ప్రభన్యూస్

Ukraine-Russia War: రష్యా రాజధానిపై ఉక్రెయిన్ డ్రోన్ల వర్షం! ఇద్దరు మృతి.. చమురు శుద్ధి కేంద్రం ధ్వంసం |


Last Updated:

రష్యా రాజధాని మాస్కోపై ఉక్రెయిన్ కనీవినీ ఎరుగని రీతిలో డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ భీకర దాడుల్లో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోగా, ఓ ప్రధాన ఆయిల్ రిఫైనరీ దెబ్బతింది. ఎన్నికలను భగ్నం చేయడానికే దాడులని రష్యా మండిపడుతోంది.

News18
News18

రష్యాలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న కీలక సమయంలో ఉక్రెయిన్ సంచలన దాడికి తెగబడింది. ఆదివారం తెల్లవారుజామున రాజధాని మాస్కో, దాని పరిసర ప్రాంతాలే లక్ష్యంగా వందలాది డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ భీకర దాడుల్లో కనీసం ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఒక డ్రోన్ నేరుగా 21 అంతస్తుల నివాస భవనాన్ని ఢీకొట్టడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అప్రమత్తమైన అధికారులు వెంటనే అక్కడి నుంచి దాదాపు 400 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మాస్కో వైపు దూసుకొచ్చిన సుమారు 450 డ్రోన్లతో సహా మొత్తం 1,600 డ్రోన్లను తమ భద్రతా బలగాలు గాల్లోనే అడ్డుకున్నాయని మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ వెల్లడించారు.

దేశంలో ఎన్నికల ప్రక్రియను అడ్డుకునే కుట్రతోనే ఉక్రెయిన్ ఈ దాడులకు పాల్పడిందని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అధ్యక్షుడు పుతిన్ పట్టును బలహీనం చేసేందుకే ఇలాంటి కుతంత్రాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ దాడుల దృశ్యాలు ప్రస్తుతం ఎక్స్ వేదికగా వైరల్‌గా మారాయి.

ఆయిల్ రిఫైనరీపై గురి ఈ డ్రోన్ దాడుల్లో మాస్కోలోని ఓ ప్రధాన చమురు శుద్ధి కేంద్రం తీవ్రంగా దెబ్బతిన్నట్లు న్యూస్18 ఇంగ్లీష్ కథనం పేర్కొంది. రష్యా ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఉక్రెయిన్ ఈ దాడులు చేసినట్లు స్పష్టమవుతోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న అత్యవసర సిబ్బంది మంటలను అదుపు చేశారు. అదృష్టవశాత్తూ రిఫైనరీ వద్ద ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు నిర్ధారించారు. ఆర్థిక మూలాలను దెబ్బతీయాలన్నదే ఉక్రెయిన్ ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది.

జెలెన్‌స్కీ హర్షం మాస్కోపై జరిగిన దాడుల పట్ల ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ హర్షం వ్యక్తం చేశారు. రష్యాకు చెందిన కీలక చమురు, లాజిస్టిక్స్ కేంద్రాలను సమర్థవంతంగా దెబ్బతీశామని ప్రకటించారు. యుద్ధాన్ని కొనసాగించేందుకు ఉపయోగపడే బిలియన్ల కొద్దీ డాలర్ల ఆదాయ మార్గాలపై గట్టి దెబ్బ కొట్టామని ఆయన ట్వీట్ చేశారు.

మరోవైపు ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత ఖేర్సన్ ప్రాంతంలో కూడా ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అక్కడ ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సుపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసింది. ఈ ఘటనలో ఎన్నికల కమిషన్ సభ్యుడితో సహా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 2022లో యుద్ధం మొదలైన తర్వాత రష్యాలో జరుగుతున్న తొలి పార్లమెంట్ ఎన్నికలు కావడంతో ఈ దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 20 September 2026, 9:14 pm Digital Edition : Prabhanews
Ukraine-Russia War: రష్యా రాజధానిపై ఉక్రెయిన్ డ్రోన్ల వర్షం! ఇద్దరు మృతి.. చమురు శుద్ధి కేంద్రం ధ్వంసం |

Last Updated:Sep 20, 2026 9:09 PM ISTరష్యా రాజధాని మాస్కోపై ఉక్రెయిన్ కనీవినీ ఎరుగని రీతిలో డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ భీకర దాడుల్లో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోగా, ఓ ప్రధాన ఆయిల్ రిఫైనరీ దెబ్బతింది. ఎన్నికలను భగ్నం చేయడానికే దాడులని రష్యా మండిపడుతోంది.News18రష్యాలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న కీలక సమయంలో ఉక్రెయిన్ సంచలన దాడికి తెగబడింది. ఆదివారం తెల్లవారుజామున రాజధాని మాస్కో, దాని పరిసర ప్రాంతాలే లక్ష్యంగా వందలాది డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ భీకర దాడుల్లో కనీసం ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఒక డ్రోన్ నేరుగా 21 అంతస్తుల నివాస భవనాన్ని ఢీకొట్టడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అప్రమత్తమైన అధికారులు వెంటనే అక్కడి నుంచి దాదాపు 400 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మాస్కో వైపు దూసుకొచ్చిన సుమారు 450 డ్రోన్లతో సహా మొత్తం 1,600 డ్రోన్లను తమ భద్రతా బలగాలు గాల్లోనే అడ్డుకున్నాయని మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ వెల్లడించారు.దేశంలో ఎన్నికల ప్రక్రియను అడ్డుకునే కుట్రతోనే ఉక్రెయిన్ ఈ దాడులకు పాల్పడిందని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అధ్యక్షుడు పుతిన్ పట్టును బలహీనం చేసేందుకే ఇలాంటి కుతంత్రాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ దాడుల దృశ్యాలు ప్రస్తుతం ఎక్స్ వేదికగా వైరల్‌గా మారాయి.ఆయిల్ రిఫైనరీపై గురి ఈ డ్రోన్ దాడుల్లో మాస్కోలోని ఓ ప్రధాన చమురు శుద్ధి కేంద్రం తీవ్రంగా దెబ్బతిన్నట్లు న్యూస్18 ఇంగ్లీష్ కథనం పేర్కొంది. రష్యా ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఉక్రెయిన్ ఈ దాడులు చేసినట్లు స్పష్టమవుతోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న అత్యవసర సిబ్బంది మంటలను అదుపు చేశారు. అదృష్టవశాత్తూ రిఫైనరీ వద్ద ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు నిర్ధారించారు. ఆర్థిక మూలాలను దెబ్బతీయాలన్నదే ఉక్రెయిన్ ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది.జెలెన్‌స్కీ హర్షం మాస్కోపై జరిగిన దాడుల పట్ల ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ హర్షం వ్యక్తం చేశారు. రష్యాకు చెందిన కీలక చమురు, లాజిస్టిక్స్ కేంద్రాలను సమర్థవంతంగా దెబ్బతీశామని ప్రకటించారు. యుద్ధాన్ని కొనసాగించేందుకు ఉపయోగపడే బిలియన్ల కొద్దీ డాలర్ల ఆదాయ మార్గాలపై గట్టి దెబ్బ కొట్టామని ఆయన ట్వీట్ చేశారు.మరోవైపు ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత ఖేర్సన్ ప్రాంతంలో కూడా ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అక్కడ ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సుపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసింది. ఈ ఘటనలో ఎన్నికల కమిషన్ సభ్యుడితో సహా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 2022లో యుద్ధం మొదలైన తర్వాత రష్యాలో జరుగుతున్న తొలి పార్లమెంట్ ఎన్నికలు కావడంతో ఈ దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి.మరింత చదవండి

Source link