ఈ కార్లు పొందిన ఉద్యోగులకు కంపెనీ మరో ప్రయోజనం కూడా కల్పిస్తోంది. వారి వ్యక్తిగత అవసరాల కోసం ప్రతి నెలా రూ.2,500 చొప్పున పెట్రోల్ ఖర్చులను కంపెనీ చెల్లిస్తోంది. ఉద్యోగులు కంపెనీ అధికారిక పనుల కోసం ఈ కార్లను ఉపయోగిస్తే, ఆ ప్రయాణానికి అయ్యే పెట్రోల్ ఖర్చులను కూడా విడిగా చెల్లిస్తారు. గతంలో కంపెనీ కార్లను కొనుగోలు చేసి తన పేరుతో రిజిస్టర్ చేసేదని భాటియా ఓ వీడియోలో వెల్లడించారు. అయితే, ఆ తర్వాత ఈ విధానంలో మార్పు చేసి, నేరుగా ఉద్యోగుల పేర్ల మీదే కార్లను రిజిస్టర్ చేయడం ప్రారంభించారు. (image: MITS / instagram)

