ప్రభన్యూస్

రిలయన్స్ ఫౌండేషన్ నౌపాంగ్ లీగ్‌కు ప్రతిష్టాత్మక అవార్డు.. ఆసియా అత్యుత్తమ గ్రాస్‌రూట్ టోర్నీగా ఘనత! |


Last Updated:

మిజోరంలో క్రీడాకారులను తీర్చిదిద్దుతున్న రిలయన్స్ ఫౌండేషన్ ‘నౌపాంగ్ లీగ్’ ఏషియన్ ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ అవార్డుల్లో అత్యుత్తమ గ్రాస్‌రూట్ కాంపిటీషన్‌గా ఎంపికైంది. డిసెంబర్‌లో జరిగే వేడుకల్లో నిర్వాహకులు ఈ అవార్డును అందుకోనున్నారు.

News18
News18

భారత ఫుట్‌బాల్ గ్రాస్‌రూట్ స్థాయిని బలోపేతం చేయడంలో రిలయన్స్ ఫౌండేషన్ యంగ్ చాంప్స్ (RFYC) చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. మిజోరంలో నిర్వహిస్తున్న నౌపాంగ్ లీగ్.. ఏషియన్ ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ (ఏఎఫ్‌సీ) స్పెషల్ గ్రాస్‌రూట్స్ అండ్ ఎలైట్ యూత్ ఫుట్‌బాల్ అవార్డ్స్ 2026 పోటీల్లో ‘బెస్ట్ గ్రాస్‌రూట్ కాంపిటీషన్’ పురస్కారానికి ఎంపికైంది. డిసెంబర్ 2026లో ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. మిజోరం ఫుట్‌బాల్ అసోసియేషన్ భాగస్వామ్యంతో 2022లో ప్రారంభమైన ఈ లీగ్ ద్వారా ఐజ్వాల్, చంపై, కోలాసిబ్, లుంగ్లీ జిల్లాల్లోని అండర్-8 నుంచి అండర్-14 విభాగాల చిన్నారులకు ఏడాది పొడవునా మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. గత నాలుగు సీజన్లలో 200 జట్లకు చెందిన 3 వేల మందికి పైగా క్రీడాకారులు 9,804 మ్యాచ్‌లు ఆడి తమ ప్రతిభను చాటుకున్నారు.

గ్రాస్‌రూట్ స్థాయి శిక్షణలో సరికొత్త అధ్యాయం

ఈ లీగ్ ద్వారా మైదానంలో ఆటగాళ్లకు నాణ్యమైన సమయం కేటాయించడమే కాకుండా స్థానిక కోచ్‌లు, రిఫరీలకు కూడా విస్తృత అవకాశాలు కల్పిస్తున్నారు. నాలుగో సీజన్‌లో భాగంగా 16 మంది స్థానిక కోచ్‌లు ఏఎఫ్‌సీ ‘సి’ డిప్లొమా సర్టిఫికేషన్ సాధించగా, 350 మందికి పైగా మెంటార్లు మ్యాచ్‌లలో భాగస్వామ్యమయ్యారు.

ఐజ్వాల్‌లో జరిగే మ్యాచ్‌లలో దాదాపు 90 శాతం కంటే ఎక్కువ మ్యాచ్‌లను అర్హత కలిగిన రిఫరీలే నడిపిస్తున్నారు. నాలుగు జిల్లాల్లోని తొమ్మిది మైదానాల్లో ఆడే చిన్నారులకు జెర్సీలు, ఆట సామగ్రి, అల్పాహారంతో పాటు అంబులెన్స్, నర్సుల పర్యవేక్షణ వంటి ఉచిత అత్యవసర వైద్య సేవలను రిలయన్స్ ఫౌండేషన్ స్వయంగా సమకూరుస్తోంది.

ఈ ఘనత మిజోరం క్రీడారంగానికి దక్కిన గొప్ప గౌరవమని రాష్ట్ర క్రీడల మంత్రి లాల్‌ఘింగ్లోవా హ్మర్ హర్షం వ్యక్తం చేశారు. దేశంలోని ప్రతి చిన్నారి ఆటల్లో రాణించాలనే లక్ష్యంతో రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్‌పర్సన్ నీతా అంబానీ ప్రారంభించిన ఈ ప్రయాణం రేపటి భారత ఫుట్‌బాల్ రంగానికి బంగారు బాటలు వేస్తోందని నిర్వాహకులు పేర్కొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 05 November 2026, 10:11 pm Digital Edition : Prabhanews
రిలయన్స్ ఫౌండేషన్ నౌపాంగ్ లీగ్‌కు ప్రతిష్టాత్మక అవార్డు.. ఆసియా అత్యుత్తమ గ్రాస్‌రూట్ టోర్నీగా ఘనత! |

Last Updated:Nov 05, 2026 10:00 PM ISTమిజోరంలో క్రీడాకారులను తీర్చిదిద్దుతున్న రిలయన్స్ ఫౌండేషన్ ‘నౌపాంగ్ లీగ్’ ఏషియన్ ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ అవార్డుల్లో అత్యుత్తమ గ్రాస్‌రూట్ కాంపిటీషన్‌గా ఎంపికైంది. డిసెంబర్‌లో జరిగే వేడుకల్లో నిర్వాహకులు ఈ అవార్డును అందుకోనున్నారు.News18భారత ఫుట్‌బాల్ గ్రాస్‌రూట్ స్థాయిని బలోపేతం చేయడంలో రిలయన్స్ ఫౌండేషన్ యంగ్ చాంప్స్ (RFYC) చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. మిజోరంలో నిర్వహిస్తున్న నౌపాంగ్ లీగ్.. ఏషియన్ ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ (ఏఎఫ్‌సీ) స్పెషల్ గ్రాస్‌రూట్స్ అండ్ ఎలైట్ యూత్ ఫుట్‌బాల్ అవార్డ్స్ 2026 పోటీల్లో ‘బెస్ట్ గ్రాస్‌రూట్ కాంపిటీషన్’ పురస్కారానికి ఎంపికైంది. డిసెంబర్ 2026లో ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. మిజోరం ఫుట్‌బాల్ అసోసియేషన్ భాగస్వామ్యంతో 2022లో ప్రారంభమైన ఈ లీగ్ ద్వారా ఐజ్వాల్, చంపై, కోలాసిబ్, లుంగ్లీ జిల్లాల్లోని అండర్-8 నుంచి అండర్-14 విభాగాల చిన్నారులకు ఏడాది పొడవునా మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. గత నాలుగు సీజన్లలో 200 జట్లకు చెందిన 3 వేల మందికి పైగా క్రీడాకారులు 9,804 మ్యాచ్‌లు ఆడి తమ ప్రతిభను చాటుకున్నారు.గ్రాస్‌రూట్ స్థాయి శిక్షణలో సరికొత్త అధ్యాయంఈ లీగ్ ద్వారా మైదానంలో ఆటగాళ్లకు నాణ్యమైన సమయం కేటాయించడమే కాకుండా స్థానిక కోచ్‌లు, రిఫరీలకు కూడా విస్తృత అవకాశాలు కల్పిస్తున్నారు. నాలుగో సీజన్‌లో భాగంగా 16 మంది స్థానిక కోచ్‌లు ఏఎఫ్‌సీ ‘సి’ డిప్లొమా సర్టిఫికేషన్ సాధించగా, 350 మందికి పైగా మెంటార్లు మ్యాచ్‌లలో భాగస్వామ్యమయ్యారు.ఐజ్వాల్‌లో జరిగే మ్యాచ్‌లలో దాదాపు 90 శాతం కంటే ఎక్కువ మ్యాచ్‌లను అర్హత కలిగిన రిఫరీలే నడిపిస్తున్నారు. నాలుగు జిల్లాల్లోని తొమ్మిది మైదానాల్లో ఆడే చిన్నారులకు జెర్సీలు, ఆట సామగ్రి, అల్పాహారంతో పాటు అంబులెన్స్, నర్సుల పర్యవేక్షణ వంటి ఉచిత అత్యవసర వైద్య సేవలను రిలయన్స్ ఫౌండేషన్ స్వయంగా సమకూరుస్తోంది.ఈ ఘనత మిజోరం క్రీడారంగానికి దక్కిన గొప్ప గౌరవమని రాష్ట్ర క్రీడల మంత్రి లాల్‌ఘింగ్లోవా హ్మర్ హర్షం వ్యక్తం చేశారు. దేశంలోని ప్రతి చిన్నారి ఆటల్లో రాణించాలనే లక్ష్యంతో రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్‌పర్సన్ నీతా అంబానీ ప్రారంభించిన ఈ ప్రయాణం రేపటి భారత ఫుట్‌బాల్ రంగానికి బంగారు బాటలు వేస్తోందని నిర్వాహకులు పేర్కొన్నారు.మరింత చదవండి

Source link