ప్రభన్యూస్

భారత్‌కు ట్రంప్ భారీ ఊరట.. రష్యా చమురు కొనుగోళ్లపై 100 శాతం సుంకాల విధింపు తాత్కాలికంగా నిలిపివేత! |


Last Updated:

రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసే భారత్ వంటి దేశాలపై విధించతలపెట్టిన 100 శాతం అదనపు సుంకాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలికంగా నిలిపివేశారు. దీనిపై 60 రోజుల పాటు అధ్యయనం చేయనున్నారు.

News18
News18

రష్యా నుంచి ముడి చమురు, సహజ వాయువు దిగుమతి చేసుకునే భారత్, చైనా లాంటి దేశాలపై 100 శాతం వరకు అదనపు సుంకాలు విధించేందుకు ఉద్దేశించిన ‘గ్రహం చట్టం’ కీలక నిబంధనలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ నిర్ణయం ద్వారా రానున్న 60 రోజుల పాటు అంతర్జాతీయ మార్కెట్లు, భౌగోళిక రాజకీయ పరిస్థితులను లోతుగా సమీక్షించనున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు. అక్టోబర్ 18 నుంచి అమల్లోకి రావాల్సిన ఈ కఠిన సుంకాల నుంచి భారత్‌కు తాత్కాలిక మినహాయింపు లభించింది.

ఇరాన్ యుద్ధ సంక్షోభం, సౌదీ అరేబియాపై హౌతీల దాడులు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి సంక్లిష్ట పరిస్థితుల వల్ల ప్రపంచ ఇంధన మార్కెట్ దెబ్బతినకుండా ఉండటానికే ఈ చర్య తీసుకున్నట్లు అగ్రరాజ్యం వెల్లడించింది.

అంతర్జాతీయ మార్కెట్ స్థిరత్వం కోసమే వెసులుబాటు

న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. భారత్ ఇంధన వనరులను విస్తరించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, ఒక్క రాత్రిలోనే రష్యా నుంచి చమురు దిగుమతులు ఆపేయడం సాధ్యం కాదని అమెరికా అంగీకరించింది. ఈ నిలిపివేత వల్ల భారతీయ రిఫైనరీలకు భారీ ఉపశమనం లభించింది. పెరిగిన సుంకాల భారం లేకుండానే రష్యా నుంచి రాయితీ ముడి చమురు దిగుమతులను యథావిధిగా కొనసాగించేందుకు వెసులుబాటు దక్కింది.

అయితే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై అమెరికా పార్లమెంట్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రష్యాపై ఆర్థిక ఒత్తిడి తగ్గించడం మాస్కో సైనిక చర్యలకు ఊతం ఇచ్చినట్లేనని డెమొక్రాటిక్ సెనేటర్ ఎలిజబెత్ వారెన్ విమర్శించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా ఈ మినహాయింపును తీవ్రంగా తప్పుపట్టారు.

ఈ నిర్ణయం భారత్‌కు తక్షణ ఊరటనిచ్చినా దీర్ఘకాలిక భరోసా కాదని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 60 రోజుల సమీక్ష తర్వాత అమెరికా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే సందిగ్ధత ఇంకా మిగిలే ఉంది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత్ పర్యటనకు రానున్న వేళ ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 October 2026, 6:26 pm Digital Edition : Prabhanews
భారత్‌కు ట్రంప్ భారీ ఊరట.. రష్యా చమురు కొనుగోళ్లపై 100 శాతం సుంకాల విధింపు తాత్కాలికంగా నిలిపివేత! |

Last Updated:Oct 18, 2026 6:12 PM ISTరష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసే భారత్ వంటి దేశాలపై విధించతలపెట్టిన 100 శాతం అదనపు సుంకాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలికంగా నిలిపివేశారు. దీనిపై 60 రోజుల పాటు అధ్యయనం చేయనున్నారు.News18రష్యా నుంచి ముడి చమురు, సహజ వాయువు దిగుమతి చేసుకునే భారత్, చైనా లాంటి దేశాలపై 100 శాతం వరకు అదనపు సుంకాలు విధించేందుకు ఉద్దేశించిన 'గ్రహం చట్టం' కీలక నిబంధనలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ నిర్ణయం ద్వారా రానున్న 60 రోజుల పాటు అంతర్జాతీయ మార్కెట్లు, భౌగోళిక రాజకీయ పరిస్థితులను లోతుగా సమీక్షించనున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు. అక్టోబర్ 18 నుంచి అమల్లోకి రావాల్సిన ఈ కఠిన సుంకాల నుంచి భారత్‌కు తాత్కాలిక మినహాయింపు లభించింది.ఇరాన్ యుద్ధ సంక్షోభం, సౌదీ అరేబియాపై హౌతీల దాడులు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి సంక్లిష్ట పరిస్థితుల వల్ల ప్రపంచ ఇంధన మార్కెట్ దెబ్బతినకుండా ఉండటానికే ఈ చర్య తీసుకున్నట్లు అగ్రరాజ్యం వెల్లడించింది.అంతర్జాతీయ మార్కెట్ స్థిరత్వం కోసమే వెసులుబాటున్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. భారత్ ఇంధన వనరులను విస్తరించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, ఒక్క రాత్రిలోనే రష్యా నుంచి చమురు దిగుమతులు ఆపేయడం సాధ్యం కాదని అమెరికా అంగీకరించింది. ఈ నిలిపివేత వల్ల భారతీయ రిఫైనరీలకు భారీ ఉపశమనం లభించింది. పెరిగిన సుంకాల భారం లేకుండానే రష్యా నుంచి రాయితీ ముడి చమురు దిగుమతులను యథావిధిగా కొనసాగించేందుకు వెసులుబాటు దక్కింది.అయితే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై అమెరికా పార్లమెంట్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రష్యాపై ఆర్థిక ఒత్తిడి తగ్గించడం మాస్కో సైనిక చర్యలకు ఊతం ఇచ్చినట్లేనని డెమొక్రాటిక్ సెనేటర్ ఎలిజబెత్ వారెన్ విమర్శించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా ఈ మినహాయింపును తీవ్రంగా తప్పుపట్టారు.ఈ నిర్ణయం భారత్‌కు తక్షణ ఊరటనిచ్చినా దీర్ఘకాలిక భరోసా కాదని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 60 రోజుల సమీక్ష తర్వాత అమెరికా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే సందిగ్ధత ఇంకా మిగిలే ఉంది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత్ పర్యటనకు రానున్న వేళ ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.మరింత చదవండి

Source link