స్పాన్సర్లు చివరి నిమిషంలో తప్పుకున్నా.. పిల్లల ఓనం వేడుకలకు మాత్రం ఎలాంటి లోటు రానివ్వలేదు కంచియార్ ప్రభుత్వ గిరిజన లోయర్ ప్రైమరీ స్కూల్ టీచర్లు, తల్లిదండ్రులు. అందరూ కలిసి పిల్లల కోసం ఏకంగా 101 రకాల వంటకాలతో ఘనంగా ఓనం సద్య ఏర్పాటు చేశారు. అందులో సాంబార్, ఊరగాయలు, కూరగాయలు, అరటి చిప్స్‌తో పాటు సంప్రదాయ స్వీట్లు, పాయసాలు కూడా ఉన్నాయి. అరటి ఆకుల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు, అతిథులకు సద్య వడ్డించారు.
