచింది.ఎస్‌ఎల్‌టీ ఫిలిమ్స్ బ్యానర్‌పై మంచి వెంకట్ నిర్మిస్తున్న ‘పర్ణశాల’ చిత్రానికి వై.జి. భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. హారర్ కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా ‘జిమ్ జిమ్ తార’ పాటను లక్ష్మీదేవితో పాడించి చిత్ర బృందం వినూత్నంగా ప్రచారం చేపట్టింది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ పాట ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. వినూత్న ప్రచారంతో టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన ‘పర్ణశాల’ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సో, చూడాలి మరి 'పర్ణశాల' నిర్మాత వెంకట్ అభ్యంతరాలపై 'ఆదర్శ కుటుంబం' మేకర్స్ స్పందిస్తారా? లేదా అనేది.మరింత చదవండి

Source link