ప్రభన్యూస్

Geeta Kapur: అందరూ అమ్మ అంటూ ప్రేమగా పిలుస్తారు.. కానీ ఈమె మాత్రం హ* ప్రయోగం అంటూ మాటలు.. 52 ఏళ్ల వయసులో..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ గీతా కపూర్ మరోసారి వార్తల్లో నిలిచారు. డ్యాన్స్ రియాలిటీ షోల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన ఆమెను అభిమానులు ప్రేమగా ‘గీతా మా’ అని పిలుస్తుంటారు.

News18
News18

బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ గీతా కపూర్ మరోసారి వార్తల్లో నిలిచారు. డ్యాన్స్ రియాలిటీ షోల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన ఆమెను అభిమానులు ప్రేమగా ‘గీతా మా’ అని పిలుస్తుంటారు. అయితే ఈ సారి ఆమె తన డ్యాన్స్‌తో కాకుండా వ్యక్తిగత జీవితం, మహిళల శారీరక అవసరాల గురించి చేసిన వ్యాఖ్యలతో చర్చకు వచ్చారు. సాధారణంగా బహిరంగంగా మాట్లాడటానికి చాలామంది ఇబ్బంది పడే అంశంపై ఆమె ఎలాంటి సంకోచం లేకుండా స్పందించడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

శార్దుల్ పండిట్ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న గీతా కపూర్‌ను హ* ప్రయోగం గురించి ప్రశ్నించారు. దీనికి ఆమె నేరుగా సమాధానమిచ్చారు. ఈ అంశాన్ని తప్పుగా చూడాల్సిన అవసరం లేదని, మహిళలు తమ శారీరక ఆరోగ్యం, వ్యక్తిగత అవసరాల గురించి అవగాహన కలిగి ఉండటం ముఖ్యమని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని ప్రశ్నించిన వ్యక్తి కొంత ఇబ్బందిగా భావించడాన్ని గమనించిన ఆమె.. అలాంటి ప్రశ్న అడగడానికి ఎందుకు సంకోచిస్తున్నారని కూడా ప్రశ్నించారు. .

జీవితంలో భాగస్వామి లేకపోయినా, పెళ్లి చేసుకోకపోయినా ఒక వ్యక్తికి భావోద్వేగాలు, శారీరక అవసరాలు ఉంటాయని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. వాటి గురించి మాట్లాడటం తప్పు కాదని, ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత జీవితాన్ని గౌరవించుకోవాలని ఆమె చెప్పిన మాటలు చర్చకు దారితీశాయి. ముఖ్యంగా మహిళల వ్యక్తిగత నిర్ణయాలను వారి వయసు, వైవాహిక స్థితి ఆధారంగా అంచనా వేయడం సరైన పద్ధతి కాదనే అభిప్రాయం ఆమె వ్యాఖ్యల్లో కనిపించింది.

ఇక గీతా కపూర్ బాలీవుడ్‌లో పలు సినిమాలకు కొరియోగ్రఫీ చేయడంతో పాటు ఫరా ఖాన్‌కు అసిస్టెంట్‌గా కూడా పనిచేశారు. ‘కుచ్ కుచ్ హోతా హై’, ‘కల్ హో నా హో’, ‘కభీ ఖుషీ కభీ ఘమ్’, ‘మై హూన్ నా’, ‘ఓం శాంతి ఓం’ వంటి సినిమాల నిర్మాణ సమయంలో ఫరా ఖాన్ బృందంలో ఆమె భాగమయ్యారు. 2008లో డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ రియాలిటీ షోతో టెలివిజన్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత సూపర్ డ్యాన్సర్, ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్ వంటి షోలకు జడ్జిగా వ్యవహరించారు. పిల్లలతో ప్రేమగా ఉంటూ, కంటెస్టెంట్లను ప్రోత్సహించే విధానం కారణంగా అభిమానులు ఆమెను ‘గీతా మా’ అని పిలుస్తుంటారు.

వృత్తిపరంగా ఎంతో సక్సెస్ అయిన గీతా కపూర్ తన వ్యక్తిగత జీవితం విషయంలోనూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఆమె ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. పెళ్లి, పిల్లలు మాత్రమే జీవితంలో ఆనందానికి మార్గాలు కావని, వ్యక్తిగత నిర్ణయాలను ఇతరులు గౌరవించాలని ఆమె అభిప్రాయపడుతున్నారు. ఇటీవల స్వయంతృప్తి గురించి ఆమె చేసిన బహిరంగ వ్యాఖ్యలు కూడా చర్చకు దారితీశాయి. మహిళల వ్యక్తిగత జీవితంపై సమాజం విధించే పరిమితులు, వారి ఎంపికలను విమర్శించే ధోరణి గురించి ఆమె స్పందించడం ప్రత్యేకంగా నిలిచింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 October 2026, 4:21 pm Digital Edition : Prabhanews
Geeta Kapur: అందరూ అమ్మ అంటూ ప్రేమగా పిలుస్తారు.. కానీ ఈమె మాత్రం హ* ప్రయోగం అంటూ మాటలు.. 52 ఏళ్ల వయసులో..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 29, 2026 4:12 PM ISTబాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ గీతా కపూర్ మరోసారి వార్తల్లో నిలిచారు. డ్యాన్స్ రియాలిటీ షోల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన ఆమెను అభిమానులు ప్రేమగా ‘గీతా మా’ అని పిలుస్తుంటారు. News18బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ గీతా కపూర్ మరోసారి వార్తల్లో నిలిచారు. డ్యాన్స్ రియాలిటీ షోల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన ఆమెను అభిమానులు ప్రేమగా ‘గీతా మా’ అని పిలుస్తుంటారు. అయితే ఈ సారి ఆమె తన డ్యాన్స్‌తో కాకుండా వ్యక్తిగత జీవితం, మహిళల శారీరక అవసరాల గురించి చేసిన వ్యాఖ్యలతో చర్చకు వచ్చారు. సాధారణంగా బహిరంగంగా మాట్లాడటానికి చాలామంది ఇబ్బంది పడే అంశంపై ఆమె ఎలాంటి సంకోచం లేకుండా స్పందించడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.శార్దుల్ పండిట్ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న గీతా కపూర్‌ను హ* ప్రయోగం గురించి ప్రశ్నించారు. దీనికి ఆమె నేరుగా సమాధానమిచ్చారు. ఈ అంశాన్ని తప్పుగా చూడాల్సిన అవసరం లేదని, మహిళలు తమ శారీరక ఆరోగ్యం, వ్యక్తిగత అవసరాల గురించి అవగాహన కలిగి ఉండటం ముఖ్యమని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని ప్రశ్నించిన వ్యక్తి కొంత ఇబ్బందిగా భావించడాన్ని గమనించిన ఆమె.. అలాంటి ప్రశ్న అడగడానికి ఎందుకు సంకోచిస్తున్నారని కూడా ప్రశ్నించారు. .జీవితంలో భాగస్వామి లేకపోయినా, పెళ్లి చేసుకోకపోయినా ఒక వ్యక్తికి భావోద్వేగాలు, శారీరక అవసరాలు ఉంటాయని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. వాటి గురించి మాట్లాడటం తప్పు కాదని, ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత జీవితాన్ని గౌరవించుకోవాలని ఆమె చెప్పిన మాటలు చర్చకు దారితీశాయి. ముఖ్యంగా మహిళల వ్యక్తిగత నిర్ణయాలను వారి వయసు, వైవాహిక స్థితి ఆధారంగా అంచనా వేయడం సరైన పద్ధతి కాదనే అభిప్రాయం ఆమె వ్యాఖ్యల్లో కనిపించింది.ఇక గీతా కపూర్ బాలీవుడ్‌లో పలు సినిమాలకు కొరియోగ్రఫీ చేయడంతో పాటు ఫరా ఖాన్‌కు అసిస్టెంట్‌గా కూడా పనిచేశారు. 'కుచ్ కుచ్ హోతా హై', 'కల్ హో నా హో', 'కభీ ఖుషీ కభీ ఘమ్', 'మై హూన్ నా', 'ఓం శాంతి ఓం' వంటి సినిమాల నిర్మాణ సమయంలో ఫరా ఖాన్ బృందంలో ఆమె భాగమయ్యారు. 2008లో డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ రియాలిటీ షోతో టెలివిజన్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత సూపర్ డ్యాన్సర్, ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్ వంటి షోలకు జడ్జిగా వ్యవహరించారు. పిల్లలతో ప్రేమగా ఉంటూ, కంటెస్టెంట్లను ప్రోత్సహించే విధానం కారణంగా అభిమానులు ఆమెను ‘గీతా మా’ అని పిలుస్తుంటారు.వృత్తిపరంగా ఎంతో సక్సెస్ అయిన గీతా కపూర్ తన వ్యక్తిగత జీవితం విషయంలోనూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఆమె ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. పెళ్లి, పిల్లలు మాత్రమే జీవితంలో ఆనందానికి మార్గాలు కావని, వ్యక్తిగత నిర్ణయాలను ఇతరులు గౌరవించాలని ఆమె అభిప్రాయపడుతున్నారు. ఇటీవల స్వయంతృప్తి గురించి ఆమె చేసిన బహిరంగ వ్యాఖ్యలు కూడా చర్చకు దారితీశాయి. మహిళల వ్యక్తిగత జీవితంపై సమాజం విధించే పరిమితులు, వారి ఎంపికలను విమర్శించే ధోరణి గురించి ఆమె స్పందించడం ప్రత్యేకంగా నిలిచింది.మరింత చదవండి

Source link