Last Updated:
త్రి పడుకునే ముందు ఫోన్లో గంటల తరబడి స్క్రోల్ చేయడం, సోషల్ మీడియాలో ఇతరుల జీవితాలతో మన జీవితాన్ని పోల్చుకోవడం, పని పూర్తి చేయాలనే ఆలోచనతో నిద్రను తగ్గించుకోవడం, నిరంతరం వార్తలు చూస్తూ ఉండటం వంటి అలవాట్లు మన మానసిక ప్రశాంతతపై ప్రభావం చూపవచ్చు.
ఆందోళన అనేది జీవితంలో ఏదైనా పెద్ద సంఘటన జరిగిన తర్వాత మాత్రమే వస్తుందని అనుకోవడం సరికాదు. కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే చిన్న చిన్న అలవాట్లు, రోజువారీ జీవనశైలి కారణంగా కూడా ఒత్తిడి, ఆందోళన క్రమంగా పెరుగుతాయి. మొదట్లో ఇవి పెద్ద సమస్యగా అనిపించకపోవచ్చు. కానీ ప్రతిరోజూ అదే విధంగా కొనసాగితే మనసు ఎప్పుడూ ఏదో ఒక విషయం గురించి ఆలోచించే స్థితికి చేరుకోవచ్చు. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు ఫోన్లో గంటల తరబడి స్క్రోల్ చేయడం, సోషల్ మీడియాలో ఇతరుల జీవితాలతో మన జీవితాన్ని పోల్చుకోవడం, పని పూర్తి చేయాలనే ఆలోచనతో నిద్రను తగ్గించుకోవడం, నిరంతరం వార్తలు చూస్తూ ఉండటం వంటి అలవాట్లు మన మానసిక ప్రశాంతతపై ప్రభావం చూపవచ్చు.

