కానీ డిమాండ్ కు తగ్గట్టు సరుకు దిగుబడి రాకుండా అధిక మోదాతులో రావడంతో ప్రతి ఏటా మామిడి సాగులో కూడా రైతన్నలు నష్టాలు చూడడం జరుగుతుంది. అరటి సాగుకు వస్తే అలా నష్టాలు దగ్గర కాకుండా ఆశించిన మేర లాభాలు రాకుండా, పెట్టిన పెట్టుబడి వస్తుంది ఆశించిన మేర లాభాలు రాలేదని రైతన్నలు సాగు వైపు కొద్ది తగ్గుముఖం పట్టారు..
నిలకడగా లాభాలు అర్జించే విధంగా, తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం వచ్చే సాగు, సంవత్సర కాలం పొడవునా లాభాలు వచ్చేటువంటి పంట, మార్కెట్లో మంచి డిమాండ్ గల పంట, అలాంటి పంట సాగు చేయాలనే క్రమంలో వినూత్నంగా చిత్తూరు జిల్లాకు చెందినటువంటి రైతన్న పలుచోట్ల రైతులు స్నేహితులు సలహాలు తీసుకొని ఒక నిర్ణయానికి వచ్చి ఇష్టంతో స్నేహితుని సలహాతో అవకాడో సాగుపై మక్కువ పెంచాడు. స్నేహితుడు ఏ ముహూర్తాన అతనికి ఈ అవకాడో సాగుపై మక్కువ పెంచాడో అప్పటి నుంచి చక్కగా లాభాలతో దూసుకెళ్తున్నాడు.
చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గం, గంగవరం మండలం, చిన్నూరు గ్రామానికి చెందిన వెంకటరమణ అనే రైతన్న తనకున్న ఒక ఎకరా పొలంలో అవకాడో సాగు చేశాడు. ప్రస్తుతం తన పొలంలో ఉన్న చెట్లు కాల వ్యవది ఐదు సంవత్సరాలు. ప్రతి ఏటా జూన్ మాసంలో క్రాప్ కు సిద్ధంగా ఉంటుందని రైతన్న లోకల్ 18 తో వివరించారు.
పది అడుగులకు ఒక మొక్క చొప్పున నాటి ఇలా సుమారు ఎకరాకు 360 మొక్కల వరకూ నాటుకోవచ్చని నర్సరీ యజమాని శ్రీనివాసులు లోకల్ 18 ద్వారా వివరించారు. ఇలా పది అడుగులకు ఒక మొక్క చొప్పున నాటుకుంటే ఆ తోటకు ప్రహరీగా మహాగని మొక్కలు పెట్టుకోవచ్చు అన్నారు. ఒక మొక్క ధర 400 రూపాయలు, ఒక్కసారి మాత్రమే పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
వీటికి రెండు రకాల తెగుళ్లు మాత్రమే వస్తాయి వాటికి తక్కువ మోతాదులో పిచికారి చేసుకుంటే చాలు నాటిన రెండు సంవత్సరాలకే దిగుబడి వస్తుందన్నారు. ఒక చెట్టుకు 70 నుంచి 80 కేజీల దిగుబడి వస్తుందన్నారు. ఎకరాకు లక్ష నుంచి 1,10,000 వరకు ఖర్చు వస్తుందన్నారు. ఒక్కసారి దిగుబడి వస్తే నాలుగు నుంచి ఐదు లక్షల వరకు లాభం వస్తుందన్నారు. పండించిన పంటను మార్కెట్ కు ఎగుమతి చేయాల్సినటువంటి పనేలేదు. తోట వద్దకే వచ్చి కొనుగోలు చేసుకుంటారని రైతన్న తెలిపాడు.
బయట ప్రాంతాల్లో ధరలు ఎక్కువగా ఉండి, పరిసర ప్రాంతాల్లో ధరలు తక్కువగా ఉంటే మనం ఆన్లైన్ ద్వారా బయట ప్రాంతాలకు ఎగుమతి చేయవచ్చన్నారు. ఆర్టీసీ కొరియర్ ద్వారా ఎక్కువ మోతాదులో ఎగుమతి చేశామని రైతన్న తెలిపాడు. మా తోటలో పండించినటువంటి అవకాడోను కర్ణాటక, తమిళనాడు వంటి ప్రాంతాలకు ఎగుమతి చేశారన్నారు. వ్యవసాయంలో నష్టాలు చూసినటువంటి రైతన్నలు ఇలాంటి వినూత్నమైన అవకాడో సాగుపై మక్కువ చూపితే చాలు మంచి లాభాలు అర్జించవచ్చని రైతన్న తెలిపాడు.
ఎవరైనా రైతులు అవకాడో సాగు చేయాలంటే మమ్మల్ని సంప్రదిస్తే, మొక్కలు వాటి హేపు విధానము, సస్యరక్షణ మార్కెటింగ్ చేసే విధానము, అన్ని శిక్షణతో పాటు అవగాహన కల్పిస్తామని రైతన్న తెలిపాడు. రైతులు సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ 91770 33635 కోరారు.
ఒక చెట్టుకు 80 కేజీలు దిగుబడి వస్తే సుమారు ఒక ఎకరాకి 2400 కేజీలు దిగుబడి వస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో 250 నుండి 300 వరకు పలుకుతుంది. ప్రస్తుతం పలుకుతున్న ధరలతో పోలిస్తే ఎకరాకు 6 నుండి 7 లక్షల రూపాయలు వస్తుంది. పెట్టుబడి పోగా ఎకరాకు నికరంగా 5 లక్షల వరకు మిగులుతుందని రైతన్న హర్షం వ్యక్తం చేస్తున్నాడు. మిగతా పంటలతో పోల్చితే ఈ అవకాడో సాగు లాభాల సాగుగా చెప్పవచ్చు. ఈ పంటతో పాటు అంతర పంటలు పలు రకాలుగా సాగు చేసుకోవచ్చని వీటి ద్వారా కూడా లాభాలు అర్జించవచ్చని రైతన్న పేర్కొన్నారు.
