ప్రభన్యూస్

Kolkata: కోల్‌కతాలో దారుణం.. నగ్నంగా నడిపించిన ముద్దు! |


Last Updated:

Kolkata: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో మానవత్వాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేసే అమానుష ఘటన వెలుగుచూసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

పార్కులో తన స్నేహితురాలికి ముద్దు పెట్టాడన్న నెపంతో 17 ఏళ్ల మైనర్ బాలుడు, అతని స్నేహితుడు, తండ్రిని అత్యంత దారుణంగా కొట్టి, బలవంతంగా నగ్నంగా నడిపించి వీడియోలు తీసిన ఉదంతం తీవ్ర కలకలం రేపింది. ఈ కిరాతకానికి పాల్పడిన బాలిక తల్లిదండ్రులు, మేనమామను పోలీసులు అరెస్టు చేశారు.

అసలేం జరిగింది?

దక్షిణ కోల్‌కతాలోని సర్సునా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరాంపల్లి, బసుంధర పార్కులో ఆదివారం సాయంత్రం ఈ దారుణం చోటుచేసుకుంది. 17 ఏళ్ల బాలుడు తన 13 ఏళ్ల స్నేహితురాలితో కలిసి పార్కులో మాట్లాడుకుంటూ ఆమెకు ముద్దు పెట్టాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న బాలిక మేనమామ ఆ దృశ్యాన్ని గమనించాడు. వెంటనే అతడు ఆగ్రహంతో ఊగిపోతూ బాలిక తల్లిదండ్రులకు, ఇతర బంధుమిత్రులకు సమాచారం అందించాడు. వారంతా కలిసి బాలుడిని, అతనితో పాటు ఉన్న మరో మిత్రుడిని బలవంతంగా తమ ఇంటి వద్దకు లాక్కెళ్లి చితకబాదారు.

తండ్రి చేతికి తుపాకీ ఇచ్చి బెదిరింపులు

అనంతరం బాలుడితో అతని తండ్రికి ఫోన్ చేయించి అక్కడికి రప్పించారు. కొడుకు సమాచారం తెలుసుకుని హుటాహుటిన అక్కడికి చేరుకున్న తండ్రిపై కూడా మూక విచక్షణారహితంగా దాడి చేసింది. అంతటితో ఆగకుండా బాలిక మేనమామ తండ్రి చేతిలో ఒక తుపాకీ పెట్టాడు. “నీ ముందు రెండే మార్గాలున్నాయి.. నీ కొడుకును కాల్చి చంపు లేదా మీరిద్దరూ నగ్నంగా మారండి” అని తీవ్రంగా హెచ్చరించాడు. ప్రాణభయంతో వారు వేరే దారి లేక తలొగ్గాల్సి వచ్చింది. బాలుడు, అతని తండ్రి, స్నేహితుడు ముగ్గురి దుస్తులు బలవంతంగా విప్పించి నగ్నంగా రోడ్డుపై నడిపిస్తూ నిందితులు తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు చిత్రీకరించారు.

పోలీసుల దర్యాప్తు.. ముగ్గురు అరెస్టు

బాధితుడైన తండ్రి వెంటనే సర్సునా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు హత్యాయత్నంతో పాటు భారతీయ న్యాయ సంహిత (BNS) పరిధిలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాలిక తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకోగా, పరారైన మేనమామను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆ మేనమామకు తుపాకీ ఎక్కడి నుంచి లభించిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ ఘాతుకానికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వ్యాపించడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి బాలిక ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 27 October 2026, 5:50 am Digital Edition : Prabhanews
Kolkata: కోల్‌కతాలో దారుణం.. నగ్నంగా నడిపించిన ముద్దు! |

Last Updated:Oct 27, 2026 5:43 AM ISTKolkata: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో మానవత్వాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేసే అమానుష ఘటన వెలుగుచూసింది.ప్రతీకాత్మక చిత్రంపార్కులో తన స్నేహితురాలికి ముద్దు పెట్టాడన్న నెపంతో 17 ఏళ్ల మైనర్ బాలుడు, అతని స్నేహితుడు, తండ్రిని అత్యంత దారుణంగా కొట్టి, బలవంతంగా నగ్నంగా నడిపించి వీడియోలు తీసిన ఉదంతం తీవ్ర కలకలం రేపింది. ఈ కిరాతకానికి పాల్పడిన బాలిక తల్లిదండ్రులు, మేనమామను పోలీసులు అరెస్టు చేశారు.అసలేం జరిగింది?దక్షిణ కోల్‌కతాలోని సర్సునా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరాంపల్లి, బసుంధర పార్కులో ఆదివారం సాయంత్రం ఈ దారుణం చోటుచేసుకుంది. 17 ఏళ్ల బాలుడు తన 13 ఏళ్ల స్నేహితురాలితో కలిసి పార్కులో మాట్లాడుకుంటూ ఆమెకు ముద్దు పెట్టాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న బాలిక మేనమామ ఆ దృశ్యాన్ని గమనించాడు. వెంటనే అతడు ఆగ్రహంతో ఊగిపోతూ బాలిక తల్లిదండ్రులకు, ఇతర బంధుమిత్రులకు సమాచారం అందించాడు. వారంతా కలిసి బాలుడిని, అతనితో పాటు ఉన్న మరో మిత్రుడిని బలవంతంగా తమ ఇంటి వద్దకు లాక్కెళ్లి చితకబాదారు.తండ్రి చేతికి తుపాకీ ఇచ్చి బెదిరింపులుఅనంతరం బాలుడితో అతని తండ్రికి ఫోన్ చేయించి అక్కడికి రప్పించారు. కొడుకు సమాచారం తెలుసుకుని హుటాహుటిన అక్కడికి చేరుకున్న తండ్రిపై కూడా మూక విచక్షణారహితంగా దాడి చేసింది. అంతటితో ఆగకుండా బాలిక మేనమామ తండ్రి చేతిలో ఒక తుపాకీ పెట్టాడు. "నీ ముందు రెండే మార్గాలున్నాయి.. నీ కొడుకును కాల్చి చంపు లేదా మీరిద్దరూ నగ్నంగా మారండి" అని తీవ్రంగా హెచ్చరించాడు. ప్రాణభయంతో వారు వేరే దారి లేక తలొగ్గాల్సి వచ్చింది. బాలుడు, అతని తండ్రి, స్నేహితుడు ముగ్గురి దుస్తులు బలవంతంగా విప్పించి నగ్నంగా రోడ్డుపై నడిపిస్తూ నిందితులు తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు చిత్రీకరించారు.పోలీసుల దర్యాప్తు.. ముగ్గురు అరెస్టుబాధితుడైన తండ్రి వెంటనే సర్సునా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు హత్యాయత్నంతో పాటు భారతీయ న్యాయ సంహిత (BNS) పరిధిలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాలిక తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకోగా, పరారైన మేనమామను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆ మేనమామకు తుపాకీ ఎక్కడి నుంచి లభించిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ ఘాతుకానికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వ్యాపించడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి బాలిక ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.మరింత చదవండి

Source link