పూరీలను డీప్ ఫ్రై చేయడానికి రైస్ బ్రాన్ ఆయిల్ మంచి ఎంపిక అని నిపుణులు చెబుతున్నారు. ఇందులో మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. అలాగే, శుద్ధి చేసిన రైస్ బ్రాన్ ఆయిల్‌కు సాధారణంగా అధిక స్మోక్ పాయింట్ ఉండటంతో వేడి నూనెలో పూరీలు వేయించడానికి అనుకూలంగా ఉంటుంది. కుసుమ నూనె, శుద్ధి చేసిన ఆలివ్ నూనె కూడా అధిక ఉష్ణోగ్రతల వద్ద వంట చేయడానికి ఉపయోగించవచ్చు. అయితే నూనెను ఎంచుకునేటప్పుడు దాని నాణ్యతతో పాటు, వేడి చేసినప్పుడు ఎంత స్థిరంగా ఉంటుందనే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

