Last Updated:
Gold Rate Today: అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, డాలర్ ఇండెక్స్‌లో మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోలు ఆసక్తి ప్రభావంతో దేశీయంగా బంగారం ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు.
బుధవారం ఉదయం దేశీయ బులియన్ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)తో పాటు స్పాట్ మార్కెట్లోనూ విలువైన లోహాల ధరలు పెరిగాయి. ఉదయం 9:05 గంటలకు మనీకంట్రోల్ వెల్లడించిన లైవ్ మార్కెట్ వివరాల ప్రకారం, MCXలో అక్టోబర్ 5 ఫ్యూచర్ కాంట్రాక్టులో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,51,705 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే ఇది రూ.896 పెరిగింది. MCXలో వెండి ధరలు కూడా పెరిగాయి. సెప్టెంబర్ 4 ఫ్యూచర్ కాంట్రాక్టులో కిలో వెండి ధర రూ.2,35,114 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే కిలో వెండి ధర రూ.2,996 పెరిగింది.
ఫ్యూచర్స్ మార్కెట్లోనే కాకుండా హైదరాబాద్ స్పాట్ బులియన్ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఉదయం 9:10 గంటలకు bullions.co.in వెల్లడించిన ధరల ప్రకారం, హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.1,52,330గా ఉంది. గత మార్కెట్ ముగింపు ధరతో పోలిస్తే ఇది రూ.980 పెరిగింది. అదేవిధంగా, హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర కూడా మార్పు చెందింది. ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,636 వద్ద కొనసాగుతోంది. ఇక కేజీ వెండి ధర రూ.2,34,900 వద్ద కొనసాగుతుంది. క్రితం ముగింపుతో పోలిస్తే రూ.3020 పెరిగింది.

