Varanasi: వారణాసి సడెన్ సర్‌ప్రైజ్‌.. ఖతర్నాక్ పోస్టర్ వదిలిన రాజమౌళి, ఇది కదా కావాల్సింది | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

నేడు (జూలై 18) గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా పుట్టినరోజు. ఈ సందర్భంగా వారణాసి సినిమా నుంచి ప్రియాంక చోప్రా లుక్ రివీల్ చేస్తూ కొత్త పోస్టర్ వదిలారు రాజమౌళి.

News18
News18

స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా పుట్టిన రోజు (జూలై 18) సందర్భంగా సినీ అభిమానులకు ఊహించని మెగా సర్‌ప్రైజ్ ఇచ్చారు దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ ‘వారణాసి’ (Varanasi) నుంచి ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్‌ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా ‘మందాకిని’ అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తోంది. తాజాగా ఈ పోస్టర్ వదులుతూ.. “ఆమె నవ్వితే అందం.. నవ్వకపోతే నిప్పు కణిక” రాజమౌళి వదిలిన ట్యాగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. క్షణాల్లోనే ఈ పోస్టర్ వైరల్ అయింది.

ఈ ‘వారణాసి’ పోస్టర్‌లో మునుపెన్నడూ చూడని లుక్‌లో దర్శనమిచ్చి ఆశ్చర్యపరిచింది ప్రియాంక. పాత్ర స్వభావాన్ని ఎలివేట్ చేసేలా ఆసక్తికరమైన క్యాప్షన్ ఇస్తూ రాజమౌళి వదిలిన ఈ లుక్ చూసి మహేష్ బాబు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ పవర్ ఫుల్ పోస్టర్‌ను పంచుకుంటూ తన కో-స్టార్‌కు బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. అయితే ఈ పాత్ర కోసం తాను ఏకంగా 14 నెలలుగా కఠిన శిక్షణ తీసుకున్నానని, హాలీవుడ్ స్థాయి యాక్షన్ సీక్వెన్సులు, హై-వోల్టేజ్ స్లో-మోషన్ స్టంట్స్ ఇందులో ఉండబోతున్నాయని ప్రియాంక ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే.

ఈ భారీ సినిమాను రూ. 1,200 నుంచి రూ. 1,500 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. హాలీవుడ్ స్టూడియోల భాగస్వామ్యంతో వరల్డ్ క్లాస్ వీఎఫ్ఎక్స్ (VFX) పనులు జరుగుతున్నాయి. పురాణాలు, చరిత్ర, సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ కలగలిపిన టైమ్-ట్రావెల్ కాన్సెప్ట్‌తో రాజమౌళి ఈ కథను సిద్ధం చేశారు. పవిత్ర నగరమైన వారణాసిని ఒక భారీ గ్రహశకలం ఢీకొట్టబోయే విపత్కర పరిస్థితుల్లో ఈ కథ మొదలవుతుంది. ఆ ప్రళయం నుంచి ప్రపంచాన్ని కాపాడేందుకు మహేష్ బాబు ‘రుద్ర’ అనే సాహసికుడిగా పురాతన విశ్వ శక్తిని వెతికే వేటలో అడుగుపెడతారు. ఈ సాహస యాత్రలో కథ త్రేతా యుగంలోని రామాయణ కాలం నుంచి నేటి కలియుగం వరకు ప్రయాణిస్తుంది. దట్టమైన ఆఫ్రికా అడవుల నుంచి అంటార్కిటికా మంచు ఖండాల వరకు సాగే ఈ ప్రయాణం ప్రేక్షకులకు రోమాలు నిక్కబొడుచుకునే అనుభూతిని ఇవ్వనుందని తెలుస్తోంది. అంతేకాదు మహేష్ బాబు ‘శ్రీరాముడి’ అవతారంలో కనిపించే ఓ ప్రత్యేక ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా నిలవనుందని తెలుస్తోంది.

ఇకపోతే ఈ గ్లోబల్ ప్రాజెక్ట్‌లో మెయిన్ విలన్ ‘కుంభ’గా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. విశేషమేమిటంటే.. ఈ సినిమా కోసం నటీనటులు ముందస్తుగా భారీ రెమ్యునరేషన్లు తీసుకోకుండా, లాభాల్లో వాటాలు పంచుకునే (Profit Sharing) హాలీవుడ్ మోడల్‌ను అనుసరిస్తున్నట్లు సమాచారం. అన్ని కార్యక్రమాలు చకచకా పూర్తి చేసి వచ్చే ఏడాది అనగా 2027 ఏప్రిల్ 7 వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు రాజమౌళి.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 July 2026, 10:57 am Digital Edition : Prabhanews
Varanasi: వారణాసి సడెన్ సర్‌ప్రైజ్‌.. ఖతర్నాక్ పోస్టర్ వదిలిన రాజమౌళి, ఇది కదా కావాల్సింది | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 18, 2026 10:39 AM ISTనేడు (జూలై 18) గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా పుట్టినరోజు. ఈ సందర్భంగా వారణాసి సినిమా నుంచి ప్రియాంక చోప్రా లుక్ రివీల్ చేస్తూ కొత్త పోస్టర్ వదిలారు రాజమౌళి. News18స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా పుట్టిన రోజు (జూలై 18) సందర్భంగా సినీ అభిమానులకు ఊహించని మెగా సర్‌ప్రైజ్ ఇచ్చారు దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ 'వారణాసి' (Varanasi) నుంచి ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్‌ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా 'మందాకిని' అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తోంది. తాజాగా ఈ పోస్టర్ వదులుతూ.. "ఆమె నవ్వితే అందం.. నవ్వకపోతే నిప్పు కణిక" రాజమౌళి వదిలిన ట్యాగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. క్షణాల్లోనే ఈ పోస్టర్ వైరల్ అయింది.ఈ 'వారణాసి' పోస్టర్‌లో మునుపెన్నడూ చూడని లుక్‌లో దర్శనమిచ్చి ఆశ్చర్యపరిచింది ప్రియాంక. పాత్ర స్వభావాన్ని ఎలివేట్ చేసేలా ఆసక్తికరమైన క్యాప్షన్ ఇస్తూ రాజమౌళి వదిలిన ఈ లుక్ చూసి మహేష్ బాబు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ పవర్ ఫుల్ పోస్టర్‌ను పంచుకుంటూ తన కో-స్టార్‌కు బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. అయితే ఈ పాత్ర కోసం తాను ఏకంగా 14 నెలలుగా కఠిన శిక్షణ తీసుకున్నానని, హాలీవుడ్ స్థాయి యాక్షన్ సీక్వెన్సులు, హై-వోల్టేజ్ స్లో-మోషన్ స్టంట్స్ ఇందులో ఉండబోతున్నాయని ప్రియాంక ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే.ఈ భారీ సినిమాను రూ. 1,200 నుంచి రూ. 1,500 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. హాలీవుడ్ స్టూడియోల భాగస్వామ్యంతో వరల్డ్ క్లాస్ వీఎఫ్ఎక్స్ (VFX) పనులు జరుగుతున్నాయి. పురాణాలు, చరిత్ర, సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ కలగలిపిన టైమ్-ట్రావెల్ కాన్సెప్ట్‌తో రాజమౌళి ఈ కథను సిద్ధం చేశారు. పవిత్ర నగరమైన వారణాసిని ఒక భారీ గ్రహశకలం ఢీకొట్టబోయే విపత్కర పరిస్థితుల్లో ఈ కథ మొదలవుతుంది. ఆ ప్రళయం నుంచి ప్రపంచాన్ని కాపాడేందుకు మహేష్ బాబు 'రుద్ర' అనే సాహసికుడిగా పురాతన విశ్వ శక్తిని వెతికే వేటలో అడుగుపెడతారు. ఈ సాహస యాత్రలో కథ త్రేతా యుగంలోని రామాయణ కాలం నుంచి నేటి కలియుగం వరకు ప్రయాణిస్తుంది. దట్టమైన ఆఫ్రికా అడవుల నుంచి అంటార్కిటికా మంచు ఖండాల వరకు సాగే ఈ ప్రయాణం ప్రేక్షకులకు రోమాలు నిక్కబొడుచుకునే అనుభూతిని ఇవ్వనుందని తెలుస్తోంది. అంతేకాదు మహేష్ బాబు 'శ్రీరాముడి' అవతారంలో కనిపించే ఓ ప్రత్యేక ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా నిలవనుందని తెలుస్తోంది.ఇకపోతే ఈ గ్లోబల్ ప్రాజెక్ట్‌లో మెయిన్ విలన్ 'కుంభ'గా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. విశేషమేమిటంటే.. ఈ సినిమా కోసం నటీనటులు ముందస్తుగా భారీ రెమ్యునరేషన్లు తీసుకోకుండా, లాభాల్లో వాటాలు పంచుకునే (Profit Sharing) హాలీవుడ్ మోడల్‌ను అనుసరిస్తున్నట్లు సమాచారం. అన్ని కార్యక్రమాలు చకచకా పూర్తి చేసి వచ్చే ఏడాది అనగా 2027 ఏప్రిల్ 7 వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు రాజమౌళి.Click here to add News18 as your preferred news source on Google. సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,Hyderabad,TelanganaFirst Published :Jul 18, 2026 10:39 AM ISTమరింత చదవండి

Source link