నేటి డిజిటల్ యుగంలో సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అయిన ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ ద్వారా అభిమానులకు ఎంత చేరువగా ఉంటున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ వృత్తిపరమైన అప్డేట్స్తో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటూ వారు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంటున్నారు. అయితే, ఈ వర్చువల్ ప్రపంచంలో పాజిటివిటీతో పాటు నెగెటివిటీ కూడా అంతే స్థాయిలో ఉంది. ఈ నెగెటివిటీని భరించలేక పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియాకు గుడ్‌బై చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సతీమణి అన్నా లెజినోవా (Anna Lezhneva) కూడా ఇదే బాట పట్టారని తెలుస్తోంది.

