మనీకంట్రోల్ వెల్లడించిన కథనం ప్రకారం.. భారతీయ చట్టాల ప్రకారం వీలునామాను రిజిస్ట్రేషన్ చేయించడం ఎంతమాత్రమూ తప్పనిసరి కాదు. 1908 నాటి భారత రిజిస్ట్రేషన్ చట్టంలోని నిబంధనల ప్రకారం వీలునామా అనేది ‘ఐచ్ఛిక రిజిస్ట్రేషన్’ (Optional Registration) పరిధిలోకి వస్తుంది. అంటే, చట్టబద్ధమైన పద్ధతిలో రాసి, ఇద్దరు సాక్షుల సమక్షంలో సంతకం చేసిన నమోదు చేయని (Unregistered) వీలునామా కూడా కోర్టులో, చట్టం దృష్టిలో పూర్తి చెల్లుబాటు అవుతుంది. తప్పనిసరి కాకపోయినప్పటికీ వీలునామాను రిజిస్టర్ చేయించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రధానంగా ఇది సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒక అధికారికమైన, శాశ్వతమైన ప్రభుత్వ రికార్డును సృష్టిస్తుంది. వీలునామాదారుడు మరణించిన తర్వాత ఆ పత్రం యొక్క ప్రామాణికతపై గానీ, లేదా దానిపై ఉన్న సంతకంపై గానీ వారసులు ఎవరైనా ప్రశ్నలు తలెత్తిస్తే, ఈ రిజిస్టర్డ్ రికార్డే న్యాయస్థానాల్లో అత్యంత బలమైన సాక్ష్యంగా నిలుస్తుంది. అంతేకాకుండా మూల పత్రం పోయినా లేదా ఎవరైనా నకిలీ వీలునామాను సృష్టించడానికి ప్రయత్నించినా రిజిస్ట్రేషన్ రికార్డులు దానిని అడ్డుకుంటాయి.(AI IMAGE)

