ప్రభన్యూస్

షాప్ చోరీ కేసు ఛేదించిన బిచ్కుంద పోలీసులు.. ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు.10 వేల విలువైన వివో మొబైల్‌తో పాటు మరో మూడు స్మార్ట్‌ఫోన్లు, హోండా షైన్ బైక్ స్వాధీనం.

షాప్ చోరీ కేసు ఛేదించిన బిచ్కుంద పోలీసులు.. ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు.

10 వేల విలువైన వివో మొబైల్‌తో పాటు మరో మూడు స్మార్ట్‌ఫోన్లు, హోండా షైన్ బైక్ స్వాధీనం.

ప్రభ న్యూస్ | బిచ్కుంద | జూలై 17: బిచ్కుందలో జరిగిన షాప్ చోరీ కేసును పోలీసులు ఛేదించి ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి బాధితుడికి చెందిన వివో మొబైల్‌తో పాటు మరో మూడు స్మార్ట్‌ఫోన్లు, దొంగతనాలకు వినియోగించిన హోండా షైన్ మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.బిచ్కుందకు చెందిన వ్యాపారి షేక్ షాదుల్‌కు చెందిన రాయల్ వెల్డింగ్ షాప్‌లో జూలై 15 రాత్రి షట్టర్ తాళాలు పగులగొట్టి రూ.10 వేల విలువైన వివో మొబైల్‌ను అపహరించగా, బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఎస్‌ఐ జి. రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నారు.A-1: కుంచెపు గౌరి అలియాస్ రవి (32), ప్రస్తుతం మియాపూర్, హైదరాబాద్ నివాసి. స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా. ఇతనిపై గతంలో షాబాద్, చౌదరిగూడెం పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీ కేసులు నమోదై ఉన్నాయి.A-2: మురళి ప్రధాన్ (32), ఒడిశా రాష్ట్రంలోని జాజ్‌పూర్ జిల్లా నివాసి. ఇతనిపై గతంలో మేదక్ జిల్లా చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు తెలిపారు.ప్రజలు ఇళ్లు, దుకాణాలకు పటిష్టమైన తాళాలు వేసుకోవడంతో పాటు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్-100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని బిచ్కుంద పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 July 2026, 10:57 am Digital Edition : Prabhanews