భారతీయ వంటకాల్లో నెయ్యికి ప్రత్యేక స్థానం ఉంది. రోటీ, పప్పు, అన్నం, కూరల్లో కొద్దిగా నెయ్యి కలిపి తినేవారు చాలామందే ఉన్నారు. అయితే ఆరోగ్యం విషయంలోకి వచ్చేసరికి ఆవు నెయ్యి మంచిదా? గేదె నెయ్యి మంచిదా? అనే సందేహం చాలామందికి ఎదురవుతుంది. ఈ రెండూ పాల నుంచే తయారవుతాయి. వీటిలో కొవ్వు అధికంగా ఉంటుంది. అందువల్ల ఏ నెయ్యి తింటున్నామనే విషయంతో పాటు, రోజువారీ ఆహారం, శరీర బరువు, శారీరక శ్రమ, ఆరోగ్య పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

