Sugar Price: పండుగల ముందు చక్కెరపై కేంద్రం సంచలన నిర్ణయం.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ |
దేశంలో సాధారణంగా ఆగస్టు నుంచి నవంబర్ వరకు చక్కెరకు డిమాండ్ భారీగా పెరుగుతుంది. ఈ కాలంలో గణేశ్ చతుర్థి, దసరా, దీపావళి వంటి ప్రధాన పండుగలు వరుసగా వస్తాయి. స్వీట్లు, బిస్కెట్లు, మిఠాయిలు, ఇతర ఆహార పదార్థాల తయారీ పెరగడంతో చక్కెర వినియోగం కూడా అధికమవుతుంది. దీంతో భారీగా చక్కెరను ఉపయోగించే తయారీ సంస్థలు, వ్యాపారులు పండుగ సీజన్‌కు ముందే ఎక్కువ మొత్తంలో నిల్వలు చేసుకోవడం సాధారణంగా జరుగుతుంది. Source link
