ప్రభన్యూస్

Jio Offer: జియో సిమ్ యూజర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్.. రూ.4,000 విలువైన Canva Pro ఉచితం! | బిజినెస్


Last Updated:

జియో రీఛార్జ్ చేసే వారికి భారీ ప్రయోజనం అందుబాటులోకి రాబోతోంది. రూ.4,000 వరకు విలువైన Canva ప్రీమియం సేవలను 12 నెలల పాటు ఉచితంగా పొందే అవకాశం కల్పించారు. అయితే ఏ రీఛార్జ్ ప్లాన్‌కు Canva Pro వస్తుంది? ఈ ఆఫర్‌ను ఎలా పొందాలో తెలుసుకోండి.

Jio Canva Pro free
Jio Canva Pro free

జియో వినియోగదారులకు ప్రముఖ డిజైన్ ప్లాట్‌ఫామ్ Canva భారీ ఆఫర్ ప్రకటించింది. రిలయన్స్ జియో, Canva వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయి. దీని ద్వారా దేశవ్యాప్తంగా లక్షలాది మంది జియో వినియోగదారులకు Canva ప్రీమియం సృజనాత్మక సాధనాలను ఉచితంగా అందించనున్నారు. రూ.4,000 వరకు విలువైన ఈ ప్రయోజనాన్ని అర్హులైన జియో కస్టమర్లు గరిష్ఠంగా 12 నెలల పాటు అదనపు ఖర్చు లేకుండా పొందవచ్చు. ఈ ఆఫర్ సెప్టెంబర్ 16, 2026 నుంచి అర్హత ఉన్న రీఛార్జ్ ప్లాన్లతో రీఛార్జ్ చేసే వినియోగదారులకు అన్ని ఛానళ్లలో అందుబాటులోకి రానుంది.

జియో రీఛార్జ్ ప్లాన్ ఆధారంగానే Canvaలో లభించే ప్రయోజనం నిర్ణయమవుతుంది. రూ.399 ప్లాన్‌తో రీఛార్జ్ చేసే అర్హులైన వినియోగదారులకు Canva Pro లభిస్తుంది. రూ.349 ప్లాన్‌తో పాటు రోజుకు 2 జీబీ డేటా అందించే రూ.349 కంటే ఎక్కువ ప్లాన్లను తీసుకునేవారికి Canva Pro Lite అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్‌ను పొందేందుకు MyJio యాప్‌లోకి వెళ్లి, కనిపించే ఆఫర్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. ఎలాంటి అదనపు ఖర్చులు, దాచిన ఛార్జీలు ఉండవని సంస్థలు తెలిపాయి.

ఈ భాగస్వామ్యం ద్వారా విద్యార్థులు, కంటెంట్ సృష్టికర్తలు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, చిన్న వ్యాపారాలు తమ ఫోన్ నుంచే ప్రొఫెషనల్ స్థాయి కంటెంట్ రూపొందించుకోవచ్చు. పాఠశాల ప్రాజెక్టులు, సోషల్ మీడియా పోస్టులు, ప్రెజెంటేషన్లు, మార్కెటింగ్ కంటెంట్, పండుగ శుభాకాంక్షల డిజైన్లతో పాటు ఇతర అవసరాలకు Canvaలోని ప్రీమియం టెంప్లేట్లు, ఫొటోలు, వీడియోలు, ఫాంట్లు ఉపయోగించుకోవచ్చు. హిందీతో పాటు పలు భారతీయ భాషల్లో డిజైన్ చేసుకునే సదుపాయం కూడా ఉంది.

AI ఆధారిత సాధనాలతో డిజైనింగ్ అనుభవం లేని వారు కూడా తక్కువ సమయంలో కంటెంట్ రూపొందించుకోవచ్చని సంస్థలు పేర్కొన్నాయి. స్మార్ట్ ఎడిటింగ్, ఒక ట్యాప్‌తో బ్యాక్‌గ్రౌండ్ తొలగింపు, మ్యాజిక్ రీసైజ్, మ్యాజిక్ ఎరేజర్ వంటి ఫీచర్లు Pro Lite, Proలో అందుబాటులో ఉంటాయి. Pro వెర్షన్‌లో Canva AI, సంభాషణ ద్వారా డిజైన్ రూపొందించే సదుపాయం, అధిక AI పరిమితులు, కంటెంట్ ప్లానర్ వంటి అదనపు ఫీచర్లు ఉంటాయి. Pro Liteలో 50GB క్లౌడ్ స్టోరేజ్ ఉండగా, Proలో 100GB వరకు స్టోరేజ్ లభిస్తుంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రెసిడెంట్ కిరణ్ థామస్ మాట్లాడుతూ, భారతీయుల సృజనాత్మకతకు ప్రపంచస్థాయి AI డిజైన్ సాధనాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమన్నారు. Canva సహ వ్యవస్థాపకుడు, COO క్లిఫ్ ఒబ్రెచ్ట్ మాట్లాడుతూ భారత్ తమ వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒకటని తెలిపారు. జియోతో భాగస్వామ్యం ద్వారా దేశవ్యాప్తంగా మరింత మందికి Canva సేవలను చేరువ చేయనున్నట్లు పేర్కొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 15 September 2026, 8:36 pm Digital Edition : Prabhanews
Jio Offer: జియో సిమ్ యూజర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్.. రూ.4,000 విలువైన Canva Pro ఉచితం! | బిజినెస్

Last Updated:Sep 15, 2026 8:23 PM ISTజియో రీఛార్జ్ చేసే వారికి భారీ ప్రయోజనం అందుబాటులోకి రాబోతోంది. రూ.4,000 వరకు విలువైన Canva ప్రీమియం సేవలను 12 నెలల పాటు ఉచితంగా పొందే అవకాశం కల్పించారు. అయితే ఏ రీఛార్జ్ ప్లాన్‌కు Canva Pro వస్తుంది? ఈ ఆఫర్‌ను ఎలా పొందాలో తెలుసుకోండి.
Jio Canva Pro freeజియో వినియోగదారులకు ప్రముఖ డిజైన్ ప్లాట్‌ఫామ్ Canva భారీ ఆఫర్ ప్రకటించింది. రిలయన్స్ జియో, Canva వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయి. దీని ద్వారా దేశవ్యాప్తంగా లక్షలాది మంది జియో వినియోగదారులకు Canva ప్రీమియం సృజనాత్మక సాధనాలను ఉచితంగా అందించనున్నారు. రూ.4,000 వరకు విలువైన ఈ ప్రయోజనాన్ని అర్హులైన జియో కస్టమర్లు గరిష్ఠంగా 12 నెలల పాటు అదనపు ఖర్చు లేకుండా పొందవచ్చు. ఈ ఆఫర్ సెప్టెంబర్ 16, 2026 నుంచి అర్హత ఉన్న రీఛార్జ్ ప్లాన్లతో రీఛార్జ్ చేసే వినియోగదారులకు అన్ని ఛానళ్లలో అందుబాటులోకి రానుంది.జియో రీఛార్జ్ ప్లాన్ ఆధారంగానే Canvaలో లభించే ప్రయోజనం నిర్ణయమవుతుంది. రూ.399 ప్లాన్‌తో రీఛార్జ్ చేసే అర్హులైన వినియోగదారులకు Canva Pro లభిస్తుంది. రూ.349 ప్లాన్‌తో పాటు రోజుకు 2 జీబీ డేటా అందించే రూ.349 కంటే ఎక్కువ ప్లాన్లను తీసుకునేవారికి Canva Pro Lite అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్‌ను పొందేందుకు MyJio యాప్‌లోకి వెళ్లి, కనిపించే ఆఫర్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. ఎలాంటి అదనపు ఖర్చులు, దాచిన ఛార్జీలు ఉండవని సంస్థలు తెలిపాయి.ఈ భాగస్వామ్యం ద్వారా విద్యార్థులు, కంటెంట్ సృష్టికర్తలు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, చిన్న వ్యాపారాలు తమ ఫోన్ నుంచే ప్రొఫెషనల్ స్థాయి కంటెంట్ రూపొందించుకోవచ్చు. పాఠశాల ప్రాజెక్టులు, సోషల్ మీడియా పోస్టులు, ప్రెజెంటేషన్లు, మార్కెటింగ్ కంటెంట్, పండుగ శుభాకాంక్షల డిజైన్లతో పాటు ఇతర అవసరాలకు Canvaలోని ప్రీమియం టెంప్లేట్లు, ఫొటోలు, వీడియోలు, ఫాంట్లు ఉపయోగించుకోవచ్చు. హిందీతో పాటు పలు భారతీయ భాషల్లో డిజైన్ చేసుకునే సదుపాయం కూడా ఉంది.AI ఆధారిత సాధనాలతో డిజైనింగ్ అనుభవం లేని వారు కూడా తక్కువ సమయంలో కంటెంట్ రూపొందించుకోవచ్చని సంస్థలు పేర్కొన్నాయి. స్మార్ట్ ఎడిటింగ్, ఒక ట్యాప్‌తో బ్యాక్‌గ్రౌండ్ తొలగింపు, మ్యాజిక్ రీసైజ్, మ్యాజిక్ ఎరేజర్ వంటి ఫీచర్లు Pro Lite, Proలో అందుబాటులో ఉంటాయి. Pro వెర్షన్‌లో Canva AI, సంభాషణ ద్వారా డిజైన్ రూపొందించే సదుపాయం, అధిక AI పరిమితులు, కంటెంట్ ప్లానర్ వంటి అదనపు ఫీచర్లు ఉంటాయి. Pro Liteలో 50GB క్లౌడ్ స్టోరేజ్ ఉండగా, Proలో 100GB వరకు స్టోరేజ్ లభిస్తుంది.రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రెసిడెంట్ కిరణ్ థామస్ మాట్లాడుతూ, భారతీయుల సృజనాత్మకతకు ప్రపంచస్థాయి AI డిజైన్ సాధనాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమన్నారు. Canva సహ వ్యవస్థాపకుడు, COO క్లిఫ్ ఒబ్రెచ్ట్ మాట్లాడుతూ భారత్ తమ వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒకటని తెలిపారు. జియోతో భాగస్వామ్యం ద్వారా దేశవ్యాప్తంగా మరింత మందికి Canva సేవలను చేరువ చేయనున్నట్లు పేర్కొన్నారు.మరింత చదవండి

Source link