లోన్ అంగీకరించే ముందు అప్లికేషన్ సమయంలో చూపించే అన్ని వివరాలను కస్టమర్లు జాగ్రత్తగా పరిశీలించాలి. ముఖ్యంగా వర్తించే వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు, తీసుకోబోయే లోన్ మొత్తం, రీపేమెంట్ కాలం, ఈఎంఐ, మొత్తం తిరిగి చెల్లించాల్సిన మొత్తం, ఇతర ఛార్జీలు, షరతులను చెక్ చేయాలి. పీఏపీఎల్పై వడ్డీ రేటు ఏడాదికి 10.00 శాతం నుంచి ప్రారంభమవుతుందని ఎస్బీఐ చెబుతోంది. అయితే ప్రతి ఒక్కరికీ 10 శాతం వడ్డీనే వర్తిస్తుందని అనుకోకూడదు. తమకు ప్రత్యేకంగా ఎంత వడ్డీ రేటు ఆఫర్ చేస్తున్నారో కస్టమర్లు చెక్ చేసుకోవాలి. వెంటనే డిజిటల్‌గా లోన్ ప్రాసెస్ కావడం సౌకర్యంగా ఉన్నప్పటికీ, లోన్ మొత్తం ఖర్చు, ఈఎంఐలు, మొత్తం రీపేమెంట్ బాధ్యతలను కూడా పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యం. (ప్రతీకాత్మక చిత్రం)

