ఇదిలా ఉండగా, 2026–27 ఇథనాల్ సరఫరా సంవత్సరానికి సంబంధించిన టెండర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సమతుల్యమైన నిర్ణయం తీసుకోవడాన్ని ఏఐడీఏ గతంలో స్వాగతించింది. ముడిసరుకుల లభ్యతలో వస్తున్న మార్పులు, వ్యవసాయ రంగ ప్రాధాన్యతలు, దేశంలో పెరుగుతున్న ఇథనాల్ అవసరాలను పరిగణనలోకి తీసుకోవడాన్ని ప్రశంసించింది. ఇథనాల్ తయారీకి ఉపయోగించే ఏ ఒక్క ముడిసరకుకూ ఇతర వాటి కంటే అధిక ప్రాధాన్యత ఇవ్వకూడదన్నది ఏఐడీఏ అభిప్రాయం. ఇథనాల్ తయారీకి ఉపయోగపడే అన్ని రకాల ముడిసరుకులకూ తగిన ప్రభుత్వ ప్రోత్సాహకాలు, లాభదాయకమైన కొనుగోలు ధరలు అందాలని సంస్థ చెబుతోంది. మొక్కజొన్నతో ఇథనాల్ తయారుచేయాలంటే ముడిసరుకు కొనుగోలు, ప్రాసెసింగ్, ప్లాంట్ల నిర్వహణకు గణనీయమైన ఖర్చులు అవుతాయని ఏఐడీఏ గతంలో పేర్కొంది. ధాన్యాల ఆధారంగా పనిచేసే ఇథనాల్ ప్లాంట్లలో పెట్టుబడులు కొనసాగాలన్నా, దేశీయ వ్యవసాయ సరఫరా వ్యవస్థ బలపడాలన్నా, మొక్కజొన్న రైతులకు స్థిరమైన మార్కెట్ అవకాశాలు లభించాలన్నా తగిన ప్రోత్సాహకాలు అవసరమని తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)

