Last Updated:
పాత బైక్ను అమ్మాలని చూస్తున్నారా? మీరు ఆశించిన ధర కంటే తక్కువకు విక్రయించాల్సి రావడానికి కొన్ని చిన్న తప్పులే కారణం కావచ్చు. అసలు ఆ విషయాలు ఏమిటి? బైక్ ధరను పెంచడంలో అవి ఎలా సహాయపడతాయో తెలుసుకోండి.
పాత బైక్ను విక్రయించేటప్పుడు మీరు ఆశించిన దానికంటే తక్కువ ధర లభిస్తే, అందుకు బైక్ కండిషన్ నుంచి డాక్యుమెంట్ల వరకు అనేక కారణాలు ఉండవచ్చు. అయితే బైక్ను కొనుగోలు చేసినప్పటి నుంచే సరైన జాగ్రత్తలు తీసుకుంటే, విక్రయించే సమయంలో మెరుగైన ధర పొందే అవకాశం ఉంటుంది. క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించడం, శుభ్రంగా ఉంచడం, అవసరమైన మార్పులు మాత్రమే చేయడం వంటి 5 చిన్న విషయాలు మీ బైక్ పునర్విక్రయ విలువను పెంచడంలో సహాయపడతాయి.

