ప్రభన్యూస్

కళ్లెదుటే చెల్లికి అవమానం.. రక్తం మరిగిన అన్న! ఆ తర్వాత జరిగిన దారుణం మీ ఊహకు కూడా అందదు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

చెల్లిని ఏడిపిస్తున్నారని అడిగిన పాపానికి.. ఆ ఉన్మాదులు ఎంతటి ఘాతుకానికి పాల్పడ్డారో చూస్తే వణికిపోతారు!

కళ్లెదుటే చెల్లికి అవమానం.. రక్తం మరిగిన అన్న! ఆ తర్వాత జరిగిన దారుణం మీ ఊహకు కూడా అందదు!
కళ్లెదుటే చెల్లికి అవమానం.. రక్తం మరిగిన అన్న! ఆ తర్వాత జరిగిన దారుణం మీ ఊహకు కూడా అందదు!

బాధలో ఉన్న ఆ కుటుంబానికి మరో కోలుకోలేని విషాదం ఎదురైంది. అమ్మమ్మను కడసారి చూసుకుని, కన్నీటి వీడ్కోలు పలుకుదామనుకున్న ఆ యువకుడికి అదే స్మశానం కాటికెళ్లే దారిగా మారింది. సొంత చెల్లిని ఆకతాయిలు వేధిస్తుంటే అన్నగా నిలదీసిన పాపానికి.. రక్షకుడిగా మారిన వాడి ప్రాణాలే గాల్లో కలిసిపోయాయి. కాకినాడ జిల్లాలో జరిగిన ఈ అత్యంత అమానుష ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కళ్ల ముందే ఒక నిండు ప్రాణం బలైపోవడం చూసి స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

వివరాల్లోకి వెళితే.. పెదపూడి మండలం ఏపీత్రయం గ్రామానికి చెందిన కాదా రాకేష్ అనే యువకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి మూలపేట వచ్చాడు. తన అమ్మమ్మ వేమగిరి రమణమ్మ వృద్ధాప్య సమస్యలతో కన్నుమూయగా, ఆమె కడసారి చూపు కోసం, అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అక్కడికి చేరుకున్నాడు. ఈ క్రమంలో గ్రామంలోని ఓ దుకాణం వద్దకు రాకేష్ తన చెల్లెలిని తీసుకుని వెళ్లాడు. అక్కడ ఉన్న కొందరు ఆకతాయి యువకులు ఆమె పట్ల అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించారు. కళ్లెదుటే చెల్లికి జరుగుతున్న అవమానాన్ని ఆ అన్న తట్టుకోలేకపోయాడు. వెంటనే వారిని గట్టిగా నిలదీశాడు. బుద్ధిగా ఉండాలంటూ హెచ్చరించాడు.

ఇది కూడా చదవండి: రోజూ 30 KM సైకిల్ తొక్కిన శ్రమకు దక్కిన ఫలితం.. బాక్సింగ్‌లో మెరిపోతున్న మన తెలుగమ్మాయి

ఆకతాయిలను రాకేష్ ఎదిరించడంతో అక్కడ ఇరువర్గాల మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం చోటుచేసుకుంది. గొడవ తీవ్రస్థాయికి చేరుకోవడంతో భయాందోళనకు గురైన రాకేష్ సోదరి వెంటనే 112 నంబర్‌కు డయల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న నిమిషాల వ్యవధిలోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామంలోని పెద్దల సమక్షంలో ఇరువర్గాలకు సర్దిచెప్పి, గొడవను సద్దుమణిగేలా చేశారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి పనులు చేయకూడదంటూ ఆకతాయిలను మందలించారు. అంతా ప్రశాంతంగా ముగిసిందని భావించి ఎవరి దారిన వారు ఇళ్లకు వెళ్లిపోయారు. రాకేష్ కూడా తన అమ్మమ్మ దహన సంస్కారాల పనుల్లో నిమగ్నమయ్యాడు.

ఇది కూడా చదవండి: ఆస్తులు కొనేవారికి బిగ్ షాక్.. 12 రోజుల పాటు రిజిస్ట్రేషన్లు బంద్.. ఎందుకో తెలుసా?

అయితే ఆ ఉన్మాదుల కోపం అక్కడితో చల్లారలేదు. రాకేష్ కుటుంబం తమ అమ్మమ్మ భౌతికకాయాన్ని తీసుకుని స్మశాన వాటికకు చేరుకుంది. అంత్యక్రియల ప్రక్రియ అత్యంత విషాద వాతావరణంలో జరుగుతుండగా.. అప్పటికే పగతో రగిలిపోతున్న ఆ ఆకతాయిలు అక్కడికి చేరుకున్నారు. పథకం ప్రకారం మరోసారి రాకేష్‌తో కయ్యానికి కాలుదువ్వారు. మాటల దాడి కాస్తా శృతిమించి తీవ్రస్థాయి కొట్లాటకు దారితీసింది. అందరూ చూస్తుండగానే ఈ ఘర్షణలో విచక్షణ కోల్పోయిన దుండగులు రాకేష్‌పై కత్తులతో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. అత్యంత కిరాతకంగా పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు.

రక్తపు మడుగులో కుప్పకూలిన రాకేష్‌ను చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తీవ్ర గాయాలపాలైన అతడిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో మార్గమధ్యంలోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఉదయం అమ్మమ్మను కోల్పోయిన కుటుంబం.. సాయంత్రానికి ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న కొడుకును కూడా కోల్పోవడంతో ఆ ఇంట రోదనలు మిన్నంటాయి. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కళ్లెదుటే హత్య చేసి పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 July 2026, 12:40 pm Digital Edition : Prabhanews
కళ్లెదుటే చెల్లికి అవమానం.. రక్తం మరిగిన అన్న! ఆ తర్వాత జరిగిన దారుణం మీ ఊహకు కూడా అందదు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 16, 2026 12:38 PM ISTచెల్లిని ఏడిపిస్తున్నారని అడిగిన పాపానికి.. ఆ ఉన్మాదులు ఎంతటి ఘాతుకానికి పాల్పడ్డారో చూస్తే వణికిపోతారు!కళ్లెదుటే చెల్లికి అవమానం.. రక్తం మరిగిన అన్న! ఆ తర్వాత జరిగిన దారుణం మీ ఊహకు కూడా అందదు!బాధలో ఉన్న ఆ కుటుంబానికి మరో కోలుకోలేని విషాదం ఎదురైంది. అమ్మమ్మను కడసారి చూసుకుని, కన్నీటి వీడ్కోలు పలుకుదామనుకున్న ఆ యువకుడికి అదే స్మశానం కాటికెళ్లే దారిగా మారింది. సొంత చెల్లిని ఆకతాయిలు వేధిస్తుంటే అన్నగా నిలదీసిన పాపానికి.. రక్షకుడిగా మారిన వాడి ప్రాణాలే గాల్లో కలిసిపోయాయి. కాకినాడ జిల్లాలో జరిగిన ఈ అత్యంత అమానుష ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కళ్ల ముందే ఒక నిండు ప్రాణం బలైపోవడం చూసి స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.వివరాల్లోకి వెళితే.. పెదపూడి మండలం ఏపీత్రయం గ్రామానికి చెందిన కాదా రాకేష్ అనే యువకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి మూలపేట వచ్చాడు. తన అమ్మమ్మ వేమగిరి రమణమ్మ వృద్ధాప్య సమస్యలతో కన్నుమూయగా, ఆమె కడసారి చూపు కోసం, అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అక్కడికి చేరుకున్నాడు. ఈ క్రమంలో గ్రామంలోని ఓ దుకాణం వద్దకు రాకేష్ తన చెల్లెలిని తీసుకుని వెళ్లాడు. అక్కడ ఉన్న కొందరు ఆకతాయి యువకులు ఆమె పట్ల అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించారు. కళ్లెదుటే చెల్లికి జరుగుతున్న అవమానాన్ని ఆ అన్న తట్టుకోలేకపోయాడు. వెంటనే వారిని గట్టిగా నిలదీశాడు. బుద్ధిగా ఉండాలంటూ హెచ్చరించాడు.ఇది కూడా చదవండి: రోజూ 30 KM సైకిల్ తొక్కిన శ్రమకు దక్కిన ఫలితం.. బాక్సింగ్‌లో మెరిపోతున్న మన తెలుగమ్మాయిఆకతాయిలను రాకేష్ ఎదిరించడంతో అక్కడ ఇరువర్గాల మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం చోటుచేసుకుంది. గొడవ తీవ్రస్థాయికి చేరుకోవడంతో భయాందోళనకు గురైన రాకేష్ సోదరి వెంటనే 112 నంబర్‌కు డయల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న నిమిషాల వ్యవధిలోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామంలోని పెద్దల సమక్షంలో ఇరువర్గాలకు సర్దిచెప్పి, గొడవను సద్దుమణిగేలా చేశారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి పనులు చేయకూడదంటూ ఆకతాయిలను మందలించారు. అంతా ప్రశాంతంగా ముగిసిందని భావించి ఎవరి దారిన వారు ఇళ్లకు వెళ్లిపోయారు. రాకేష్ కూడా తన అమ్మమ్మ దహన సంస్కారాల పనుల్లో నిమగ్నమయ్యాడు.ఇది కూడా చదవండి: ఆస్తులు కొనేవారికి బిగ్ షాక్.. 12 రోజుల పాటు రిజిస్ట్రేషన్లు బంద్.. ఎందుకో తెలుసా?అయితే ఆ ఉన్మాదుల కోపం అక్కడితో చల్లారలేదు. రాకేష్ కుటుంబం తమ అమ్మమ్మ భౌతికకాయాన్ని తీసుకుని స్మశాన వాటికకు చేరుకుంది. అంత్యక్రియల ప్రక్రియ అత్యంత విషాద వాతావరణంలో జరుగుతుండగా.. అప్పటికే పగతో రగిలిపోతున్న ఆ ఆకతాయిలు అక్కడికి చేరుకున్నారు. పథకం ప్రకారం మరోసారి రాకేష్‌తో కయ్యానికి కాలుదువ్వారు. మాటల దాడి కాస్తా శృతిమించి తీవ్రస్థాయి కొట్లాటకు దారితీసింది. అందరూ చూస్తుండగానే ఈ ఘర్షణలో విచక్షణ కోల్పోయిన దుండగులు రాకేష్‌పై కత్తులతో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. అత్యంత కిరాతకంగా పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు.రక్తపు మడుగులో కుప్పకూలిన రాకేష్‌ను చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తీవ్ర గాయాలపాలైన అతడిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో మార్గమధ్యంలోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఉదయం అమ్మమ్మను కోల్పోయిన కుటుంబం.. సాయంత్రానికి ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న కొడుకును కూడా కోల్పోవడంతో ఆ ఇంట రోదనలు మిన్నంటాయి. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కళ్లెదుటే హత్య చేసి పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.Location :Kakinada,East Godavari,Andhra PradeshFirst Published :Jul 16, 2026 12:38 PM ISTమరింత చదవండి

Source link