అక్కినేని కోడలు, పాన్ ఇండియా నటి శోభితా దూళిపాళ్ల తన వ్యక్తిగత జీవితం, మాతృత్వం, కెరీర్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ స్టార్ హీరో నాగచైతన్యతో వివాహం జరిగిన తర్వాత, ఆమె ఫ్యామిలీ ప్లానింగ్ పై తొలిసారిగా పెదవి విప్పారు. తనకంటూ ఒక అందమైన కుటుంబాన్ని నిర్మించుకోవాలనే కోరిక ఎప్పటినుంచో ఉందని, అయితే ఆ విషయమై తాను ఎలాంటి ఒత్తిడికి గురికానంటూ స్పష్టం చేశారు.

