ప్రభన్యూస్

Heart Failure: గుండె వైఫల్యంతో జీవిస్తున్నారా?.. మీ కార్డియాలజిస్ట్‌ను అడగవలసిన మూడు ముఖ్యమైన ప్రశ్నలివే! | లైఫ్ స్టైల్


ఆయన తెలిపిన ప్రకారం మీ కార్డియాలజిస్ట్‌తో క్రమం తప్పకుండా మాట్లాడటం చాలా ముఖ్యం. మీ వైద్యుడిని కలుసుకున్నప్పుడు “నేను బాగున్నానా?” అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవటంతో పాటుగా, మీ పరిస్థితిలో ఏమైనా మార్పు వచ్చిందా, మీరు ఏ సంకేతాలను గమనించాలి, భవిష్యత్తులో మీకు ఎలాంటి ప్రమాదం ఎదురు కావచ్చు, మీరు తీసుకుంటున్న చికిత్స మీ అవసరాలను తీరుస్తోందా లేదా అనే విషయాలను అర్థం చేసుకోవడానికి కూడా ఒక అవకాశంగా ఉండాలి. ఇందులో భాగంగా మీ కార్డియాలజిస్ట్‌ను అడగవలసిన మూడు ముఖ్యమైన ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి.

1.నేను చివరిసారి హాస్పిటల్ కు వచ్చినప్పటితో పోలిస్తే నా అనారోగ్య పరిస్థితికి సంబంధించి ఫలితంలో ఏమైనా మార్పు వచ్చిందా?

ముందుగా మీ దైనందిన జీవితంలో ఏమేమి మారాయో చెప్పడం ద్వారా ప్రారంభించండి. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, చీలమండల వద్ద వాపు, వ్యాయామం చేసే సామర్థ్యం తగ్గడం, అలసట, వ్యాయామం చేసిన తర్వాత సాధారణ స్థితికి రావడానికి ఎక్కువ సమయం పట్టడం, శరీరంలో ద్రవం పేరుకుపోవడం వల్ల బరువు పెరగడం వంటివి హార్ట్‌ ఫెయిల్యూర్‌తో సంబంధం ఉన్న లక్షణాలలో కొన్ని. ఈ లక్షణాలలో వచ్చే మార్పులు, మీ గత సంప్రదింపుల నుండి మీరు ఎలా ఉన్నారనే దాని గురించి మీ వైద్యుడికి ఉపయోగకరమైన సమాచారాన్ని అందిస్తాయి.

గుండె వైఫల్యం ఎల్లప్పుడూ ఒకే విధంగా కొనసాగదు. కొంతకాలం పరిస్థితి స్థిరంగా ఉండొచ్చు. మరికొన్ని సందర్భాల్లో లక్షణాలు అకస్మాత్తుగా తీవ్రమవుతాయి. ఈ మార్పులను వైద్యుడికి తెలియజేయడం ద్వారా మీ పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందా లేదా మరిన్ని పరీక్షలు అవసరమా అన్నది కార్డియాలజిస్ట్‌ అంచనా వేయగలరు.

2. ఎలాంటి మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి?

మీరు ముందుగా నిర్ణయించిన అపాయింట్‌మెంట్ కోసం ఎప్పుడు వేచి ఉండకూడదో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం.5

హార్ట్‌ ఫెయిల్యూర్‌ పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున… ఏ మార్పులను జాగ్రత్తగా గమనించాలో రోగులు తెలుసుకోవాలి. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, చీలమండల వద్ద వాపు, వ్యాయామం చేసే సామర్థ్యం తగ్గడం, కళ్లు తిరగడం లేదా తేలికగా అనిపించడం, శరీరంలో ద్రవం పేరుకుపోవడం వల్ల బరువు పెరగడం వంటి లక్షణాలు హార్ట్‌ ఫెయిల్యూర్‌తో సంబంధం కలిగి ఉంటాయి.

ఇలాంటి ఏ మార్పులు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలో మీ కార్డియాలజిస్ట్‌ను అడగండి. ముందుగానే తెలుసుకోవడం వల్ల లక్షణాలు తీవ్రంగా మారే వరకు వేచి ఉండకుండా, పరిస్థితి మరింత దిగజారుతున్నప్పుడు తగిన చర్య తీసుకోవచ్చు. కన్సల్టేషన్ల మధ్యకాలంలో ఏ అంశాలను గమనించాలో మీకు, మీ కుటుంబ సభ్యులకు లేదా సంరక్షకులకు కూడా స్పష్టత వస్తుంది.

3. నేను మళ్ళీ ఆసుపత్రిలో చేరే అవకాశం ఎంత ఉంది?

మీరు ఇప్పటికే గుండె వైఫల్యం బారిన పడినా లేదా ఆసుపత్రిలో చేరినా, ఈ సంభాషణ చాలా ముఖ్యమైనది.

ఇటీవల గుండె వైఫల్యం బారిన పడిన వారికి, వారి పరిస్థితి మళ్ళీ దిగజారే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.4 నిరంతర శ్రద్ధ ఎందుకు ముఖ్యమో గణాంకాలు వివరిస్తున్నాయి: గుండె వైఫల్యంతో ఆసుపత్రిలో చేరిన రోగులలో దాదాపు 30% మంది, డిశ్చార్జ్ అయిన ఒక సంవత్సరంలోపే మళ్ళీ గుండె వైఫల్యం కారణంగా ఆసుపత్రిలో చేరారు. గుండె వైఫల్యం తీవ్రతరం కాని రోగులతో పోలిస్తే, గుండె వైఫల్యం కారణంగా ఆసుపత్రిలో చేరిన తర్వాత మరణించే ప్రమాదం దాదాపు ఆరు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు కూడా నివేదికలు చెబుతున్నాయి.

అందువల్ల, ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కావడాన్ని గుండె వైఫల్య చికిత్స ముగిసినట్లుగా భావించకూడదు. లక్షణాలు మెరుగుపడినప్పటికీ, అంతర్లీనంగా ఉన్న దీర్ఘకాలిక గుండె వైఫల్యం కొనసాగుతూనే ఉంటుంది , పరిస్థితి మరింత క్షీణించే ప్రమాదం కూడా కొనసాగవచ్చు. మీ ఇటీవలి ఆరోగ్య చరిత్ర మీకు ఏమి సూచిస్తుందో, పరిస్థితి మళ్లీ తీవ్రమయ్యే అవకాశాన్ని తగ్గించడానికి ఏమి చేయవచ్చో మీ కార్డియాలజిస్ట్‌ను అడగండి.

ప్రతి వైద్య సంప్రదింపునూ సద్వినియోగం చేసుకోండి

ప్రతి వైద్య సంప్రదింపూ మీ ఆరోగ్య పరిస్థితిలో వస్తున్న మార్పులను, వాటి ప్రభావాన్ని అర్థం చేసుకునేందుకు లభించే అవకాశంగానే చూడాల్సి ఉంటుంది. లక్షణాల్లో వచ్చిన మార్పులు, ఎప్పుడు వైద్య సహాయం తీసుకోవాలి, భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదం, ప్రస్తుతం తీసుకుంటున్న చికిత్స సరైనదేనా వంటి అంశాలపై ప్రశ్నించడం ద్వారా… దీర్ఘకాలంలో హార్ట్‌ ఫెయిల్యూర్‌ను నియంత్రించేందుకు మీకు, మీ కార్డియాలజిస్ట్‌కు తగిన నిర్ణయాలు తీసుకోవడం సులభమవుతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 30 September 2026, 2:47 pm Digital Edition : Prabhanews
Heart Failure: గుండె వైఫల్యంతో జీవిస్తున్నారా?.. మీ కార్డియాలజిస్ట్‌ను అడగవలసిన మూడు ముఖ్యమైన ప్రశ్నలివే! | లైఫ్ స్టైల్

ఆయన తెలిపిన ప్రకారం మీ కార్డియాలజిస్ట్‌తో క్రమం తప్పకుండా మాట్లాడటం చాలా ముఖ్యం. మీ వైద్యుడిని కలుసుకున్నప్పుడు "నేను బాగున్నానా?" అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవటంతో పాటుగా, మీ పరిస్థితిలో ఏమైనా మార్పు వచ్చిందా, మీరు ఏ సంకేతాలను గమనించాలి, భవిష్యత్తులో మీకు ఎలాంటి ప్రమాదం ఎదురు కావచ్చు, మీరు తీసుకుంటున్న చికిత్స మీ అవసరాలను తీరుస్తోందా లేదా అనే విషయాలను అర్థం చేసుకోవడానికి కూడా ఒక అవకాశంగా ఉండాలి. ఇందులో భాగంగా మీ కార్డియాలజిస్ట్‌ను అడగవలసిన మూడు ముఖ్యమైన ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి.1.నేను చివరిసారి హాస్పిటల్ కు వచ్చినప్పటితో పోలిస్తే నా అనారోగ్య పరిస్థితికి సంబంధించి ఫలితంలో ఏమైనా మార్పు వచ్చిందా?ముందుగా మీ దైనందిన జీవితంలో ఏమేమి మారాయో చెప్పడం ద్వారా ప్రారంభించండి. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, చీలమండల వద్ద వాపు, వ్యాయామం చేసే సామర్థ్యం తగ్గడం, అలసట, వ్యాయామం చేసిన తర్వాత సాధారణ స్థితికి రావడానికి ఎక్కువ సమయం పట్టడం, శరీరంలో ద్రవం పేరుకుపోవడం వల్ల బరువు పెరగడం వంటివి హార్ట్‌ ఫెయిల్యూర్‌తో సంబంధం ఉన్న లక్షణాలలో కొన్ని. ఈ లక్షణాలలో వచ్చే మార్పులు, మీ గత సంప్రదింపుల నుండి మీరు ఎలా ఉన్నారనే దాని గురించి మీ వైద్యుడికి ఉపయోగకరమైన సమాచారాన్ని అందిస్తాయి.గుండె వైఫల్యం ఎల్లప్పుడూ ఒకే విధంగా కొనసాగదు. కొంతకాలం పరిస్థితి స్థిరంగా ఉండొచ్చు. మరికొన్ని సందర్భాల్లో లక్షణాలు అకస్మాత్తుగా తీవ్రమవుతాయి. ఈ మార్పులను వైద్యుడికి తెలియజేయడం ద్వారా మీ పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందా లేదా మరిన్ని పరీక్షలు అవసరమా అన్నది కార్డియాలజిస్ట్‌ అంచనా వేయగలరు.2. ఎలాంటి మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి?మీరు ముందుగా నిర్ణయించిన అపాయింట్‌మెంట్ కోసం ఎప్పుడు వేచి ఉండకూడదో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం.5హార్ట్‌ ఫెయిల్యూర్‌ పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున... ఏ మార్పులను జాగ్రత్తగా గమనించాలో రోగులు తెలుసుకోవాలి. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, చీలమండల వద్ద వాపు, వ్యాయామం చేసే సామర్థ్యం తగ్గడం, కళ్లు తిరగడం లేదా తేలికగా అనిపించడం, శరీరంలో ద్రవం పేరుకుపోవడం వల్ల బరువు పెరగడం వంటి లక్షణాలు హార్ట్‌ ఫెయిల్యూర్‌తో సంబంధం కలిగి ఉంటాయి.ఇలాంటి ఏ మార్పులు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలో మీ కార్డియాలజిస్ట్‌ను అడగండి. ముందుగానే తెలుసుకోవడం వల్ల లక్షణాలు తీవ్రంగా మారే వరకు వేచి ఉండకుండా, పరిస్థితి మరింత దిగజారుతున్నప్పుడు తగిన చర్య తీసుకోవచ్చు. కన్సల్టేషన్ల మధ్యకాలంలో ఏ అంశాలను గమనించాలో మీకు, మీ కుటుంబ సభ్యులకు లేదా సంరక్షకులకు కూడా స్పష్టత వస్తుంది.3. నేను మళ్ళీ ఆసుపత్రిలో చేరే అవకాశం ఎంత ఉంది?మీరు ఇప్పటికే గుండె వైఫల్యం బారిన పడినా లేదా ఆసుపత్రిలో చేరినా, ఈ సంభాషణ చాలా ముఖ్యమైనది.ఇటీవల గుండె వైఫల్యం బారిన పడిన వారికి, వారి పరిస్థితి మళ్ళీ దిగజారే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.4 నిరంతర శ్రద్ధ ఎందుకు ముఖ్యమో గణాంకాలు వివరిస్తున్నాయి: గుండె వైఫల్యంతో ఆసుపత్రిలో చేరిన రోగులలో దాదాపు 30% మంది, డిశ్చార్జ్ అయిన ఒక సంవత్సరంలోపే మళ్ళీ గుండె వైఫల్యం కారణంగా ఆసుపత్రిలో చేరారు. గుండె వైఫల్యం తీవ్రతరం కాని రోగులతో పోలిస్తే, గుండె వైఫల్యం కారణంగా ఆసుపత్రిలో చేరిన తర్వాత మరణించే ప్రమాదం దాదాపు ఆరు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు కూడా నివేదికలు చెబుతున్నాయి.అందువల్ల, ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కావడాన్ని గుండె వైఫల్య చికిత్స ముగిసినట్లుగా భావించకూడదు. లక్షణాలు మెరుగుపడినప్పటికీ, అంతర్లీనంగా ఉన్న దీర్ఘకాలిక గుండె వైఫల్యం కొనసాగుతూనే ఉంటుంది , పరిస్థితి మరింత క్షీణించే ప్రమాదం కూడా కొనసాగవచ్చు. మీ ఇటీవలి ఆరోగ్య చరిత్ర మీకు ఏమి సూచిస్తుందో, పరిస్థితి మళ్లీ తీవ్రమయ్యే అవకాశాన్ని తగ్గించడానికి ఏమి చేయవచ్చో మీ కార్డియాలజిస్ట్‌ను అడగండి.ప్రతి వైద్య సంప్రదింపునూ సద్వినియోగం చేసుకోండిప్రతి వైద్య సంప్రదింపూ మీ ఆరోగ్య పరిస్థితిలో వస్తున్న మార్పులను, వాటి ప్రభావాన్ని అర్థం చేసుకునేందుకు లభించే అవకాశంగానే చూడాల్సి ఉంటుంది. లక్షణాల్లో వచ్చిన మార్పులు, ఎప్పుడు వైద్య సహాయం తీసుకోవాలి, భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదం, ప్రస్తుతం తీసుకుంటున్న చికిత్స సరైనదేనా వంటి అంశాలపై ప్రశ్నించడం ద్వారా... దీర్ఘకాలంలో హార్ట్‌ ఫెయిల్యూర్‌ను నియంత్రించేందుకు మీకు, మీ కార్డియాలజిస్ట్‌కు తగిన నిర్ణయాలు తీసుకోవడం సులభమవుతుంది.

Source link