ప్రభన్యూస్

Jailer 2 Movie: జైలర్ సినిమాలో ఏకంగా 12 పాటలు.. ఇదెక్కడి మాస్‌రా మామ! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

సూపర్‌స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘జైలర్ 2’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘జైలర్’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో.. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వస్తున్న ‘జైలర్ 2’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

News18
News18

సూపర్‌స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘జైలర్ 2’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘జైలర్’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో.. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వస్తున్న ‘జైలర్ 2’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా రజినీకాంత్ మరోసారి మాస్ యాక్షన్ అవతార్‌లో కనిపించనుండటంతో సినిమాపై క్యూరియాసిటీ మరింత పెరిగింది.

‘జైలర్ 2’కు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ‘జైలర్’ సినిమాకు అనిరుధ్ అందించిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో సీక్వెల్‌కు ఆయన అందిస్తున్న సంగీతంపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం మ్యూజిక్‌కు సంబంధించిన కీలక అప్‌డేట్‌ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.

‘జైలర్ 2’కు సంబంధించిన ఏకంగా 12 పాటలతో కూడిన గ్రాండ్ ట్రాక్‌లిస్ట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో అనిరుధ్ మ్యూజిక్ నుంచి ఎలాంటి పాటలు రాబోతున్నాయనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. అంతేకాదు.. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి ఆల్బమ్ సెప్టెంబర్ 30 నుంచి స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. అంటే ఒకేసారి 12 ట్రాక్‌లను వినే అవకాశం అభిమానులకు లభించనుంది.

గతంలో ‘జైలర్’లోని పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రజినీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు అనిరుధ్ సంగీతం మరింత ఎనర్జీని తీసుకొచ్చింది. ఇప్పుడు ‘జైలర్ 2’ కోసం కూడా అదే స్థాయిలో పవర్‌ఫుల్ మ్యూజిక్‌ను అనిరుధ్ సిద్ధం చేసినట్లు అభిమానులు ఆశిస్తున్నారు. 12 పాటలతో పూర్తి ఆల్బమ్‌ను ప్రకటించడంతో సినిమాకు సంబంధించిన మ్యూజిక్ ప్రమోషన్స్‌పై కూడా ఆసక్తి పెరిగింది.

ఇక ఈ సినిమాలో రజినీకాంత్‌తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్‌జే సూర్య, విద్యారమ్య కృష్ణన్, యోగిబాబు తదితరులు ఈ చిత్రంలో భాగమయ్యారు. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ మరోసారి తనదైన స్టైల్‌లో యాక్షన్, కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్‌ను కలిపి రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ‘జైలర్ 2’ విడుదల తేదీ కూడా ఇప్పటికే ఖరారైంది. దసరా పండుగను టార్గెట్ చేస్తూ అక్టోబర్ 15, 2026న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. రజినీకాంత్‌కు ఉన్న భారీ క్రేజ్‌కు తోడు.. నెల్సన్ దర్శకత్వం, అనిరుధ్ సంగీతం, భారీ తారాగణం కలిసి రావడంతో ఈ సీక్వెల్‌పై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.

ప్రస్తుతం అందరి దృష్టి సెప్టెంబర్ 30పై ఉంది. ఆ రోజున ‘జైలర్ 2’ పూర్తి ఆల్బమ్ స్ట్రీమింగ్‌కు రానుండటంతో అనిరుధ్ ఎలాంటి మ్యూజికల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడనే ఆసక్తి నెలకొంది. ఇక పాటలతో పాటు సినిమా థియేట్రికల్ రిలీజ్ కోసం కూడా రజినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 September 2026, 8:22 pm Digital Edition : Prabhanews
Jailer 2 Movie: జైలర్ సినిమాలో ఏకంగా 12 పాటలు.. ఇదెక్కడి మాస్‌రా మామ! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 29, 2026 8:11 PM ISTసూపర్‌స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘జైలర్ 2’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘జైలర్’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో.. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వస్తున్న ‘జైలర్ 2’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.News18సూపర్‌స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘జైలర్ 2’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘జైలర్’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో.. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వస్తున్న ‘జైలర్ 2’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా రజినీకాంత్ మరోసారి మాస్ యాక్షన్ అవతార్‌లో కనిపించనుండటంతో సినిమాపై క్యూరియాసిటీ మరింత పెరిగింది.‘జైలర్ 2’కు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ‘జైలర్’ సినిమాకు అనిరుధ్ అందించిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో సీక్వెల్‌కు ఆయన అందిస్తున్న సంగీతంపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం మ్యూజిక్‌కు సంబంధించిన కీలక అప్‌డేట్‌ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.‘జైలర్ 2’కు సంబంధించిన ఏకంగా 12 పాటలతో కూడిన గ్రాండ్ ట్రాక్‌లిస్ట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో అనిరుధ్ మ్యూజిక్ నుంచి ఎలాంటి పాటలు రాబోతున్నాయనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. అంతేకాదు.. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి ఆల్బమ్ సెప్టెంబర్ 30 నుంచి స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. అంటే ఒకేసారి 12 ట్రాక్‌లను వినే అవకాశం అభిమానులకు లభించనుంది.గతంలో ‘జైలర్’లోని పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రజినీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు అనిరుధ్ సంగీతం మరింత ఎనర్జీని తీసుకొచ్చింది. ఇప్పుడు ‘జైలర్ 2’ కోసం కూడా అదే స్థాయిలో పవర్‌ఫుల్ మ్యూజిక్‌ను అనిరుధ్ సిద్ధం చేసినట్లు అభిమానులు ఆశిస్తున్నారు. 12 పాటలతో పూర్తి ఆల్బమ్‌ను ప్రకటించడంతో సినిమాకు సంబంధించిన మ్యూజిక్ ప్రమోషన్స్‌పై కూడా ఆసక్తి పెరిగింది.ఇక ఈ సినిమాలో రజినీకాంత్‌తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్‌జే సూర్య, విద్యారమ్య కృష్ణన్, యోగిబాబు తదితరులు ఈ చిత్రంలో భాగమయ్యారు. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ మరోసారి తనదైన స్టైల్‌లో యాక్షన్, కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్‌ను కలిపి రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.మరోవైపు ‘జైలర్ 2’ విడుదల తేదీ కూడా ఇప్పటికే ఖరారైంది. దసరా పండుగను టార్గెట్ చేస్తూ అక్టోబర్ 15, 2026న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. రజినీకాంత్‌కు ఉన్న భారీ క్రేజ్‌కు తోడు.. నెల్సన్ దర్శకత్వం, అనిరుధ్ సంగీతం, భారీ తారాగణం కలిసి రావడంతో ఈ సీక్వెల్‌పై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.ప్రస్తుతం అందరి దృష్టి సెప్టెంబర్ 30పై ఉంది. ఆ రోజున ‘జైలర్ 2’ పూర్తి ఆల్బమ్ స్ట్రీమింగ్‌కు రానుండటంతో అనిరుధ్ ఎలాంటి మ్యూజికల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడనే ఆసక్తి నెలకొంది. ఇక పాటలతో పాటు సినిమా థియేట్రికల్ రిలీజ్ కోసం కూడా రజినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మరింత చదవండి

Source link