ప్రభన్యూస్

Emraan Hashmi: పెను ప్రమాదం నుంచి బయటపడ్డ ఇమ్రాన్ హష్మీ.. ఏం జరిగిందంటే..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

సినిమా షూటింగ్స్ లో కొన్ని ఊహించని ఘటనలు జరుగుతుంటాయి. తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇమ్రాన్ హష్మీకి ఓ భారీ ప్రమాదం తృటిలో తప్పింది.

News18
News18

బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీకి ఓ భారీ ప్రమాదం తృటిలో తప్పింది. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘గన్‌మాస్టర్ G9’ (Gunmaster G9) షూటింగ్ లో ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ఊహించని ఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఇమ్రాన్ తో సహా చిత్ర యూనిట్ సభ్యులెవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే.. ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాలను చిత్రబృందం అత్యంత భారీ స్థాయిలో చిత్రీకరిస్తోంది. ఇందులో భాగంగా ఒక ఎస్‌యూవీ (SUV) కారును భారీ క్రేన్ సహాయంతో గాల్లోకి ఎత్తి, పల్టీలు కొట్టించే ఒక స్టంట్ సీన్ ప్లాన్ చేశారు. యాక్షన్ డైరెక్టర్ కౌంట్‌డౌన్‌ ఇవ్వగానే స్టంట్ ప్రారంభమైంది. అయితే, గాల్లో పల్టీలు కొడుతున్న కారు ఊహించని విధంగా అదుపు తప్పి కిందనే ఉన్న ఒక వ్యాన్‌పై అత్యంత బలంగా పడింది. ఆ కారు పడిన వ్యాన్‌కు అతి సమీపంలోనే హీరో ఇమ్రాన్ హష్మీ నిలబడి ఉన్నట్లు సమాచారం. క్షణాల వ్యవధిలో జరిగిన ఈ ఘటనతో సెట్స్ లో ఉన్న చిత్రబృందం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది భద్రతా చర్యలు చేపట్టారు.

యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ ‘గన్‌మాస్టర్ G9’ చిత్రానికి ఆదిత్య దత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఇమ్రాన్ హష్మీ సరసన ప్రముఖ నటి జెనీలియా దేశ్‌ముఖ్ హీరోయిన్ గా నటిస్తోంది. గత కొంతకాలంగా తన రొమాంటిక్ ఇమేజ్ నుంచి బయటపడి వరుసగా యాక్షన్, థ్రిల్లర్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు ఇమ్రాన్ హష్మీ. ఇటీవల సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’, పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ (OG), అడివి శేష్ ‘గూఢచారి 2’ లాంటి భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులలో కీలక పాత్రలు పోషిస్తూ దేశవ్యాప్తంగా బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తన సోలో హీరో ప్రాజెక్ట్ అయిన ‘గన్‌మాస్టర్ G9’ కోసం ఆయన ప్రాణాలకు తెగించి రిస్కీ షాట్స్ చేస్తున్నారు.

సినిమా షూటింగుల్లో, ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించినప్పటికీ కొన్నిసార్లు యాంత్రిక లోపాల వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ తాజా ఘటనపై చిత్ర నిర్మాణ సంస్థ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. భారీ బడ్జెట్ తో, హై-వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో రూపొందుతున్న ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ ను నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 14 October 2026, 3:11 pm Digital Edition : Prabhanews
Emraan Hashmi: పెను ప్రమాదం నుంచి బయటపడ్డ ఇమ్రాన్ హష్మీ.. ఏం జరిగిందంటే..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 14, 2026 3:08 PM ISTసినిమా షూటింగ్స్ లో కొన్ని ఊహించని ఘటనలు జరుగుతుంటాయి. తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇమ్రాన్ హష్మీకి ఓ భారీ ప్రమాదం తృటిలో తప్పింది. News18బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీకి ఓ భారీ ప్రమాదం తృటిలో తప్పింది. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న 'గన్‌మాస్టర్ G9' (Gunmaster G9) షూటింగ్ లో ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ఊహించని ఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఇమ్రాన్ తో సహా చిత్ర యూనిట్ సభ్యులెవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.వివరాల్లోకి వెళితే.. ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాలను చిత్రబృందం అత్యంత భారీ స్థాయిలో చిత్రీకరిస్తోంది. ఇందులో భాగంగా ఒక ఎస్‌యూవీ (SUV) కారును భారీ క్రేన్ సహాయంతో గాల్లోకి ఎత్తి, పల్టీలు కొట్టించే ఒక స్టంట్ సీన్ ప్లాన్ చేశారు. యాక్షన్ డైరెక్టర్ కౌంట్‌డౌన్‌ ఇవ్వగానే స్టంట్ ప్రారంభమైంది. అయితే, గాల్లో పల్టీలు కొడుతున్న కారు ఊహించని విధంగా అదుపు తప్పి కిందనే ఉన్న ఒక వ్యాన్‌పై అత్యంత బలంగా పడింది. ఆ కారు పడిన వ్యాన్‌కు అతి సమీపంలోనే హీరో ఇమ్రాన్ హష్మీ నిలబడి ఉన్నట్లు సమాచారం. క్షణాల వ్యవధిలో జరిగిన ఈ ఘటనతో సెట్స్ లో ఉన్న చిత్రబృందం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది భద్రతా చర్యలు చేపట్టారు.యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ 'గన్‌మాస్టర్ G9' చిత్రానికి ఆదిత్య దత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఇమ్రాన్ హష్మీ సరసన ప్రముఖ నటి జెనీలియా దేశ్‌ముఖ్ హీరోయిన్ గా నటిస్తోంది. గత కొంతకాలంగా తన రొమాంటిక్ ఇమేజ్ నుంచి బయటపడి వరుసగా యాక్షన్, థ్రిల్లర్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు ఇమ్రాన్ హష్మీ. ఇటీవల సల్మాన్ ఖాన్ 'టైగర్ 3', పవన్ కళ్యాణ్ 'ఓజీ' (OG), అడివి శేష్ 'గూఢచారి 2' లాంటి భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులలో కీలక పాత్రలు పోషిస్తూ దేశవ్యాప్తంగా బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తన సోలో హీరో ప్రాజెక్ట్ అయిన 'గన్‌మాస్టర్ G9' కోసం ఆయన ప్రాణాలకు తెగించి రిస్కీ షాట్స్ చేస్తున్నారు.సినిమా షూటింగుల్లో, ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించినప్పటికీ కొన్నిసార్లు యాంత్రిక లోపాల వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ తాజా ఘటనపై చిత్ర నిర్మాణ సంస్థ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. భారీ బడ్జెట్ తో, హై-వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో రూపొందుతున్న ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ ను నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.మరింత చదవండి

Source link