ప్రభన్యూస్

Viral: ఇదేం కొరుకుడు ఫాంటసీ రా బాబు! భర్త ప్రైవేట్ పార్ట్స్ కొరికిన భార్య.. ఆమెది అది కొరికేసిన భర్త! |


Last Updated:

Viral: కుటుంబ కలహాలు, వివాహేతర సంబంధం చివరకు భార్యాభర్తల మధ్య అత్యంత పైశాచిక దాడికి దారితీశాయి.

News18
News18

ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ భార్య తన భర్త ప్రైవేట్ పార్ట్స్‌ను కొరకగా.. ప్రతిగా భర్త ఆమె ముక్కు కొరికేసిన విచిత్రమైన, ఒళ్లు గగుర్పొడిచే ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయి జిల్లా కేంద్రంలో వెలుగుచూసింది. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. హర్దోయి జిల్లా కేంద్రానికి చెందిన దీపక్, సాధన (27) దంపతులకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలం వీరి సంసారం సాఫీగానే సాగినప్పటికీ, ఆ తర్వాత కుటుంబంలో కలతలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే సాధనకు తన భర్త దీపక్ స్నేహితుడితో పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆ బంధం ముదరడంతో సుమారు రెండున్నర నెలల క్రితం ఆమె భర్తను, ఇద్దరు పిల్లలను వదిలేసి ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది.

అయితే, వదిలివెళ్లిన పిల్లలపై బెంగతో సాధన సెప్టెంబర్ 17న తిరిగి వచ్చింది. భర్త ఇంట్లో ఉండగా నేరుగా వెళ్లే ధైర్యం చేయలేక, ఎవరికీ తెలియకుండా దొంగచాటుగా పక్కింటి పైకప్పు మీదుగా తన భర్త ఇంట్లోకి చొరబడింది. పిల్లలను తన వెంట తీసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడే అసలు వివాదం మొదలైంది.

దీపక్ కుటుంబ సభ్యులు సాధనను చూసి అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. అది కాస్తా భౌతిక దాడికి దారితీసింది. ఈ క్రమంలో జరిగిన ఘర్షణపై ఇరువైపులా తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. పిల్లలను తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన తనను భర్త దీపక్ తీవ్రంగా కొట్టాడని, ఆ సమయంలో తన అత్తమామలు చేతులు గట్టిగా పట్టుకోగా దీపక్ తన ముక్కును పళ్లతో బలంగా కొరికేశాడని సాధన ఆరోపించింది. అంతేకాకుండా కొరికిన ముక్కు భాగాన్ని పక్కనే ఉన్న కాలువలో పారేశాడని ఆమె వాపోయింది.

మరోవైపు, దీపక్ కుటుంబ సభ్యులు సాధనపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. పిల్లలను తీసుకెళ్లొద్దని అడ్డుకున్నందుకు సాధన తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిందని, గొడవ పడుతూ భర్త దీపక్ ప్రైవేట్ పార్ట్స్‌పై పళ్లతో బలంగా కొరికి తీవ్రంగా గాయపరిచిందని వారు పేర్కొన్నారు. ఆ తీవ్ర నొప్పిని తట్టుకోలేకనే ఈ ఘర్షణ మరింత ముదిరిందని తెలిపారు.

ఈ పరస్పర దాడుల్లో సాధన తీవ్ర రక్తస్రావంతో గాయపడటంతో స్థానికులు, కుటుంబీకులు ఆమెను చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. ఇరువర్గాల వాంగ్మూలాలను నమోదు చేసుకున్న అనంతరం, సాధనపై దాడి చేసిన భర్త దీపక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 20 September 2026, 9:27 am Digital Edition : Prabhanews
Viral: ఇదేం కొరుకుడు ఫాంటసీ రా బాబు! భర్త ప్రైవేట్ పార్ట్స్ కొరికిన భార్య.. ఆమెది అది కొరికేసిన భర్త! |

Last Updated:Sep 20, 2026 9:06 AM ISTViral: కుటుంబ కలహాలు, వివాహేతర సంబంధం చివరకు భార్యాభర్తల మధ్య అత్యంత పైశాచిక దాడికి దారితీశాయి.News18ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ భార్య తన భర్త ప్రైవేట్ పార్ట్స్‌ను కొరకగా.. ప్రతిగా భర్త ఆమె ముక్కు కొరికేసిన విచిత్రమైన, ఒళ్లు గగుర్పొడిచే ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయి జిల్లా కేంద్రంలో వెలుగుచూసింది. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. హర్దోయి జిల్లా కేంద్రానికి చెందిన దీపక్, సాధన (27) దంపతులకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలం వీరి సంసారం సాఫీగానే సాగినప్పటికీ, ఆ తర్వాత కుటుంబంలో కలతలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే సాధనకు తన భర్త దీపక్ స్నేహితుడితో పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆ బంధం ముదరడంతో సుమారు రెండున్నర నెలల క్రితం ఆమె భర్తను, ఇద్దరు పిల్లలను వదిలేసి ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది.అయితే, వదిలివెళ్లిన పిల్లలపై బెంగతో సాధన సెప్టెంబర్ 17న తిరిగి వచ్చింది. భర్త ఇంట్లో ఉండగా నేరుగా వెళ్లే ధైర్యం చేయలేక, ఎవరికీ తెలియకుండా దొంగచాటుగా పక్కింటి పైకప్పు మీదుగా తన భర్త ఇంట్లోకి చొరబడింది. పిల్లలను తన వెంట తీసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడే అసలు వివాదం మొదలైంది.దీపక్ కుటుంబ సభ్యులు సాధనను చూసి అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. అది కాస్తా భౌతిక దాడికి దారితీసింది. ఈ క్రమంలో జరిగిన ఘర్షణపై ఇరువైపులా తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. పిల్లలను తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన తనను భర్త దీపక్ తీవ్రంగా కొట్టాడని, ఆ సమయంలో తన అత్తమామలు చేతులు గట్టిగా పట్టుకోగా దీపక్ తన ముక్కును పళ్లతో బలంగా కొరికేశాడని సాధన ఆరోపించింది. అంతేకాకుండా కొరికిన ముక్కు భాగాన్ని పక్కనే ఉన్న కాలువలో పారేశాడని ఆమె వాపోయింది.మరోవైపు, దీపక్ కుటుంబ సభ్యులు సాధనపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. పిల్లలను తీసుకెళ్లొద్దని అడ్డుకున్నందుకు సాధన తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిందని, గొడవ పడుతూ భర్త దీపక్ ప్రైవేట్ పార్ట్స్‌పై పళ్లతో బలంగా కొరికి తీవ్రంగా గాయపరిచిందని వారు పేర్కొన్నారు. ఆ తీవ్ర నొప్పిని తట్టుకోలేకనే ఈ ఘర్షణ మరింత ముదిరిందని తెలిపారు.ఈ పరస్పర దాడుల్లో సాధన తీవ్ర రక్తస్రావంతో గాయపడటంతో స్థానికులు, కుటుంబీకులు ఆమెను చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. ఇరువర్గాల వాంగ్మూలాలను నమోదు చేసుకున్న అనంతరం, సాధనపై దాడి చేసిన భర్త దీపక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మరింత చదవండి

Source link