Last Updated:
రష్మిక మందన్న నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘మైసా’ ప్రీ-టీజర్ విడుదలైంది. గిరిజన నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో రష్మిక మునుపెన్నడూ చూడని అత్యంత రఫ్ లుక్‌లో కనిపిస్తూ అభిమానులకు షాక్ ఇచ్చింది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస భారీ ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘మైసా’. ఈ సినిమాకు సంబంధించిన పవర్‌ఫుల్ ప్రీ-టీజర్‌ను మేకర్స్ తాజాగా సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇప్పటివరకు ప్రేక్షకులు చూసిన రష్మిక వేరు, ఇందులో కనిపిస్తున్న రష్మిక వేరు. అడవులు, గిరిజన ప్రాంతాల నేపథ్యంలో అత్యంత రా అండ్ రస్టిక్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఈ చిన్న వీడియో ద్వారా స్పష్టమవుతోంది. ముఖ్యంగా మంటలు, అల్లర్ల మధ్య నీళ్లలోంచి రష్మిక పైకి లేచే షాట్ సినిమాకే హైలైట్‌గా నిలవనుంది.
ఆమె ముఖంలో కనిపిస్తున్న కసి, కోపం ఈ క్యారెక్టర్ డెప్త్‌ను తెలియజేస్తున్నాయి. కమర్షియల్ హంగులకు దూరంగా పూర్తిగా కథ, ఎమోషన్స్ చుట్టూ తిరిగే యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. నవంబర్ 27, 2026న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నారు.
ఈ సినిమా పూర్తి స్థాయి టీజర్‌ను సెప్టెంబర్ 20న (నేడు) విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ ప్రీ-టీజర్‌కు జేక్స్ బిజోయ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రాణం పోసింది. పల్లెటూరి వాతావరణం, మంటలతో నిండిన ఉద్రిక్త పరిస్థితులను తన మ్యూజిక్‌తో మరింత ఎలివేట్ చేశాడు. “అన్ని అడ్డంకులను దాటుకుని ఆమె ఎదుగుతోంది, రష్మికను మీరు ఊహించని విధంగా చూడబోతున్నారు” అంటూ మేకర్స్ పోస్ట్ చేసిన క్యాప్షన్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.
పుష్ప, యానిమల్ లాంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత రష్మిక తన ఇమేజ్‌ను పూర్తిగా మార్చుకునేందుకు ఈ ప్రాజెక్ట్‌ను ఎంచుకుంది. మహిళా ప్రాధాన్యత ఉన్న ఈ కథలో ఆమె పాత్ర ఎంతో కీలకం. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే ఈ గిరిజన పోరాట నేపథ్యం ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

