ఆధునిక జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు, మద్యం సేవించడం లాంటి కారణాలతో చాలా మంది కాలేయ (Liver) సమస్యల బారిన పడుతున్నారు. మన శరీరంలోని మలినాలను బయటకు పంపి, రక్తాన్ని శుద్ధి చేయడంలో లివర్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. అయితే లివర్ డ్యామేజ్ అవుతున్న ప్రారంభ దశలో పెద్దగా ఎలాంటి అనారోగ్య సమస్యలు కనిపించవు. ఎప్పుడైతే సమస్య తీవ్రమవుతుందో అప్పుడు మాత్రమే కొన్ని స్పష్టమైన లక్షణాలు బయటపడతాయి. కాబట్టి లివర్ పాడవుతుందని సూచించే ముందస్తు సంకేతాలను తెలుసుకోవడం చాలా అవసరమని మెడికవర్ ఆసుపత్రిలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, హెపటాలజిస్ట్ డాక్టర్ సబ్బు సూర్యప్రకాశ్ సూచిస్తున్నారు. మరి ఆయన సూచించిన లివర్ డ్యామేజ్ ప్రధాన లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

