ప్రభన్యూస్

హైదరాబాద్‌లో తమ మొదటి లెగో సర్టిఫైడ్ స్టోర్‌ను ప్రారంభించిన లెగో గ్రూప్ | బిజినెస్


తెలుగు, తమిళ మరియు హిందీ చిత్రాలలో తాను పోషించిన విభిన్నమైన పాత్రల ద్వారా ప్రసిద్ధి చెందిన ప్రముఖ భారతీయ నటుడు, నిర్మాత, పారిశ్రామికవేత్త రానా దగ్గుబాటి ఈ స్టోర్‌ను ప్రారంభించి, ఒక ప్రత్యేక లెగో మొజాయిక్‌ను ఆవిష్కరించారు. హైదరాబాద్‌ను కేవలం ఒక నగరంగానే కాకుండా, ఒక అనుభూతిగా ఆవిష్కరిస్తూ, మాస్టర్ బిల్డర్ రీతమ్ భట్నాగర్ 49,200 లెగో® బ్రిక్స్ ను ఉపయోగించి ఈ మొజాయిక్‌ను సృష్టించారు. చార్మినార్ మరియు హుస్సేన్ సాగర్ సరస్సు నుండి ఇరానీ చాయ్ స్టాల్ వరకు, నగరంలోని ప్రముఖంగా గుర్తించదగిన కొన్ని మైలురాళ్ళు , సాంస్కృతిక చిహ్నాలను కలిగి ఉన్న ఈ 7 అడుగుల x 5 అడుగుల మొజాయిక్, హైదరాబాద్ స్ఫూర్తిని ప్రతిబింబించే దృశ్యాలను, అనుభవాలను ఒకచోట చేర్చింది. ఈ వేడుకలలో అభిమానులు, కుటుంబాల కోసం ఆసక్తికరమైన కార్యకలాపాలు , నిర్మాణ సవాళ్లు కూడా భాగంగా ఉన్నాయి.

బ్లాక్‌బస్టర్ల పట్ల హైదరాబాద్‌కు ఉన్న ప్రేమ స్ఫూర్తితో రూపుదిద్దుకున్న స్టోర్..

ఆవిష్కరణలకు కేంద్రంగా, అభివృద్ధి చెందుతున్న తెలుగు చిత్ర పరిశ్రమకు, భారతీయ సినిమాలోని కొన్ని అతిపెద్ద బ్లాక్‌బస్టర్లకు నిలయమైన హైదరాబాద్, సృజనాత్మకతను ప్రోత్సహిస్తోన్న నగరంగా నిలిచింది. ఆ స్ఫూర్తితోనే హైదరాబాద్‌లో మొట్టమొదటి లెగో సర్టిఫైడ్ స్టోర్ ప్రారంభమైంది. ఊహాశక్తిని ఉత్తేజపరిచే సినిమాల పట్ల ప్రేమకు ప్రసిద్ధి చెందిన ఈ నగరానికి ఇది లెగో అనుభవాన్ని అందిస్తోంది. స్టోర్ అంతటా కనిపించే స్థానిక ప్రేరణతో కూడిన అంశాలు, ఆశ్చర్యకరమైన విషయాలు, హైదరాబాద్‌తో దానికి ఉన్న అనుబంధాన్ని చెబుతాయి. ఇక్కడ ‘పిక్-ఎ-బ్రిక్’వాల్, ప్లే టేబుల్స్ మరియు ‘బిల్డ్-ఎ-మినీ’ స్టేషన్లతో పాటు, లెగో ® ఆర్ట్ గుస్తవ్ క్లిమిట్ – ది కిస్, ది మినిస్ట్రీ అఫ్ మ్యాజిక్ – కలెక్టర్స్ ఎడిషన్, లెగో® టెక్నిక్ కనిగ్‌సెగ్ సడైర్స్ స్పియర్ మరియు మరెన్నో కొత్త ఉత్పత్తులతో సహా మొత్తం 250 రకాల లెగో సెట్లు అందుబాటులో ఉంటాయి.

లెగో ఇండియా కంట్రీ మేనేజర్ భావన మండన్ మాట్లాడుతూ “హైదరాబాద్‌ యొక్క సాంస్కృతిక వైభవం, ఉత్సాహభరితమైన వాతావరణం సృజనాత్మక ఆలోచనలకు చక్కటి వేదికగా నిలుస్తున్నాయి. సంవత్సరాలు గడిచేకొద్దీ, ఈ నగరంలోని ప్రజలు, కుటుంబాలు కలిసి కనెక్ట్ అవ్వడానికి, ఆనందించడానికి అర్థవంతమైన అనుభవాలను చురుకుగా కోరుకునే ఒక సమాజంగా ఎదిగారు, అందువల్ల మా కొత్త లెగో సర్టిఫైడ్ స్టోర్‌కు ఇది సహజమైన నిలయంగా మారింది. మా దీర్ఘకాలిక భాగస్వామి అయిన ‘ఆంప్లి గ్రూప్’తో కలిసి భారతదేశంలో మా ఎనిమిదవ స్టోర్‌ను ప్రారంభిస్తున్నందుకు, అలాగే హైదరాబాద్‌లోని అభిమానులకు కలిసి నిర్మాణాలు చేసే ఆనందాన్ని మరింత దగ్గర చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది” అని అన్నారు.

ఆంప్లి గ్రూప్ వ్యవస్థాపకులు , సిఈఓ రాజేష్ నారంగ్ మాట్లాడుతూ “లెగో గ్రూప్‌తో మా భాగస్వామ్యం ఇటీవలి కాలంలోనే మొదలైనప్పటికీ, మా విస్తరణ వేగం అద్భుతంగా ఉంది. తక్కువ సమయంలోనే మేము లెగో రిటైల్ అనుభవాన్ని మరో కొత్త నగరానికి విస్తరించాము; ఈ ప్రయాణంలో హైదరాబాద్ ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్‌లతో భాగస్వామ్యం ద్వారా దేశవ్యాప్తంగా విస్తరించిన రిటైల్ నెట్‌వర్క్‌తో, ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన కొన్ని బ్రాండ్‌ల కోసం బలమైన, అనుభవాధారిత కేంద్రాలను రూపొందించడంపై మేము దృష్టి సారిస్తున్నాము” అని అన్నారు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో రానా దగ్గుబాటి మాట్లాడుతూ “హైదరాబాద్‌లో చివరకు ఒక లెగో సర్టిఫైడ్ స్టోర్ రావడం చాలా సంతోషంగా ఉంది. లెగో సెట్లను ఏ వయసు వారైనా ఆస్వాదించవచ్చు; మా కుటుంబంతో కలిసి ఈ స్టోర్‌ను అన్వేషిస్తూ గొప్ప సమయాన్ని గడుపుతానని నాకు తెలుసు. హైదరాబాద్‌కు కొత్త, సరదాగా ఉండే అంశాలు రావడం ఎప్పుడూ సంతోషకరమైన విషయమే, ఈ ప్రారంభోత్సవంలో భాగం కావడం నాకు చాలా ఆనందంగా ఉంది” అని అన్నారు.

ఆటలతో నిండిన ఒక బ్లాక్‌బస్టర్ రోజు..

ప్రారంభోత్సవ వేడుకల్లో కుటుంబాలు, అభిమానులు, క్రియేటర్లు పాల్గొని ఉత్సాహభరితమైన లెగో థీమ్‌ గేమ్స్‌, పోటీల్లో సందడి చేశారు. ప్రముఖ క్రియేటర్లు కుటుంబాలతో కలిసి బిల్డింగ్‌ ఛాలెంజ్‌లలో పాల్గొన్నారు. హైదరాబాద్ స్ఫూర్తితో రూపొందించిన లెగసీ వాల్, లెగో-థీమ్ స్పిన్ ఛాలెంజ్ నుండి బ్రిక్ పిట్ , లెగో డిస్‌ప్లేల వరకు ఈ ప్రారంభోత్సవం, స్టోర్ యొక్క ప్రసిద్ధ ఎరుపు-పసుపు తలుపుల వెనుక వేచి ఉన్న విభిన్న లెగో సెట్‌ల ద్వారా సృష్టించబడిన ప్రపంచాలను అభిమానులకు పరిచయం చేసింది.

ఇనార్బిట్ మాల్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ రజనీష్ మహాజన్ మాట్లాడుతూ, “మొట్టమొదటిసారిగా హైదరాబాద్‌కు లెగోను ఇనార్బిట్ వద్ద తీసుకురావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే, ఒక బలమైన రిటైల్ కేంద్రం, వినియోగదారులను వారు విలువ ఇచ్చే బ్రాండ్‌లు , అనుభవాలకు మరింత చేరువ చేయడంతో పాటు, వారికి కొత్తదనాన్ని కూడా పరిచయం చేయాలని మేము ఎల్లప్పుడూ నమ్ముతాము. మా విధానం ఎల్లప్పుడూ వినియోగదారుల కేంద్రంగానే ఉంటుంది. మా మాల్స్‌కు వచ్చే వారికి మరింత ప్రయోజనం, ఉత్సాహం, కొత్తదనాన్ని అందించే అంశాలపైనే మేము దృష్టి పెడతాం. లెగో, దాని బలమైన ప్రపంచ వారసత్వం , తరతరాలుగా సృజనాత్మకతను ప్రేరేపించగల సామర్థ్యంతో, ఆ లక్ష్యంకు సహజంగా సరిపోతుంది. ఎక్కువమంది ఇష్టపడే ఈ గ్లోబల్ బ్రాండ్‌ను మొట్టమొదటిసారిగా హైదరాబాద్‌కు తీసుకురావడం , ఇక్కడే ఇనార్బిట్‌లో లెగో అనుభవాలను సొంతం చేసుకోవటానికి ఒక కొత్త మార్గాన్ని అందించడం మాకు చాలా ఆనందంగా ఉంది” అని అన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 19 September 2026, 10:58 pm Digital Edition : Prabhanews
హైదరాబాద్‌లో తమ మొదటి లెగో సర్టిఫైడ్ స్టోర్‌ను ప్రారంభించిన లెగో గ్రూప్ | బిజినెస్

తెలుగు, తమిళ మరియు హిందీ చిత్రాలలో తాను పోషించిన విభిన్నమైన పాత్రల ద్వారా ప్రసిద్ధి చెందిన ప్రముఖ భారతీయ నటుడు, నిర్మాత, పారిశ్రామికవేత్త రానా దగ్గుబాటి ఈ స్టోర్‌ను ప్రారంభించి, ఒక ప్రత్యేక లెగో మొజాయిక్‌ను ఆవిష్కరించారు. హైదరాబాద్‌ను కేవలం ఒక నగరంగానే కాకుండా, ఒక అనుభూతిగా ఆవిష్కరిస్తూ, మాస్టర్ బిల్డర్ రీతమ్ భట్నాగర్ 49,200 లెగో® బ్రిక్స్ ను ఉపయోగించి ఈ మొజాయిక్‌ను సృష్టించారు. చార్మినార్ మరియు హుస్సేన్ సాగర్ సరస్సు నుండి ఇరానీ చాయ్ స్టాల్ వరకు, నగరంలోని ప్రముఖంగా గుర్తించదగిన కొన్ని మైలురాళ్ళు , సాంస్కృతిక చిహ్నాలను కలిగి ఉన్న ఈ 7 అడుగుల x 5 అడుగుల మొజాయిక్, హైదరాబాద్ స్ఫూర్తిని ప్రతిబింబించే దృశ్యాలను, అనుభవాలను ఒకచోట చేర్చింది. ఈ వేడుకలలో అభిమానులు, కుటుంబాల కోసం ఆసక్తికరమైన కార్యకలాపాలు , నిర్మాణ సవాళ్లు కూడా భాగంగా ఉన్నాయి.బ్లాక్‌బస్టర్ల పట్ల హైదరాబాద్‌కు ఉన్న ప్రేమ స్ఫూర్తితో రూపుదిద్దుకున్న స్టోర్..ఆవిష్కరణలకు కేంద్రంగా, అభివృద్ధి చెందుతున్న తెలుగు చిత్ర పరిశ్రమకు, భారతీయ సినిమాలోని కొన్ని అతిపెద్ద బ్లాక్‌బస్టర్లకు నిలయమైన హైదరాబాద్, సృజనాత్మకతను ప్రోత్సహిస్తోన్న నగరంగా నిలిచింది. ఆ స్ఫూర్తితోనే హైదరాబాద్‌లో మొట్టమొదటి లెగో సర్టిఫైడ్ స్టోర్ ప్రారంభమైంది. ఊహాశక్తిని ఉత్తేజపరిచే సినిమాల పట్ల ప్రేమకు ప్రసిద్ధి చెందిన ఈ నగరానికి ఇది లెగో అనుభవాన్ని అందిస్తోంది. స్టోర్ అంతటా కనిపించే స్థానిక ప్రేరణతో కూడిన అంశాలు, ఆశ్చర్యకరమైన విషయాలు, హైదరాబాద్‌తో దానికి ఉన్న అనుబంధాన్ని చెబుతాయి. ఇక్కడ 'పిక్-ఎ-బ్రిక్'వాల్, ప్లే టేబుల్స్ మరియు 'బిల్డ్-ఎ-మినీ' స్టేషన్లతో పాటు, లెగో ® ఆర్ట్ గుస్తవ్ క్లిమిట్ - ది కిస్, ది మినిస్ట్రీ అఫ్ మ్యాజిక్ - కలెక్టర్స్ ఎడిషన్, లెగో® టెక్నిక్ కనిగ్‌సెగ్ సడైర్స్ స్పియర్ మరియు మరెన్నో కొత్త ఉత్పత్తులతో సహా మొత్తం 250 రకాల లెగో సెట్లు అందుబాటులో ఉంటాయి.లెగో ఇండియా కంట్రీ మేనేజర్ భావన మండన్ మాట్లాడుతూ "హైదరాబాద్‌ యొక్క సాంస్కృతిక వైభవం, ఉత్సాహభరితమైన వాతావరణం సృజనాత్మక ఆలోచనలకు చక్కటి వేదికగా నిలుస్తున్నాయి. సంవత్సరాలు గడిచేకొద్దీ, ఈ నగరంలోని ప్రజలు, కుటుంబాలు కలిసి కనెక్ట్ అవ్వడానికి, ఆనందించడానికి అర్థవంతమైన అనుభవాలను చురుకుగా కోరుకునే ఒక సమాజంగా ఎదిగారు, అందువల్ల మా కొత్త లెగో సర్టిఫైడ్ స్టోర్‌కు ఇది సహజమైన నిలయంగా మారింది. మా దీర్ఘకాలిక భాగస్వామి అయిన 'ఆంప్లి గ్రూప్'తో కలిసి భారతదేశంలో మా ఎనిమిదవ స్టోర్‌ను ప్రారంభిస్తున్నందుకు, అలాగే హైదరాబాద్‌లోని అభిమానులకు కలిసి నిర్మాణాలు చేసే ఆనందాన్ని మరింత దగ్గర చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది" అని అన్నారు.ఆంప్లి గ్రూప్ వ్యవస్థాపకులు , సిఈఓ రాజేష్ నారంగ్ మాట్లాడుతూ "లెగో గ్రూప్‌తో మా భాగస్వామ్యం ఇటీవలి కాలంలోనే మొదలైనప్పటికీ, మా విస్తరణ వేగం అద్భుతంగా ఉంది. తక్కువ సమయంలోనే మేము లెగో రిటైల్ అనుభవాన్ని మరో కొత్త నగరానికి విస్తరించాము; ఈ ప్రయాణంలో హైదరాబాద్ ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్‌లతో భాగస్వామ్యం ద్వారా దేశవ్యాప్తంగా విస్తరించిన రిటైల్ నెట్‌వర్క్‌తో, ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన కొన్ని బ్రాండ్‌ల కోసం బలమైన, అనుభవాధారిత కేంద్రాలను రూపొందించడంపై మేము దృష్టి సారిస్తున్నాము" అని అన్నారు.ప్రారంభోత్సవ కార్యక్రమంలో రానా దగ్గుబాటి మాట్లాడుతూ "హైదరాబాద్‌లో చివరకు ఒక లెగో సర్టిఫైడ్ స్టోర్ రావడం చాలా సంతోషంగా ఉంది. లెగో సెట్లను ఏ వయసు వారైనా ఆస్వాదించవచ్చు; మా కుటుంబంతో కలిసి ఈ స్టోర్‌ను అన్వేషిస్తూ గొప్ప సమయాన్ని గడుపుతానని నాకు తెలుసు. హైదరాబాద్‌కు కొత్త, సరదాగా ఉండే అంశాలు రావడం ఎప్పుడూ సంతోషకరమైన విషయమే, ఈ ప్రారంభోత్సవంలో భాగం కావడం నాకు చాలా ఆనందంగా ఉంది" అని అన్నారు.ఆటలతో నిండిన ఒక బ్లాక్‌బస్టర్ రోజు..ప్రారంభోత్సవ వేడుకల్లో కుటుంబాలు, అభిమానులు, క్రియేటర్లు పాల్గొని ఉత్సాహభరితమైన లెగో థీమ్‌ గేమ్స్‌, పోటీల్లో సందడి చేశారు. ప్రముఖ క్రియేటర్లు కుటుంబాలతో కలిసి బిల్డింగ్‌ ఛాలెంజ్‌లలో పాల్గొన్నారు. హైదరాబాద్ స్ఫూర్తితో రూపొందించిన లెగసీ వాల్, లెగో-థీమ్ స్పిన్ ఛాలెంజ్ నుండి బ్రిక్ పిట్ , లెగో డిస్‌ప్లేల వరకు ఈ ప్రారంభోత్సవం, స్టోర్ యొక్క ప్రసిద్ధ ఎరుపు-పసుపు తలుపుల వెనుక వేచి ఉన్న విభిన్న లెగో సెట్‌ల ద్వారా సృష్టించబడిన ప్రపంచాలను అభిమానులకు పరిచయం చేసింది.ఇనార్బిట్ మాల్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ రజనీష్ మహాజన్ మాట్లాడుతూ, “మొట్టమొదటిసారిగా హైదరాబాద్‌కు లెగోను ఇనార్బిట్ వద్ద తీసుకురావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే, ఒక బలమైన రిటైల్ కేంద్రం, వినియోగదారులను వారు విలువ ఇచ్చే బ్రాండ్‌లు , అనుభవాలకు మరింత చేరువ చేయడంతో పాటు, వారికి కొత్తదనాన్ని కూడా పరిచయం చేయాలని మేము ఎల్లప్పుడూ నమ్ముతాము. మా విధానం ఎల్లప్పుడూ వినియోగదారుల కేంద్రంగానే ఉంటుంది. మా మాల్స్‌కు వచ్చే వారికి మరింత ప్రయోజనం, ఉత్సాహం, కొత్తదనాన్ని అందించే అంశాలపైనే మేము దృష్టి పెడతాం. లెగో, దాని బలమైన ప్రపంచ వారసత్వం , తరతరాలుగా సృజనాత్మకతను ప్రేరేపించగల సామర్థ్యంతో, ఆ లక్ష్యంకు సహజంగా సరిపోతుంది. ఎక్కువమంది ఇష్టపడే ఈ గ్లోబల్ బ్రాండ్‌ను మొట్టమొదటిసారిగా హైదరాబాద్‌కు తీసుకురావడం , ఇక్కడే ఇనార్బిట్‌లో లెగో అనుభవాలను సొంతం చేసుకోవటానికి ఒక కొత్త మార్గాన్ని అందించడం మాకు చాలా ఆనందంగా ఉంది” అని అన్నారు.

Source link