Last Updated:
ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాదారులకు EPFO కీలక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక PF బ్యాలెన్స్, చివరి ఐదు లావాదేవీలు, క్లెయిమ్ స్థితి వంటి వివరాలను వాట్సాప్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది.
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) సభ్యులకు మరింత సులభంగా సేవలు అందించేందుకు వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విషయాన్ని సంస్థ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వెల్లడించింది. అధికారిక వాట్సాప్ ఛానల్లో చేరి ముఖ్యమైన సమాచారం, తాజా వివరాలను తెలుసుకోవచ్చని తెలిపింది. ఈ ఛానల్ ద్వారా అధికారిక వార్తలు, పథకాలపై సమాచారం, కీలక ప్రకటనలను సభ్యులకు అందించనున్నారు. ఈ సేవలు ప్రారంభమైన సమయంలోనే EPFO అధికారిక వాట్సాప్ ఛానల్‌కు 80,000 మంది సభ్యులు చేరడం విశేషం.

