ఈ కొత్త సేవ ప్రారంభం సందర్భంగా ఫోన్‌పేలో పేమెంట్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్, హెడ్ దీప్ అగర్వాల్ మాట్లాడుతూ.. ప్రతి భారతీయుడు ఆర్థికంగా ఎదిగేందుకు, ఆర్థిక సేవలను సులభంగా పొందేందుకు అవకాశం కల్పించడమే ఫోన్‌పే లక్ష్యమని చెప్పారు. “తత్కాల్ ఎన్పీఎస్ ప్రారంభం దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళిక, రిటైర్మెంట్ భద్రతను సామాన్యులకు చేరువ చేయడంలో కీలక ముందడుగు. పూర్తిగా డిజిటల్ విధానంలో ఈ ప్రక్రియను సులభతరం చేశాం. పీఎఫ్ఆర్డీఏ మార్గదర్శకత్వంలో భారతదేశంలోని నమ్మకమైన బ్యాంకులతో కలిసి పనిచేస్తున్నాం. దీని ద్వారా దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు సురక్షితంగా, నమ్మకంగా, సులభంగా నియంత్రణలో ఉన్న రిటైర్మెంట్ ప్లానింగ్ సేవలను పొందవచ్చు” అని ఆయన వివరించారు. (ప్రతీకాత్మక చిత్రం)

