ట్రాయ్ ఆటోమేటెడ్ కాల్స్‌కు సంబంధించిన నిబంధనలను కూడా స్పష్టంగా నిర్వచించింది. అప్లికేషన్, సాఫ్ట్‌వేర్ సిస్టమ్ లేదా ఆటోమేటెడ్ ప్లాట్‌ఫామ్ నుంచి నేరుగా మనిషి డయల్ చేయకుండా వచ్చే కాల్స్‌ను అప్లికేషన్-టు-పర్సన్ లేదా ఏ2పీ కాల్స్‌గా పరిగణిస్తారు. ఇందులో ఆటోడయలింగ్, రోబోకాల్స్, ముందే రికార్డ్ చేసిన వాయిస్ లేదా ఆర్టిఫిషియల్ వాయిస్‌తో చేసే కాల్స్ కూడా ఉంటాయి. ఏ2పీ కాల్స్ చేసే సంస్థలు ముందుగానే తాము ఇలాంటి కాల్స్ ఉపయోగిస్తున్నామని, అందుకోసం ఉపయోగించే నంబర్ల వివరాలను తమ టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌కు తెలియజేయాలి. ఇలా ముందుగా ప్రకటించకుండా చేసే కాల్స్‌ను యూసీసీ, అంటే అనవసరమైన కమర్షియల్ కమ్యూనికేషన్‌గా పరిగణిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)

