ఉదాహరణకు, మీరు మూడేళ్ల పిల్లవాడితో రైలులో ప్రయాణిస్తున్నారనుకుందాం. ఆ పిల్లవాడికి ప్రత్యేక బెర్త్ అవసరం లేకపోతే ఉచితంగా ప్రయాణించవచ్చు. అదే పిల్లవాడికి ప్రత్యేక బెర్త్ కావాలంటే మాత్రం పెద్దలకు వర్తించే పూర్తి టికెట్ ఛార్జీని చెల్లించాలి. ఐదేళ్లు నిండిన పిల్లలు, 12 ఏళ్లు నిండని పిల్లలకు చైల్డ్ ఫేర్ నిబంధనలు వర్తిస్తాయి. వీరికి ఎంత టికెట్ ఛార్జీ చెల్లించాలనేది ప్రయాణించే క్లాస్, ప్రత్యేక సీటు లేదా బెర్త్ కావాలా లేదా అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. రిజర్వ్డ్ బెర్త్ ఉన్న క్లాసుల్లో ప్రయాణిస్తే, ప్రత్యేక బెర్త్ అవసరం లేదని ఎంచుకున్నప్పుడు సాధారణంగా పెద్దలకు వర్తించే బేసిక్ ఫేర్‌లో సగం ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే, దీనికి సంబంధించి వర్తించే రైల్వే నిబంధనలు పాటించాలి. ప్రత్యేక బెర్త్ కావాలంటే, ఐదేళ్లు నిండిన పిల్లలకు 12 ఏళ్లు వచ్చేలోపు ప్రత్యేక బెర్త్ బుక్ చేయాలని తల్లిదండ్రులు అనుకుంటే సాధారణంగా పెద్దలకు వర్తించే పూర్తి టికెట్ ఛార్జీ చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)

